Search This Blog

Chodavaramnet Followers

Showing posts with label Breakfast Recipes - Telugu. Show all posts
Showing posts with label Breakfast Recipes - Telugu. Show all posts

Tuesday, 12 April 2016

PAPPU PUNUKULU RECIPE IN TELUGU


పప్పు పుణుకులు 

కావల్సినవి:పెసరపప్పు, సెనగపప్పు, మినప్పప్పు, ఎర్ర కందిపప్పు - రెండు టేబుల్‌స్పూన్ల చొప్పున, ఉప్పు - తగినంత, కారం - కొద్దిగా, ఆమ్‌చూర్‌పొడి - అరచెంచా, అల్లం - చిన్నముక్క, కొత్తిమీర - రెండు కట్టలు, వాము - అరచెంచా, నూనె - వేయించేందుకు సరిపడా. 

తయారీ: అన్నిరకాల పప్పుల్ని మూడు గంటల ముందు నానబెట్టుకోవాలి. తరవాత నీళ్లన్నీ వంపేసి మిక్సీజారులోకి తీసుకుని మెత్తని ముద్దలా చేసుకోవాలి. ఇది కొద్దిగా పల్చగా ఉంటేనే బాగుంటుంది. నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ ఓ గిన్నెలో తీసుకుని వేసుకుని బాగా కలపాలి. ఇప్పుడు ఈ పిండిని చెంచాతో తీసుకుని కాగుతోన్న నూనెలో వేసుకోవాలి. ఎర్రగా వేగాక తీసేయాలి. మామూలు గారెకంటే రుచిగా ఉంటుంది.

Monday, 1 April 2013

POTATO CARROT AND ALL VEGETABLES KABAB SPECIAL TELUGU BREAK FAST RECIPE






కావలసినవి

బంగాళాదుంపలు-6
కంద-ఒకటిన్నర కిలో
శాండ్‌విచ్‌ రొట్టె స్లయిసులు-6
ఉడికించిన క్యారెట్‌ ముక్కలు-ఒక కప్పు
ఫ్రెంచ్‌ బీన్స్‌ ముక్కలు-ఒక కప్పు
ఉడికించిన పచ్చి బఠానీలు- ఒక కప్పు
ఆరెంజ్‌ ఫుడ్‌కలర్‌-ఒక  టీస్పూన్‌
కారం-ఒక టీస్పూన్‌
గరంమసాలా- ఒక టీ స్పూన్‌
అల్లం వెల్లుల్లి ముద్ద- ఒక టేబుల్‌ స్పూన్‌
పచ్చిమిర్చి ముద్ద-ఒక టేబుల్‌ స్పూన్‌
కొత్తిమీర- ఒక స్పూన్‌

తయారుచేసే విధానం

బంగాళా దుంపలను ఉడికించి, వొలిచి నలిపి ముద్ద చేసుకోండి. కందపై చెక్కుతీసి, చిన్నముక్కలుగా చేసి,  ఉడికించి దానిని కూడా ముద్దగా చేసుకోండి. రొట్టెముక్కలు కొంచెం నీటితో తడపండి. కంద, బంగాళాదుంపల మిశ్రమంలో రొట్టె ముక్కలు వేసి బాగా పిసకండి. ఉడికించిన క్యారెట్‌ ముక్కలు, ఫ్రెంచ్‌బీన్స్‌, బఠానీలను కూడా ఒకసారి కలిపి ముద్ద చేసి పై మిశ్రమాన్ని చేర్చండి.  కారం, గరంమసాలా, ఉప్పు చేర్చి కలపండి. చివరగా నూరిన మసాలా ముద్దలను ఆరెంజి రంగును చేర్చి బాగా కలపండి. శేఖ్‌ కబాబ్‌ల ఆకారంలో (లేదా మీకిష్టమైన ఆకారంలో) ఈ మిశ్రమాన్ని విభజించి తయారుచేసుకుని, నూనె లేదా డాల్డాలో ఎర్రగా వేయించి తీయండి.  రొట్టెముక్కలు, గ్రీన్‌ చట్నీల కలయికతో ఈ కబాబ్‌లు సర్వ్‌ చేయండి.

Wednesday, 13 March 2013

NAVA RATNA GUGGILU HEALTHY RECIPE






కావాల్సినవి : తెల్లశెనగలు-1 కప్పు, అలసందలు 1 కప్పు. పచ్చిబఠానీ -కప్పు, పెసలు1 కప్పు, ఉలవలు 1 కప్పు, చిక్కుడు గింజలు 1 కప్పు, వేరుశనగ 1 కప్పు, శనగపప్పు 1 కప్పు, మొక్కజొన్నలు 1 కప్పు, తురుం-1 కొద్దిగా ఉప్పు, అల్లం, పచ్చిమిర్చి, టిస్పూను నూనె, ఆవాలు, జీలకర్ర కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర, కొబ్బరికోరు.

చేసేవిధానం

తొలుత పప్పుదినుసులు అన్ని బాగా శుభ్రం చేసుకొని, అన్ని కలిపి దాదాపు 1 1/2 గంటలు నానపెట్టాలి. తరువాత వాటిని ఉడకపెట్టాలి. ఉడికించేటప్పుడే రుచికి తగ్గ ఉప్పువేయాలి. గింజలు అన్నీ బాగా ఉడికిన తరువాత, దించి నీరు వడగట్టాలి. బాణిలో నూనె వేసి బాగా కాచిన తర్వాత అల్లం, పచ్చిమిర్చి ఉడి కించిన పప్పువేసి కలియతిప్పి కొబ్బరి కోరును చల్లాలి.

Tuesday, 26 February 2013

TELUGU FESTIVAL RECIPES - SPECIAL GARELU - SPECIAL BURELU


బొబ్బర్లతో

కూటు
కావలసిన పదార్థాలు: బొబ్బర్లు - 1 కప్పు, చింతపండు గుజ్జు - అరకప్పు, నూనె - 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు - 1 టీ స్పూను, అల్లం వెల్లుల్లి పేస్టు - 1 టీ స్పూను, ఉప్పు - రుచికి తగినంత. పేస్టు కోసం: ఉల్లిపాయ - 1, ఎండు మిర్చి - 3, పచ్చికొబ్బరి తురుము - 1 కప్పు. పొడికోసం: (వేగించిన) మెంతులు - 1 టీ స్పూను, గసగసాలు, మినప్పప్పు, శనగపప్పు, నువ్వులు - 1 టేబుల్ స్పూను చొప్పున, పల్లీలు - 2 టేబుల్ స్పూన్లు.
తయారుచేసే విధానం:3 కప్పుల నీటిలో బొబ్బర్లని ఉడికించి నీరు వడకట్టి పక్కనుంచాలి. అరకప్పు నీటిలో పొడి, చింతపండు గుజ్జు కలపాలి. నూనెలో ఆవాలు వేగాక, అల్లం వెల్లుల్లి, ఉల్లిపేస్టు పచ్చివాసన పోయేదాక వేగించి, చింతపండు మిశ్రమం కలిపి, కొద్ది నీరు పోసి మూతపెట్టి 5 నిమిషాలు ఉడికించాలి. తగినంత ఉప్పు, పసుపు కలపాలి. చివర్లో ఉడికించిన బొబ్బర్లు వేసి 6 నిమిషాల తర్వాత దించేముందు అర టీ స్పూను నెయ్యి కలపాలి. వేడి వేడి అన్నంతో చాలా రుచిగా ఉంటుంది.

బచ్చలితో గారెలు
కావలసిన పదార్థాలు: బొబ్బర్లు - 1 కప్పు, బచ్చలి కూర 1 కప్పు, జీలకర్ర - అర టీ స్పూను, బియ్యప్పిండి - 3 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి - 4, చిన్న ఉల్లిపాయ - 1, అల్లం - అంగుళం ముక్క, కొత్తిమీర తరుగు - అరకప్పు, కరివేపాకు - 4 రెబ్బల తరుగు, ఉప్పు - రుచికి తగినంత, నూనె - సరిపడా.
తయారుచేసే విధానం:బొబ్బర్లను 5 గంటలు నానబెట్టి నీళ్లు పోయకుండా, మరీ మెత్తగా కాకుండా కచ్చాపచ్చాగా రుబ్బుకోవాలి. ఈ ముద్దలో సన్నగా తరిగిన బచ్చలి, పచ్చిమిర్చి, అల్లం, ఉల్లి, జీర, కొత్తిమీర వేసి చిన్న చిన్న ఉండలుగా చేసుకుని, కాగిన నూనెలో గారెల్లా వేసి మంట బాగా తగ్గించి నిదానంగా లోపల కూడా ఉడికేలా దోరగా వేగించుకోవాలి.

తీపి బూరెలు
కావలసిన పదార్థాలు: బొబ్బర్లు - 1 కప్పు, పచ్చి కొబ్బరి తురుము - 1 కప్పు, బెల్లం/పంచదార - 1 కప్పు, యాలకుల పొడి - 1 టీ స్పూను, నూనె - వేగించడానికి సరిపడా, మైదా - పావుకేజీ, ఉప్పు - రుచికి తగినంత.
గ్రేవీ కోసం : గంటసేపు నానబెట్టిన బొబ్బర్లను కుక్కర్లో 5 నిమిషాలు ఉడికించి, నీరు వడకట్టాలి. బొబ్బర్లలో కొబ్బరి తురుము, యాలకుల పొడి, బెల్లం తరుము/ పంచదార వేసి చేత్తో ముద్దలా కలిపి, నిమ్మకాయంత ఉండలు చేసుకోవాలి. ఉప్పు వేసిన మైదాను నీటితో జారుగా కలిపి, ఉండలు ముంచి నూనెలో దోరగా వేగించుకోవాలి.