Search This Blog

Chodavaramnet Followers

Showing posts with label Vusirikaya Tips/Osirikaya Tips. Show all posts
Showing posts with label Vusirikaya Tips/Osirikaya Tips. Show all posts

Monday, 21 November 2016

HOW TO OVERCOME SEASONAL HEALTH PROBLEMS WITH VUSIRIKAYA / OSIRIKAYA


 ఉసిరి ఎంత మంచిదంటే 

చలికాలంలో లభించే ఉసిరి ఆరోగ్యానికి దివ్యౌషధంగా పనిచేస్తుంది. ఉసిరిలో విటమిన్‌ సి అధికంగా లభిస్తుంది. దీనితోపాటు ఐరన్‌, కాల్షియం, పాస్ఫరస్‌ వంటి పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. పచ్చడి, మురబ్బా, క్యాండీ, జ్యూస్‌.. ఇలా ఏ రూపంలో తీసుకున్నా ఆరోగ్యానికి మంచిదే. ఉసిరి కాయలు నేరుగా కూడా తినేయొచ్చు. డ్రై ఆమ్లా క్యాండీలు కూడా చప్పరించేయొచ్చు.

* గొంతు మంట, జలుబుతో బాధపడేవారు 2 టీస్పూన్లఉసిరి పొడి, 2 టీస్పూన్ల తేనె కలిపి తీసుకుంటే చక్కటి ఫలితం ఉంటుంది.

* ఇందులో ఉన్న పీచుపదార్థం మలబద్ధకాన్ని నివారిస్తుంది.

* రోజూ పరగడుపున ఉసిరి రసం పుక్కిలించడం ద్వారా నోటిలో వచ్చే పుండ్ల నుంచి ఉపశమనం లభిస్తుంది. దగ్గు, ఫ్లూ వంటి సమస్యలకు ఇది మంచి ఔషధంగా పనిచేస్తుంది.

* ఆర్థరైటిస్‌ వంటి కీళ్ల నొప్పుల నివారణకు ఎండు ఉసిరి ఉపయోగపడుతుంది.

* రోజువారీ ఆహారంలో ఉసిరి ఉండేలా చూసుకుంటే బరువు తగ్గడంతో పాటు జీర్ణశక్తి కూడా పెరుగుతుంది.

* దీనిలో ఉండే ఔషధ గుణాల వల్ల ఇది సహజసిద్ధమైన కండిషనర్‌గా పనిచేస్తుంది.
ఉసిరి నూనె వాడకం జుట్టు తెల్లబడటాన్ని తగ్గించడంతోపాటు ఆరోగ్యవంతమైన కేశసంపదను అందిస్తుంది. కుదుళ్లకు తగిన బలాన్నిచ్చి జుట్టు పెరగడానికి తోడ్పడుతుంది.

* తరచూ ఉసిరిని ఆహారంలో తీసుకుంటే ఆరోగ్యంతో పాటు చర్మానికి మంచి మెరుపు వస్తుంది. కంటి చూపును మెరుగుపరుస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు బ్లడ్‌ షుగర్‌ను అదుపులో ఉంచుతుంది.

* ఉసిరి రసం రోజూ తీసుకుంటే శరీరంలో చెడు కొలెసా్ట్రల్‌ స్థాయులు తగ్గి, గుండె పనితీరు మెరుగు పడుతుంది.

* శరీరం నుంచి చెడు టాక్సిన్లను బయటకు పంపడానికి ఉసిరి రసం సహాయపడుతుంది.

Saturday, 26 December 2015

HEALTH BENEFITS WITH USING VUSIRIKAYA


ఉసిరి కాయ లో అనేక ఔషధగుణములు వున్నాయి 

ఉసిరి కాయలలో విటమిన్ 'సీ' అధికముగా వున్నది. దీన్ని తిన్నందు వల్ల శరీరానికి రోగ నిరోధక శక్తి పెరుగును. శరీరానికి చల్లదనాన్నిచ్చి మల మూత్ర విసర్జన సక్రమముగా జరుగును. చక్కెర వ్వాది గ్రస్తులు దీనిని వాడినందున ఇంసులిన్ ఉత్పత్తికి అనుకూలించి రక్తంలోని చెక్కెరను తగ్గించును. జ్ఞాపక శక్తినిచ్చే మందులలో దీనిని ఎక్కువగా వాడుతారు. అదే విదంగా కురుల ఆరోగ్యానికి కూడు ఉసిరి కాయలను ఎక్కువగా ఉపయోగిస్తారు. ఉపిరి తిత్తులు ,కాలేయం , జీర్ణమండలం , గుండె -దీని పరిదిలోనికి వస్తాయి .

జీర్ణమండలం :
దాహం ,మంట,వాంతులు ,ఆకలిలేకపోవుట ,చిక్కిపోవుట ,ఎనీమియా ,హైపర్ -ఎసిడిటి , మున్నకు జీర్ణ మండల వ్యాదులను తగ్గిస్తుంది .

ఉపిరితిత్తులు :
ఆస్తమా ,బ్రాంకైటిస్ ,క్షయ ,శ్వాసనాలముల వాపు , ఉపిరితిత్తులనుండి రక్తము పడుట మున్నగు వ్యాదులను నయం చేస్తుంది .

గుండె :
ఎన్నో రకాల గుండె జబ్బులను నయం చేస్తుంది . ఉసిరి వల్ల ఆహారములోని ఇనుము ఎక్కువగా గ్రహించబడుటకు తోడ్పడుతుంది . శరీరము లో ఎక్కువగా ఉండే కొవ్వులను తగ్గిస్తుంది .

కాలేయము :
కామెర్లు ఉసిరి లోని 'లినోయిక్ ఆసిడ్ 'వల్ల తగ్గుతాయి . కాలేయం లో చేరిన మలినాలు , విషపదార్ధాలు ను తొలగిస్తుంది , 'యాంటి ఆక్షిడెంట్' గా పనిచేస్తుంది .

కామెర్లు :
ఉసిరి రసాన్ని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగితె వైటమిన్ లోపంవల్ల కలిగే వ్యాధి మరియు కామెర్లు రాకుండ సహయపదుతుంది.

మలబద్ధకం:
మలబద్ధకం సమస్య ఉన్నవారు ప్రతి రోజు ఉసిరి కాయ తినడం వలన ఈ సమస్య తగ్గిపోతుంది

నోటి పూత:
నోటి పూతతో బాధపడేవారికి ఉసిరి కాయ రసంతో చక్కటి పరిష్కారం దొరుకుతుంది. అర కప్పు నీటిలో ఉసిరి కాయ రసాన్ని కలిపి పుక్కిలిస్తే మంచి ఫలితము ఉంటుంది.

కంటిచూపు:
ఉసిరి కంటిచూపు మెరుగుపరచడంలో చాలా సహాయపడుతుంది. అంతేకాకుండ కళ్ళు ఎర్రబడటం మరియు దురదని కూడా తగ్గిస్తుంది. సగం కప్పు నీటిలో రెండు చెంచాల ఉసిరి రసాన్ని కలుపుకొని ప్రతి రోజు ఉదయం తాగుతూ ఉంటే కళ్ళకు చాలా మంచిది.