Search This Blog
Chodavaramnet Followers
Showing posts with label Lord Siva Bhakthi Articles. Show all posts

Wednesday, 20 February 2019
Thursday, 30 August 2018
SECRET BEHIND THILAKAM ON SHIVA LINGAM
శివడు లింగాకారం పైన మూడు తిలకాలను దిద్దుతారు వాటి యొక్క రహస్యము.
1. మొదటిది బ్రహ్మ కి గుర్తు
2. రెండవది విష్ణువు కి గుర్తు
3. మూడవది శంకరుడు కి గుర్తు
మద్యలో గంధాన్ని బిందువుగా పెడతారు, అది పరమాత్మని యొక్క స్మృతి చిహ్నమునకు గుర్తు అదే పరమాత్మని యొక్క యథార్థ స్వరూపం.
1. పరమాత్ముని నామం సదా శివ,
2. సదా శివ అంటే
సదా - ఎల్లప్పుడూ , శివ అనగా కళ్యాణకారి " మంగళకారి " మరియు "శుభకారి"
3. పరమాత్మ జ్యోతిర్బిందు స్వరూపుడైన చైతన్య మూర్తి ఇతనికి స్థూల సూక్ష్మ స్వరూపములు రెండూ లేవు.
4. పరమాత్మ బ్రహ్మా-విష్ణు-శంకరుల సూక్ష్మలోకాలకు పైన బ్రహ్మలోకంలో (ముక్తిధామంలో) ఉంటారు.
5. పరమాత్మ త్రిమూర్తి, అనగా బ్రహ్మా, విష్ణు, శంకరులను కూడ సృష్టించినవాడు.
6. పరమపిత పరమాత్మ బ్రహ్మా ద్వారా సృష్టి స్థాపన, విష్ణువు ద్వారా పాలన, శంకరుని ద్వారా మహావినాశనము,
ఈ ముగ్గురు చేత మూడు కర్తవ్యాలను చేయించువాడు పరమాత్మడు అందుకే ఇంగ్లీష్ లో GOD అంటారు.
7. లింగం శబ్ధము లీనము అనగా వస్తువును తెలియపరచు చిహ్నమని మరియు లక్షణములు చూపించేది అని
అర్థము. పరమాత్మ లక్షణములు చూపించేది కావున శివలింగం అని అంటారు .
8. ఓం నమః శివాయ అంటే
ఓం - నేను ఆత్మను
నమః - నమస్కారం
శివాయ -పరమాత్మడు
ఆత్మనైనా నేను పరమాత్మకి నమస్కారం చేస్తున్నాను అని అర్ధం.

Friday, 28 July 2017
SIVAYA NAMAHA
శివాయ నమః ||
ద్వాదశ జ్యోతిర్లిఙ్గ స్తోత్రమ్ |
సౌరాష్ట్రదేశే విశదేఽతిరమ్యే జ్యోతిర్మయం చన్ద్ర కలావతంసమ్ |
భక్తిప్రదానాయ కృపావతీర్ణం తం సోమనాథం శరణం ప్రపద్యే ||౧||
శ్రీశైలశృఙ్గే విబుధాతిసఙ్గే తులాద్రితుఙ్గేఽపి ముదా వసన్తమ్ |
తమర్జునం మల్లికపూర్వమేకం నమామి సంసారసముద్రసేతుమ్ ||౨||
అవన్తికాయాం విహితావతారం ముక్తిప్రదానాయ చ సజ్జనానామ్ |
అకాలమృత్యోః పరిరక్షణార్థం వన్దే మహాకాలమహాసురేశమ్ ||౩||
కావేరికానర్మదయోః పవిత్రే సమాగమే సజ్జనతారణాయ |
సదైవ మాన్ధాతృపురే వసన్తమోఙ్కారమీశం శివమేకమీడే ||౪||
పూర్వోత్తరే ప్రజ్వలికానిధానే సదా వసన్తం గిరిజాసమేతమ్ |
సురాసురారాధితపాదపద్మం శ్రీవైద్యనాథం తమహం నమామి ||౫||
యామ్యే సదఙ్గే నగరేఽతిరమ్యే విభూషితాఙ్గం వివిధైశ్చ భోగైః |
సద్భక్తిముక్తిప్రదమీశమేకం శ్రీనాగనాథం శరణం ప్రపద్యే ||౬||
మహాద్రిపార్శ్వే చ తటే రమన్తం సమ్పుజ్యమానం సతతం మునీన్ద్రైః |
సురాసురైర్యక్షమహోరగాద్యైః కేదారమీశం శివమేకమీడే ||౭||
సహ్యాద్రిశీర్షే విమలే వసన్తం గోదావరీతీరపవిత్రదేశే |
యద్దర్శనాత్పాతకమాశు నాశం ప్రయాతి తం త్ర్యమ్బకమీశమీడే ||౮||
సుతామ్రపర్ణీజలరాశియోగే నిబధ్య సేతుం విశిఖైరసంఖ్యైః |
శ్రీరామచన్ద్రేణ సమర్పితం తం రామేశ్వరాఖ్యం నియతం నమామి ||౯||
యం డాకినీశాకినికాసమాజైర్నిషేవ ్యమాణం పిశితాశనైశ్చ |
సదైవ భీమాదిపదప్రసిద్ధ్ం తం శఙ్కరం భక్తహితం నమామి ||౧౦||
సానన్దమానన్దవనే వసన్తమానన్దకన్దం హతపాప వౄన్దమ్ |
వారాణసీనాథమనాథనాథం శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే ||౧౧||
ఇలాపురే రమ్యవిశాలకేఽస్మిన్సముల్లసన ్తం చ జగద్వరేణ్యమ్ |
వన్దే మహోదారతరస్వభావం ఘృష్ణేశ్వరాఖ్యం శరణం ప్రపద్యే ||౧౨||
జ్యోతిర్మయద్వాదశలిఙ్గకానాం శివాత్మనాం ప్రోక్తమిదం క్రమేణ |
స్తోత్రం పఠిత్వా మనుజోఽతిభక్త్యా ఫలం తదాలోక్య నిజం భజేచ్చ ||౧౩||
ద్వాదశ జ్యోతిర్లిఙ్గ స్తోత్రమ్ |
సౌరాష్ట్రదేశే విశదేఽతిరమ్యే జ్యోతిర్మయం చన్ద్ర కలావతంసమ్ |
భక్తిప్రదానాయ కృపావతీర్ణం తం సోమనాథం శరణం ప్రపద్యే ||౧||
శ్రీశైలశృఙ్గే విబుధాతిసఙ్గే తులాద్రితుఙ్గేఽపి ముదా వసన్తమ్ |
తమర్జునం మల్లికపూర్వమేకం నమామి సంసారసముద్రసేతుమ్ ||౨||
అవన్తికాయాం విహితావతారం ముక్తిప్రదానాయ చ సజ్జనానామ్ |
అకాలమృత్యోః పరిరక్షణార్థం వన్దే మహాకాలమహాసురేశమ్ ||౩||
కావేరికానర్మదయోః పవిత్రే సమాగమే సజ్జనతారణాయ |
సదైవ మాన్ధాతృపురే వసన్తమోఙ్కారమీశం శివమేకమీడే ||౪||
పూర్వోత్తరే ప్రజ్వలికానిధానే సదా వసన్తం గిరిజాసమేతమ్ |
సురాసురారాధితపాదపద్మం శ్రీవైద్యనాథం తమహం నమామి ||౫||
యామ్యే సదఙ్గే నగరేఽతిరమ్యే విభూషితాఙ్గం వివిధైశ్చ భోగైః |
సద్భక్తిముక్తిప్రదమీశమేకం శ్రీనాగనాథం శరణం ప్రపద్యే ||౬||
మహాద్రిపార్శ్వే చ తటే రమన్తం సమ్పుజ్యమానం సతతం మునీన్ద్రైః |
సురాసురైర్యక్షమహోరగాద్యైః కేదారమీశం శివమేకమీడే ||౭||
సహ్యాద్రిశీర్షే విమలే వసన్తం గోదావరీతీరపవిత్రదేశే |
యద్దర్శనాత్పాతకమాశు నాశం ప్రయాతి తం త్ర్యమ్బకమీశమీడే ||౮||
సుతామ్రపర్ణీజలరాశియోగే నిబధ్య సేతుం విశిఖైరసంఖ్యైః |
శ్రీరామచన్ద్రేణ సమర్పితం తం రామేశ్వరాఖ్యం నియతం నమామి ||౯||
యం డాకినీశాకినికాసమాజైర్నిషేవ
సదైవ భీమాదిపదప్రసిద్ధ్ం తం శఙ్కరం భక్తహితం నమామి ||౧౦||
సానన్దమానన్దవనే వసన్తమానన్దకన్దం హతపాప వౄన్దమ్ |
వారాణసీనాథమనాథనాథం శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే ||౧౧||
ఇలాపురే రమ్యవిశాలకేఽస్మిన్సముల్లసన
వన్దే మహోదారతరస్వభావం ఘృష్ణేశ్వరాఖ్యం శరణం ప్రపద్యే ||౧౨||
జ్యోతిర్మయద్వాదశలిఙ్గకానాం
స్తోత్రం పఠిత్వా మనుజోఽతిభక్త్యా ఫలం తదాలోక్య నిజం భజేచ్చ ||౧౩||
Wednesday, 28 June 2017
INFORMATION ABOUT ASTAMOORTHI LINGAMULU AROUND THE WORLD
అష్టమూర్తి లింగములు
పంచభూతలింగములు అనగానే అయిదు క్షేత్రములు గుర్తుకు వస్తాయి.
1. పృథ్వీలింగం - కాంచీపురంలోని ఏకామ్రేశ్వర లింగము
2. జలలింగం - తమిళనాడులోని తిరుచునాపల్లి శ్రీరంగానికి సమీపంలోని జంబుకేశ్వర లింగం
3. అగ్నిలింగం - అరుణాచలంలోని అరుణాచలేశ్వర లింగం
4. వాయులింగం - శ్రీకాళహస్తీశ్వర మహాలింగం
5. ఆకాశలింగం - చిదంబరేశ్వర లింగం
ఈఅయిదు ఉన్న క్షేత్రం ఈ శరీరం.
6. సూర్యలింగం: ప్రొద్దున్నే ఆకాశంలో చూస్తే కనపడుతుంది. సూర్యలింగం ప్రత్యక్షం. ఇది కోణార్క్ లో ఉన్నది. ఇది శిల్పులు చెక్కిన ఆలయం కాదు. దీని గురించి పురాణాలలో ఉన్నది. కాశీలో గభస్తీశ్వరుడు, లోలార్కేశ్వరుడు అను పేర్లతో శివుడు సూర్య రూపంలో ఉన్నాడు.
7. చంద్రలింగం: ఇదీ ప్రత్యక్షమే. ప్రభాస క్షేత్రంలో ఉన్న సోమనాధ జ్యోతిర్లింగం. ఇది జ్యోతిర్లింగం అయినప్పటికీ చంద్రకళలతో ఉంది. సోమశిల సోమేశ్వర క్షేత్రమే. పంచారామాలలో సోమారమమనే క్షేత్రం మనకి కనపడుతూ ఉన్నది. ఇక్కడ విశేషం ఏమిటంటే శుక్లపక్షంలో తెల్లదనం రోజు రోజుకూ పెరుగుతూ ఉంటుంది. కృష్ణపక్షంలో క్రమంగా తరుగుతూ ఉంటుంది. భారతీయ దేవాలయాలలో వైజ్ఞానిక దైవత్వ రహస్యం అత్యంత ఆశ్చర్యకరం. ఇటువంటి దివ్య క్షేత్రాలు భారతదేశంలో అందునా హిందువులకు మాత్రమే ఉన్నాయి అని మనం సగర్వంగా, సానందంగా చెప్పుకోవచ్చు.
8. యజమాన లింగం: నేపాల్ క్షేత్రంలో పశుపతి లింగం పేరుతో మనకి కనపడుతూ ఉన్నది.
Sunday, 28 May 2017
Thursday, 5 January 2017
Friday, 30 December 2016
Wednesday, 21 December 2016
GRACE OF LORD SIVA - LORD MAHADEV
శివానుగ్రహం అత్యంత సులభతరం
బ్రహ్మ - సృష్టికర్త
విష్ణువు - సృష్టి పాలకుదు
మహేశ్వరుడు - సృష్టి లయ కారకుడు
ఇది స్థూలంగా చెప్పబడే విషయం. ఇక వివరాలకొస్తే వివిధ సంప్రదాయాలను బట్టి, సిద్ధాంతాలను బట్టి, ప్రాంతాలను బట్టి, కాలానుగుణంగా ఆయా దేవుళ్ళకు సంబంధించిన కధలు, నమ్మకాలు, ఆరాధనామార్గాలు మారుతుంటాయి.
శివుని పుట్టుక గురించి అనేక కథలు ఉన్నాయి. విష్ణు పురాణంలో శివుడు బ్రహ్మ కుమారుడని ఉన్నది. మధు, కైటభులు అను రాక్షసులు బ్రహ్మను చంపటానికి రాగా, విష్ణువు వారిని తీక్షణంగా చూస్తాడు. ఆ సందర్భములో విష్ణువు నుదుటి నుండి శివుడు త్రిశూలాన్ని ధరించి జన్మించాడని మరొక ఇతిహాసములో ఉన్నది.
మరొక ఇతిహాసములో.. "బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులగు త్రిమూర్తులకు జన్మనిచ్చింది ఆది పరాశక్తి అగు శ్రీ రాజరాజేశ్వరీ దేవి. అప్పుడు రాజరాజేశ్వరీ దేవికి మూడవ నేత్రం ఉండేది. అనంతరం, తనను ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు వివాహమాడవలసిందిగా కోరింది. మొదట ముగ్గురూ నిరాకరించారు. ఆమె నచ్చచెప్పిన పిమ్మట, శివుడు తనని వివాహమాడేందుకు అంగీకరించి, ఒక షరతు పెట్టాడు. అది, తనను (ఆది పరాశక్తిని) వివాహమాడిన అనంతరం మూడవ నేత్రం శివునికి ఇవ్వాలి. అందుకు ఆ దేవత అంగీకరించి, వివాహానంతరం శివునికి మూడవ నేత్రమును ఇచ్చింది. అప్పుడు శివుడు ఆ మూడవ నేత్రముతో ఆ దేవతను భస్మం చేసి, ఆ భస్మరాశిని మూడు భాగాలుగా విభజించి, లక్ష్మి, సరస్వతి, పార్వతిలను సృష్టించాడు." అని ఉన్నది.
* శివసిద్ధి
ఆధ్యాత్మిక జీవితానికి అంకితమైన అనేకమంది ద్వంద్వ భావాలతో సందేహాలతో సతమతమవుతుంటారు. ముఖ్యంగా 'నేను' అనే భావననుంచి, దానికి సంబంధించిన 'అహంకారం'నుంచి బయటపడేందుకు బహువిధాలుగా ప్రయాస పడుతుంటారు. మాయ ఎంత బలీయమైనదంటే- ఒక్క క్షణంలోనే చంచలత్వాన్ని మనసులోకి ప్రవేశపెట్టేస్తుంది. అయోమయం ఆవహింపజేస్తుంది. మహాత్ములు సైతం తమ సాధనా కాలంలో ఈ దురవస్థలతో బాధపడినవారే.
సాక్షాత్తు శివాంశ సంభూతునిగా చెప్పుకొనే ఆదిశంకరులకూ ఇలాంటి అవస్థ ఒకసారి కలిగింది. మార్గంలో ఒక చండాలుడు ఎదురైనప్పుడు ఆదిశంకరులు ఏవగింపుతో 'తప్పుకో... తప్పుకో...' అని మందలించగా, అతడు నవ్వుతూ 'స్వామీ! తమరు దేన్ని తప్పుకోమంటున్నారు? అశాశ్వతమైన ఈ శరీరాన్నా, అనంతస్వరూపమైన ఆత్మనా?' అని ప్రశ్నించాడు. తక్షణం ఆదిశంకరుల్లో అజ్ఞానపు తెర మటుమాయమైంది. తదనంతర కాలంలో ఆయనలోంచి శివతత్వం గంగా తరంగాలుగా ప్రవహించింది. శివానందలహరి, సౌందర్యలహరి, భజగోవిందం వంటి అనితర సాధ్యమైన రచనలను భక్త లోకానికి అందించారు.
'శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు' అనటంలోని ఆంతర్యం- చీమనుంచి బ్రహ్మవరకు సర్వం శివాజ్ఞకు లోబడి ఉంటుందనే. సమస్త విశ్వమూ, సృష్టిలోని అణువణువూ శివమయమే. శివం కానిది 'శవ'మంటారు జ్ఞానులు. అంటే మృతపదార్థమని అర్థం. శివమే సత్యం, శివమే సుందరం, శివమే నిత్యం. శివమే అనంతం. శివమే జ్ఞానం. శివమే చైతన్యం. శివమే సర్వజగత్తులకు మూలాధారం. అనేక లక్షల జన్మల అనంతరం లభించే మానవజన్మ, ముక్తి సోపానానికి ముందుమెట్టు లాంటిది. దీన్ని సద్వినియోగం చేసుకోవాలంటే శివభక్తిని వదలకూడదు.
శివానందలహరిలో ఒక శ్లోకముంది. సారాంశం ఏమిటంటే- శివుని పేరు పలికే నాలుకే నాలుక, శివుని దర్శించే కన్నులే కన్నులు, శివుని పూజించే చేతులే చేతులు. శివుని సదా స్మరించేవాడే ధన్యుడు.
పరిపూర్ణ జ్ఞానస్థితికి చేరుకున్న ఆదిశంకరులను 'నీవెవరు?' అని అడిగినప్పుడు- 'చిదానంద రూపం శివోహం శివోహం'- నేను చిదానంద స్వరూపుడనైన శివుణ్ని. మిగతా మరేమీ కాను అని ఆత్మస్థితిలో చెప్పగలిగారు. అదే 'శివసిద్ధి'. అంటే, సాధకుడు అనేక జన్మలనుంచి అనుభవిస్తున్న అజ్ఞానపు పొరల్ని ఒక్కొక్కటిగా చీల్చుకుంటూ బయటికి వచ్చి, తనను తాను చూసుకున్నప్పుడు, తాను ఆత్మననీ, అనగా సాక్షాత్తు శివస్వరూపమని గ్రహిస్తాడు. పూజలు, అర్చనలు, ప్రార్థనలు, ఉపవాసాలు, తపస్సులు, గురుశుశ్రూషలు- ఇవన్నీ ఈ అత్యున్నత స్థితిని అందుకోవటానికే.
శివానుగ్రహం అత్యంత సులభతరం. అందరికీ అందుబాటులో ఉంచటానికే- బిల్వార్చన, రుద్రాక్షధారణం, విభూతి లేపనం, అభిషేకంవంటి అతి సామాన్య విధానాలను పరమశివుడు భక్తుల కోసం ఏర్పరచాడంటారు.
జీవితకాలంలో మన ప్రతి చర్యనూ శివారాధన భావనతో ఆచరించడానికి మనసును అనుక్షణం హెచ్చరిస్తూ, అప్రమత్తంగా ఉంచుతుండాలి. అప్పుడు మనం సదా శివసాన్నిధ్యంలో ఉన్నట్లే. క్రమంగా అదే మన ఆత్మకు శివసిద్ధిని కలిగిస్తుంది. అదే పరమపదం.
* శివుని అవతారాలు
ఆదిదేవుడు
రుద్రుడు
పరమశివుడు
గంగాధరుడు
గౌరీపతి
నటరాజు
కైలాసాధిపతి
పశుపతి
గరళకంఠుడు
హరుడు
చంద్రమౌళి
ముక్కంటి
పాలాక్షుడు
చంద్రశేఖరుడు
నీలకంఠుడు
దక్షిణామూర్తి

Monday, 28 November 2016
Monday, 4 April 2016
Monday, 21 December 2015
Monday, 21 September 2015
Monday, 15 December 2014
MONDAY LORD SIVA MAHADEVS PRAYER
సోమవారం శివదర్శనం సర్వ పాప హరణం
శివారాధన జరిగే ఇంట్లో మహాలక్ష్మి తాండవం చేస్తుంది.
యముడికి యముడే "శివుడు"
పుణ్య క్షేత్రాలకి తిరిగితే పాపాలను పోగొట్టుకొని, లోపల ఉన్న శివున్ని చూడగలుగుతావు.
ఏడిపించేవాడు ఆయనే, పోగొట్టేవాడు ఆయనే.
రుద్రాభిషేకం వల్ల "ఆరోగ్యం/ప్రాణ శక్తీ" బాగుంటాయి.
ప్రతీ స్త్రీ మూర్తిలో అమ్మవారిని చూడాలి.
శివభావన కలిగితే చెడు ఆలోచనలు రావు.
పరస్పర ద్వేషం పోవాలంటే శివుడిని తలుచుకో.
శివాలయానికి ఎంత మంది భక్తులు వచ్చినా, నంది మాత్రం శివుడునే చూస్తూ ఉంటాడు.
ఎప్పుడు నువ్వు శివుడి మీద మనస్సు పెడితే నువ్వు కూడా నందివి అవుతావు.
మనకి ప్రారబ్ధ కర్మలు ఉన్నప్పటికీ "భగవానుడి" ఆశ్రయంతో తొలగించుకోవచ్చు.

Saturday, 8 November 2014
SIVABHISHEKA PHALAMULU - LORD SIVA PRAYERS AND ITS RESULTS
శివాభిషేక ఫలములు
1 గరిక నీటితో శివాభిషేకము చేసిన నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలడు.
2 నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యువు నశించ గలదు.
3 ఆవు పాల అభిషేకం సర్వ సౌఖ్యములను ప్రసాదించును.
4 పెరుగుతో అభిషేకించిన బలము, ఆరోగ్యము, యశస్సు లభించును.
5 ఆవు నేయితో అభిషేకించిన ఐశ్వర్య ప్రాప్తి కలుగును
6 చెరకు రసముతో అభిషేకించిన ధన వృద్ది కలుగును.
7 మెత్తని చేక్కరతో అభిషేకించిన దుఃఖ నాశనము కలుగును.
8 మారేడు బిల్వదళ జలము చేత అభిషేకము చేసిన భోగభాగ్యములు లభించును.
9 తేనెతో అభిషేకించిన తేజోవృద్ది కలుగును.
10 పుష్పోదకము చేత అభిషేకించిన భూలాభము కలుగును.
11 కొబ్బరి నీటితో అభిషేకము సకల సంపదలను కలిగించును.
12 రుద్రాక్ష జలాభిషేకము సకల ఐశ్వర్యములనిచ్చును.
13 భస్మాభిషేకంచే మహా పాపాలు నశించును.
14 గందోదకము చేత అభిషేకించిన సత్పుత్ర ప్రాప్తి కలుగును.
15 బంగారపు నీటితో అభిషేకము వలన ఘోర దారిద్రము నశించును.
16 నీటితో అభిషేకించిన నష్టమైనవి తిరిగి లభించును.
17 అన్నముతో అభిషేకించిన అధికార ప్రాప్తి, మోక్షము మరియు దీర్ఘాయువు లభించును. శివపూజలో అన్న లింగార్చనకు ప్రత్యేక ప్రాధాన్యత కలదు - పెరుగు కలిపిన అన్నముతో శివ లింగానికి మొత్తంగా అద్ది (మెత్తుట) పూజ చేయుదురు - ఆ అద్దిన అన్నాన్ని అర్చనానంతరము ప్రసాదముగా పంచి పెట్టెదరు, చూడటానికి ఎంతో చాలా బాగుంటుంది అన్న లింగార్చన).
18 ద్రాక్షా రసముచే అభిషేక మొనర్చిన ప్రతి దానిలో విజయము లభించగలదు.
19 ఖర్జూర రసముచే అభిషేకము శత్రుహానిని హరింప జేస్తుంది.
20 నేరేడు పండ్ల రసముచే అభిషేకించిన వైరాగ్య సిద్ది లభించును.
21 కస్తూరి కలిపిన నీటిచే అభిషేకించిన చక్రవర్తివ్తము లభించును.
22 నవరత్నోదకము చే అభిషేకము ధాన్యము, గృహ, గోవృద్దిని కలిగించును.
23 మామిడి పండ్ల రసము చేత అభిషేకము చేసిన దీర్ఘ వ్యాధులు నశించును.
24 పసుపు నీటితో అభిషేకించిన మంగళ ప్రదము అగును - శుభ కార్యములు జరుగ గలవు.

Saturday, 1 November 2014
SREE KALAHASTHISWARA SATAKAM POEMS AND MEANING
శ్రీ కాళహస్తీశ్వరా!.
,
అంతా సందయమే శరీర ఘటనం బంతా విదారంబె లో
నంతా దుఃఖపరంపరాన్వితమే మే నంతా భయభ్రాంతమే
యంతానంత శరీరశోషణమే దు ర్వ్యాపారమే దేహికిన్
చింతన్నిన్నుదలంచి పొందురు నరుల్ శ్రీ కాళహస్తీశ్వరా!
.
పరీక్షించి చూడగా శరీరంతయును భయ భ్రాంతులచేత కూడినట్టిదే.
విచారించి చూడగా జరుగుతున్నదంతా శరీరమును శుధ్కింపచేసే విషయాలే.
లోపల ఉన్న జీవుడు ఒక దుఃఖంలోకి పడినట్లుగా ఒక జన్మ నుంచి ఇంకొక జ్న్మానికి చేసే ప్రయాణమే.
ఈ ప్రపంచమంతా సందేహాలమయమే.
అయినా ఈ మనుష్యులు తమ మనస్సులలో నిన్ను గురించి అలోచించి
నిన్ను చేరుకొనే ప్రయత్నం చేయటంలేదు.

Monday, 13 October 2014
Subscribe to:
Posts (Atom)