Search This Blog

Chodavaramnet Followers

Showing posts with label Menthikura Health Tips. Show all posts
Showing posts with label Menthikura Health Tips. Show all posts

Thursday, 29 December 2016

INCREASE MEN POWER WITH MENTHIKURA


మెంతికూరతో స్త్రీల రోగాలకు విముక్తి

ఇలా అంటే ఆశ్చర్యంగా ఉంటుంది కానీ, మెంతికూరకు నిజంగానే స్త్రీల ఆరోగ్యంపై పనిచేసే గుణం ఉంది. ఆడవారిలో ఎక్కువగా కనిపించే బాధ నడుము నొప్పి. ఈ బాధ నుండి మెంతికూర మంచి ఉపశమనం ఇస్తుంది. అంతేకాదు స్త్రీ పురుషులు లైంగిక సమర్థతను, లైంగిక ఉత్సాహాన్ని పెంపొందిస్తుంది. మెంతికూరను రుబ్బి తలకు పట్టించి ఆరిన తర్వాత స్నానం చేయండి. మృదువైన కేశాలు లభిస్తాయి. రుతు సమయంలో రుతుస్రావం సక్రమంగా అయ్యేట్లు చేస్తుంది.

అంతేకాదు శరీరానికి నీరు వచ్చినవారు మెంతికూరను రోజూ తింటే నీరు తగ్గిపోతుంది. గర్భాశయం లోపల దోషాల వల్ల కలిగే ముట్టు నొప్పులను తేలికగా తగ్గిస్తుంది. ఇది తేలికగా అరిగే ఆహారం. దీనిని ఇతర ఆకు కూరలతో కలపకుండా విడిగా ఒక్క మెంతికూరను మాత్రమే కూరగానూ, పప్పుగానూ, పచ్చడిగానూ వండుకుని తినండి. లేదా ఉడికించి మెత్తగా గుజ్జుగా చేసి అందులో రసప్పొడి వేసుకుని చారు కాసుకుని తీసుకోండి.

Friday, 11 November 2016

Wednesday, 14 September 2016

LIFE BENEFITS WITH MENTHIKURA


మెంతికూర, మెంతులు కడుపు ఉబ్బరాన్ని, కడుపులో మంటను తగ్గిస్తాయి. అజీర్తికి విరుగుడుగా పనిచేస్తాయి. మెంతిలో విటమిన్లు, ఖనిజాలు ఉన్నాయి. కామెర్లు, రక్తక్షీణత వంటి వాటికి మెంతులు విరుగుడుగా ఉంటాయి. 

లోబీపీ ఉన్నవారికి మెంతులు బాగా ఉపయోగ పడుతాయి. రక్తప్రసారాన్ని పెంచుతాయి. వెంట్రుకలు రాలకుండా ఉండడానికి ఉపయుక్తంగా ఉంటుంది. మెంతుల్ని నానబెట్టి రుబ్బి పేస్టులా తయారు చేసి తలకు పట్టిస్తే వెంట్రులు రాకుండా ఉంటాయి. శరీర చల్లబడే అవకాశం ఉంది. వెంట్రుకలు కూడా నల్లబడుతాయి. చుండ్రు తగ్గిపోతుంది.

వేడిగడ్డలు, చీముగడ్డలు లేస్తే నొప్పి భరించడం చాలా కష్టం. ఇలాంటి పరిస్థితులలో మెంతులు నూరి గడ్డలకు కడితే ఉపయోగం చాలా ఉంటుంది. గడ్డ పరిపక్వానికి వస్తుంది. పగిలిపోవడానికి దోహదపడుతుంది. అప్పుడు చాలా ఉపశమనం కలుగుతుంది. ఫలితంగా నొప్పి పోటు తగ్గుతుంది. మెంతిగింజల కషాయం జ్వరానికి బాగా పనిచేస్తుంది.