Search This Blog

Chodavaramnet Followers

Showing posts with label Bhagawadh Geetha Bhakthi Articles. Show all posts
Showing posts with label Bhagawadh Geetha Bhakthi Articles. Show all posts

Saturday, 31 December 2016

LORD SRI KRISHNA'S MESSAGE IN BHAGAWADHGEETHA



భగవద్గీత లో శ్రీ కృష్ణుని సందేశం

" యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత
అభ్యుత్థాన మధర్మస్య తదాత్మానం సృజామ్యహమ్
పరిత్రాణాయ సాధూనామ్ వినాశాయ చ దుష్కృతామ్
ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే "

అర్జునా! ధర్మమునకు హాని కలిగినప్పుడును, ఆధర్మము పెచ్చుపెరిగి పోవుచున్నప్పుడును (జన్మ కర్మ రహితుడనైనప్పటికిని) నన్ను నేను సృజించు కొందును. సత్పురుషులను పరి రక్షించుటకును, దుష్టులను రూపు మాపుటకును, ధర్మమును సుస్థిర మొనర్చుటకును నేను ప్రతి యుగమునందును అవతరించుచుందును.

భగవద్గీత నాల్గవ అధ్యాయము – జ్ఙాన, కర్మ సన్యాస యోగముల లోని ఈ రెండు శ్లోకములు ప్రసిద్ధములు. హిందూ విశ్వాసముల ప్రకారము లోకపాలకుడైన శ్రీ మహా విష్ణువు అనేక అవతారములు దాల్చును. అందు కొన్ని అంశావతారములు (ఉదా: వ్యాసుడు). కొన్ని పూర్ణావతారములు (ఉదా: నరసింహుడు). కొన్ని అర్చావతారములు (ఉదా: తిరుపతి వేంకటేశ్వరుడు)