Search This Blog
Chodavaramnet Followers
Showing posts with label Telugu Puranas. Show all posts

Friday, 26 April 2019
Thursday, 8 September 2016
Sunday, 4 September 2016
Monday, 29 August 2016
PURANA TELUGU STORY ABOUT DHUNDHUMARUDU
దుంధుమారుని కథ
ఆయుర్దాయం ఉన్నంత కాలం మానవులెలాగూ బ్రతుకుతారు. మరణించిన తరువాతకూడా కీర్తి కాయులై జీవించి ఉండటం ఎంతో గొప్ప విషయం. ఇది వారి సత్ప్రవర్తన, సమాజహిత కార్యాచరణ, కావ్య, కళానిర్మాణదక్షత మొదలైన వాటిని అనుసరించి ఉంటుంది. దీనిని గూర్చి ఆంధ్రమహాభారతం, అరణ్యపర్వంలో ఒక ప్రతీకాత్మకమైన కథ ఉంది. దీనిని మార్కండేయమహర్షి ధర్మరాజుకు చెప్పాడు.
పూర్వం హైహయ వంశానికి చెందిన "ధుంధుమారుడు" అనే రాజకుమారుడు వేటకు వెళ్ళి, జింక చర్మం ధరించి పొదలమాటునుంచి కనిపిస్తున్న ఒక బ్రాహ్మణ యువకుణ్ణి జింకగా భావించి బాణంతో కొట్టి చంపాడు. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే ఆ యువకుని కళేబరం కనిపించింది. తన పొరపాటువల్ల ఇంత అనర్థం జరిగిందే అని బాధపడి, ఇంటికి వెళ్ళి తన వృద్ధ బంధుజనులకు ఈ విషయం చెప్పి, వారిని ఆ ప్రదేశానికి తీసుకువచ్చి ఆ యువకుని మృతకళేబరాన్ని చూపించాడు.
వారందరూ అక్కడికి సమీపంలో ఉన్న "తార్క్ష్యుడు " అనే మహర్షి ఆశ్రమానికి వెళ్ళారు. ఆయన వారిని ఆదరంగా ఆశీర్వదించి, వారికి అతిథిసత్కారాలు చేయవలసినదిగా తన శిష్యులను నియోగించాడు. అపుడు హైహయులు మహర్షికి నమస్కరిస్తూ "మహర్షీ ! మా మీది అనుగ్రహంతో మీరు మాకు అతిథిసత్కారాలు చేయిస్తున్నారు. కానీ వాటిని అందుకోదగిన అర్హత మాకు లేదు. ఇడుగో.. మా వంశానికి చెందిన ఈ రాజకుమారుడు మీ ఆశ్రమ ప్రాంతంలో ఒక బ్రాహ్మణయువకుణ్ణి జింకగా భ్రమించి బాణంతో నేలగూల్చాడు. ఈ మహాపాపానికి నిష్కృతి ఏముంటుంది. ఈ విషయాన్ని తమకు నివేదించటానికే వచ్చాం" అన్నారు.
అపుడు తార్క్ష్యుడు చిరునవ్వు నవ్వుతూ "త్రిలోకాలకూ ఆశ్చర్యం కలిగించే విషయం ఒకటి మీకు చెప్పాలి. మా ఆశ్రమంలో ఎవరికీ భయం, వ్యాధి, దుర్గతి, మరణం ఉండనే ఉండవు. అందువల్ల ఈ రాజకుమారుడు ఇక్కడ ఎవరినో చంపాడనటం మీ భ్రమ" అని తపోబల సంపన్నుడు, తేజస్వి అయిన ఒక యువకుణ్ణి పిలిచి వారికి చూపుతూ "చూడండి .. మీ రాజకుమారుడు బాణంతో కొట్టినది ఇతనినేనా?" అన్నాడు.
ఆశ్చర్యం ! రాజకుమారుడు చంపింది ఈ యువకుణ్ణే! పైగా ఇతడు తార్క్ష్య మహర్షికి కుమారుడట. తమ కళ్ళతో తాము ఈ యువకుని మృతదేహాన్ని చూశారుకదా!కానీ ఇతడు జీవించే ఉన్నాడే! ఇది ఎలా సంభవం? హైహయులు ఆశ్చర్యపడి తార్క్ష్యునితో "మహర్షీ!ఈ యువకుడు మరణించి పునర్జీవితుడయ్యాడు. ఈ మహత్తు విస్మయకరం. ఇంతటి మహిమ ఇతనికి ఎలా సిద్ధించింది?" దయచేసి చెప్పండి అని అడిగారు.
"ఆలస్యంబొకయింత లేదు, శుచి యాహారంబు, నిత్యక్రియా
జాలంబేమఱ, మర్చనీయు లతిథుల్, సత్యంబు పల్కంబడున్
మేలై శాంతియు, బ్రహ్మచర్యమును నెమ్మిందాల్తు, మట్లౌట నె
క్కాలంబుం బటురోగ మృత్యుభయ శంకంబొంద మేమెన్నడున్" అన్నాడు.
* ఆ ఆశ్రమవాసుల అమరత్వ లబ్ధికి మహర్షి చెప్పిన కారణాలు ఇవీ -
* చేయవలసిన పనులు చేయటంలో ఒకయింతైనా ఆలస్యం చేయరు
* శుచియైన ఆహారం మాత్రమే భుజిస్తారు
* అనుదిన క్రియా కలాపాలలో ఏమఱుపాటు చెందరు
* అతిథులు వారికెప్పుడూ పూజనీయులే
* కేవలం సత్యాన్ని పలుకుతారు
* ఐచ్ఛికంగా శాంతస్వభావాన్ని, బ్రహ్మచర్యాన్ని పాటిస్తారు
ఈ ఆరు లక్షణాలను ఆధునిక సమాజం ఎంతవరకూ సమాదరిస్తోంది అనేది ఆలోచించవలసిన అంశం. సంకల్పబలం ఉంటే వీనిలో ఆచరణకు అసాధ్యమైనవి ఉండవు. వీటిని ఆచరణలో చూపిస్తే ఆఫీసుల్లో పెండింగ్ ఫై ల్స్ ఉండవు. కలుషితాహారం తిని అస్వస్థులై ఆసుపత్రుల పాలయ్యేవారుండరు. పనులు చేయటంలో రేపు, మాపు అని బద్ధకంతో వాయిదాలు వెయ్యటం ఉండదు.అతిథులు వస్తారంటే , లేదా మనమే అతిథులుగా ఎవరింటికో వెళ్లవలసి వస్తే భయపడవలసిన అవసరం ఉండదు. అసత్య దోషం ఉండదు. కక్షలూ, అత్యాచారాలూ ఉండవు. నిజానికి ఈ అంశాలన్నింటికీ నేపథ్యంగా ఒక ఆధ్యాత్మిక దృక్పథం ఉంది. ఆచరణలో అది ప్రతిష్ఠితమైతే అమరత్వమే సిద్ధిస్తుంది. ఇలాంటి సత్ప్రవర్తన కలిగిన సజ్జనులు భౌతికంగా మరణించినా మరణాన్ని జయిస్తారని గ్రహించాలి.
" జీవంతం మృతవన్మన్యే దేహినం ధర్మ వర్తనం
మృతో ధర్మేణ సంయుక్తో దీర్ఘజీవీ న సంశయః " అని పెద్దల మాట.
"ధర్మాన్ని త్యజించినవాడు జీవించి ఉన్నా చనిపోయినవానిగానే పరిగణింపబడుతాడు.
" ధర్మైక జీవి మృతుడైనా చిరంజీవి " అనటంలో సంశయం లేదు" అని దీని భావం

Thursday, 25 August 2016
Saturday, 13 August 2016
KRISHNA PUSHKARALU 2016 - TELUGU PURANA BIRTH STORY OF KRISHNA RIVER FROM LORD SHRI MAHA VISHNU
శ్రీమహావిష్ణువునుంచి కృష్ణానది ఆవిర్భావం
శ్రీమహావిష్ణువు తన శరీరాన్ని కృష్ణానదిగా ఆవిర్భవించినట్లు చెప్పే గాథ ఒకటి ప్రచారంలో ఉంది. ద్వాపరయుగం చివరన అంటే కలియుగం ప్రారంభం కావడానికి కొద్ది రోజుల ముందు రాబోయే పాపాలను పసిగట్టిన సృష్టికర్త బ్రహ్మదేవుడు అనేకరకాలైన ఆలోచనలు చేసి శ్రీమహావిష్ణువైతే దీనికి ఉపాయం తెలుపుతాడని భావించి వైకుంఠం చేరాడు.

విషయం వివరించాడు. బ్రహ్మదేవుడి మాటలను విన్న విష్ణువు తన శరీరం నుండి ఒక దివ్య సుందరరూపంలో ఒక బాలికను జనింపజేశాడు. ఆమెకు ‘కృష్ణ’ అని పేరుపెట్టి బ్రహ్మదేవుడికి అప్పగించి కలియుగాంతం వరకు ఆమెను కాపాడమని సూచించాడు.
బ్రహ్మదేవుడు ఆ బాలికను తన కుమార్తెగా స్వీకరిస్తూ వున్నానని పలికాడు. అనంతరం –
ఈ బాలిక పెరిగి కలియుగ ప్రారంభంలో కృష్ణానదీ రూపాన్ని పొంది...భూమిపైకి చేరి కలియుగవాసుల పాపాలన్నింటిని ప్రక్షాళన చేస్తుంది” అని శ్రీమహావిష్ణువు బ్రహ్మదేవుడికి తెలిపాడు.
తర్వాత తనతోపాటు బ్రహ్మదేవుడు తీసుకువచ్చిన కృష్ణ పెరిగి పెద్దది కాసాగింది. కొద్ది రోజులకు కలియుగం ప్రవేశించింది. శ్రీమహావిష్ణువు శరీరం నుండి ఉద్భవించిన బాలిక నదీరూపాన్ని ధరించింది.
అంతకుముందే ‘సహ్యముని’ తపస్సుచేసి కృష్ణానది తనపైనుండి ప్రవహించే వరాన్ని పొందాడు. వరం ప్రకారం సహ్యముని పర్వతరూపం ధరించి సహ్యాద్రిగా మారగా నదీరూపాన్ని ధరించిన బాలిక కృష్ణానదిగా పర్వతం నుంచి ప్రవహించడం ప్రారంభించింది. ఈ విషయం తెలిసిన లయకారుడైన పరమశివుడు
“కృష్ణా నదిని దర్శించగానే పాపప్రక్షాళన జరిగి ముక్తి కలుగుతుంది” అని వరం ప్రసాదించాడు.
ఈవిధంగా ఆవిర్భవించినది కృష్ణానది.
Thursday, 28 April 2016
Wednesday, 13 April 2016
Friday, 1 April 2016
Wednesday, 30 March 2016
IMPORTANCE OF MARRIAGE
వరుడు_వధువు_మెడలో_మూడు_ముళ్లే_ఎందుకు_వేస్తాడు?
హిందూ సాంప్రదాయం ప్రకారం మూడు అనే అంకెకు
విశిష్టమైన ప్రదాన్యం ఉంది, త్రిలోకాలు,
త్రిమూర్తులు, త్రిగుణాలు ..ఇలా మూడు అనేది
మంగళకరం అని భావిస్తారు.
అందుకే మంగళసూత్రానికి
ఈ మూడు ముడులు వేస్తారు.
ఇంక డెప్త్ గా చెప్పాలంటే….. మానవులకు స్థూల, సూక్ష్మ, కారణ, అనే...
మూడు శరీరాలు ఉంటాయట.
పెళ్లి సమయంలో వేసే ఒక్కొక్క
ముడి ఒక్కో శరీరానికి వేసేదట…! పెళ్లి అంటే కేవలం బాహ్య
శరీరంతోనే కాదు…మొత్తం మూడు శరీరాలతో మమేకం
అవడటం అనే అర్థం లో మూడు ముళ్లు వేస్తారట.!
Tuesday, 15 March 2016
Tuesday, 8 December 2015
BIRTH STAR - TREES - HUMAN CHARACTERS - ANALYSIS IN TELUGU
ప్రతిమనిషి ఎదో ఒక నక్షత్రంలో జన్మిస్తారు.
ఆయ నక్షత్రాలలో జన్మించిన వారికి కొన్నివృక్షాలు చెప్పబడ్డయీ.
వారు ఆచెట్లను ఇంట్లోపెంచి వాటివాతావరణంలోఉంటే వారికి ఆరోగ్యంమానసికప్రసాంతత ఏర్పడతాయీ.
ఆందరి మనోభావాలూ ఒకేలాఉండవు కాబట్టి.
అశ్విని - అడ్డసరం,విషముష్టి // మఖ - మర్రి // మూల- వేగిస,సర్జ// భరణి - దేవదారు,ఉసిరిక // పుబ్బ- మొదుగ // పూర్వాషాడ-నెమ్మి,అశోక//
కృతిక - అత్తి // ఉత్తర - జువ్వి // ఉత్తరాషాడ-నెమ్మి//
రోహిణి - నేరేడు //హస్త - కుంకుడు,జాజి // శ్రవణం - జిల్లేడు//
మృగశి- చండ్ర // చిత్త - తాడి,మారేడు // ధనిష్ఠ - జమ్మి//ఆరుద్ర - రేల,కృశ్నాగరు // స్వాతి- మద్ది // శతభిషం-అరటి//
పునర్వసు- వెదురు // విశాఖ-నాగకేసరం,పుల్లవెలగ//
పుష్యమి - పిప్పిలి,ఆశ్వత్తం // అనురాధ- పొగడ // ఉత్తరాభాద్ర-వేప//
ఆశ్రేష - నాగకేసరం,సంపంగి // జ్యేష్ట - విపు,లొద్దుగ // రేవతి-విప్ప//
ఈవృక్షాలను పెంచడం మరియు పూజించడం ఈవృక్షాలకుచెందిన పదార్దాలుఆహారంగ స్వీకరించడం
వీటి ములికలను స్నానదికలలో వాడటం వల్లశరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి మానసికంగ ఆరోగ్యవంతులుఅగుదురు. మరో విషయం ములికసేకరణలో నటుటలో తిది వార నక్షత్రాదులు చూడాలి
లేకపోతె నిష్ప్రయోజనమగును.
Saturday, 5 December 2015
DEATH STORY OF WARRIOR PRINCE - ABHIMANYU - MAHABHARATHA TELUGU STORIES COLLECTION
అభిమన్యుని మరణం
అపహార్ణం వరకు యుద్ధం సంకులంగా జరిగింది. శత్రుంజయుడు, సువర్చనుడు, చంద్రకేతుడు, సూర్యభానుడు, మేఘవేగుడు మొదలైన వారు ఒక్కుమ్మడిగా అభిమన్యునిపై పడ్డారు. అభిమన్యుడు తన అస్త్రశస్త్రములతో వారిని అందరిని దూరంగా తరిమి కొట్టాడు. శకుని అభిమన్యుని ఎదుర్కొన్నాడు. అభిమన్యుడు అతడిని తీవ్రమైన శరాఘాతముతో నొప్పించి తనరధమును సుయోధనుని వైపు పోనిచ్చాడు. ఇది చూసిన కర్ణుడు " ఆచార్యా ! కౌరవ సేనలో మహామహులను ఓడించినభిమన్యుడు సుయోధనుడి మీదికి పోతున్నాడు. ఈ సమయంలో మీరు ఊరక ఉండుట తగునా ! ఏదైనా ఉపాయం ఆలోచించి అభిమన్యుని చంపండి " అని సుయోధనుడికి సాయంగా వెళ్ళాడు.
అప్పుడు ద్రోణుడు " అభిమన్యుడు చిన్న వాడైనా తన తండ్రి అర్జునికి సమానంగా యుద్ధం చేస్తున్నాడు ఇక ఉపేక్షించరాదు. మనమంతా ఒక్కుమ్మడిగా అతడిని ఎదుర్కొన వలెను " అని పలికాడు. ఇంతలో అభిమన్యుని చేతిలో చావు దెబ్బలు తిని కర్ణుడు అక్కడికి వచ్చి ద్రోణుడితో " ఆచార్యా ! చూసారా అభిమన్యుడు నన్ను ఎలా దెబ్బ తీసాడో ! నేను మీ దగ్గరే ఉంటాను ఇంతకంటే నాకు సురక్షిత ప్రదేశం లేదు. అర్జునుడి పరాక్రమం గురించి విన్నాను కాని అతడి కొడుకు అంతకంటే పరాక్రమవంతుడు అని అర్ధం అయ్యింది " అన్నాడు.
* అభిమన్యుడిని కపటోపాయముతో చంపమని ద్రోణుడు చెప్పుట
అప్పుడు ద్రోణుడు కర్ణుని చూసి " కర్ణా ! నేను అర్జునుడికి కవచధారణ విద్య ఉపదేశించాను. దానిని అర్జునుడు తన కుమారుడికి ఉపదేశించాడు. ఆ కవచ ధారణ విద్య వలన అతడి శరీరంపై ఎవరూ శరములు నాట లేరు. ఎదో వంచన చేసి అతడిని మనం చంపాలి. అభిమన్యుని చేతిలో విల్లు ఉన్నంతవరకు మనం అతడిని చంపలేము. యోధులంతా అతడిపై దాడి చేసి ఒకరు అతడి విల్లును త్రుంచాలి, వేరొకరు అతడి సారధిని చంపాలి, మరొకరు అతడి రథం విరుగ కొట్టాలి కాని ఇవన్నీ ఏక కాలంలో జరగాలి. నీకు చేతనైతే అభిమన్యుని ఈ కపటోపాయంతో చంపు " అన్నాడు. అది విని కర్ణుడు ఆలోచించి అక్కడి యోధులను కూడగట్టుకుని ఒక్కుమ్మడిగా అభిమన్యునిపై లంఘించాడు. కొంత మంది అతడి విల్లు విరిచారు, ద్రోణుడు అతడి రధాశ్వములను చంపాడు, కృపాచార్యుడు అతడి రధసారధిని చంపాడు, అభిమన్యుడు నిరాధయుడు విరధుడు అయ్యాడు. అదే తగిన సమయమనుకుని బాహ్లికుడు, శకుని, శల్యుడు, అశ్వత్థామ, కృతవర్మ అతడి మీద బాణవర్షం కురిపించారు.
అభిమన్యుడు ఖడ్గము డాలు తీసుకుని రధము మీద నుండి కిందకు దూకి గాలిలో గిరగిరా తిరుగుతూ కౌరవ యోధులను ఖండించాడు. అభిమన్యుడు ఎప్పుడు తన తల ఖండిస్తాడో అని యోధులంతా అక్కడి నుండి పారి పోయారు. ద్రోణుడు ఒక బల్లెము తీసుకుని అభిమన్యుడి ఖడ్గం విరిచాడు. కర్ణుడు అభిమన్యుని డాలు విరిచాడు. అప్పుడు అభిమన్యుడు రధములోని చక్రాయుధం తీసి దానిని గిరగిరా త్రిప్పుతూ శత్రు సేనలను చంపుతూ సింహనాదం చేసాడు. రక్తసిక్తమైన అతడి ముఖమును చూసిన శత్రు సేనలు భయభ్రాంతం అయ్యాయి. అభిమన్యుడు తన చక్రాయుధంతో శత్రువులు వేస్తున్న బాణములు ఖండిస్తూ శత్రుసంహారం చేస్తున్నాడు. ద్రోణుని వైపు దూసుకు పోతున్నాడు. అడ్డు వచ్చిన కౌరవ సైన్యాన్ని చీల్చి చెండ్డాడుతున్నాడు.
ఆ సమయమున శకుని, కృతవర్మ, కృపాచార్యుడు, శల్యుడుమొదలైన యోధులు ఒకటిగా కూడి అభిమన్యుని చక్రయుధం ఖండించారు. అప్పుడు అభిమన్యుడు తన గధను తీసుకుని అశ్వత్థామను ఎదుర్కొన్నాడు. అభిమన్యుని దెబ్బకు భయపడి అశ్వత్థామ రథం నుండి దూకి రథం వెనక్కు పోయి దాక్కున్నాడు. అప్పుడు అభిమన్యుడు అశ్వత్థామ సారధిని, రధాశ్వలను చంపాడు. అభిమన్యుడు శకుని మీద లంఘించి అతడికి సాయంగా ఉన్న ఇరవై ఏడు మంది యోధులను గధాయుధంతో చంపాడు. గజములపై పది మంది యోధులు అభిమన్యుని ఎదుర్కొన్నారు అభిమన్యుడు వారిని గజములతో సహా యమపురికి పంపాడు. కేకయరాజులను ఏడుగురిని ఒక్క సారిగా యమపురికి పంపాడు. ఇంతలో దుశ్శాసనుడి కుమారుడు అభిమన్యుని ఎదుర్కొని అభిమన్యునిపై
అనేక శరములు గుప్పించాడు. అభిమన్యుడు అతడు వేసిన బాణములను గధాదండంతో అడ్డుకుని అతడి అశ్వములను, సారధిని చంపి అతడి రధమును విరుగకొట్టాడు. దుశ్శాసనుడి కుమారుడు గధాయుధంతో అభిమన్యుని ఎదుర్కొన్నాడు. వారిరువురి మధ్య పోరు ఘోరంగా సాగింది. ఇరువురి శరీరం నుండి రక్తం ధారగా కార సాగింది. యోధులంతా యుద్ధం మాని వారి పోరు చూస్తున్నారు. అభిమనుడు దుశ్శాసన కుమారుడు గధలతో మోదుకుని కిందపడ్డారు. గాయపడిన వారి శరీరముల నుండి ప్రాణములు వేరయి స్వర్గలోకం చేరాయి. అప్పటికీ కసి తీరని కౌరవ యోధులు చుట్టుముట్టి కత్తులతో పొడిచి పొడిచి చంపారు. సూర్యుడు అస్తమించాడు.
పాండవుల కీర్తిని ఇనుమడింప చేస్తూ అభిమన్యుడు కౌరవయోధులతో అత్యంత పరాక్రమంతో పోరాడి వీరస్వర్గం అలంకరించాడు. ధృతరాష్ట్ర మహారాజా ! ఆ విధంగా యోధాను యోధుడైన అభిమన్యుడు రణరంగమున మరణించగానే కౌరవసేనల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిసాయి. ఆ సమయాన అక్కడ చేరిన భూతగణాలు " అభిమన్యుని అమానుషంగా అధర్మ యుద్ధంలో అన్యాయంగా పలువురు కలిసి వధించారు " అని ఆక్రోశించాయి. అభిమన్యుడు మరణించగానే పాండవ సేనలు పారిపోయాయి.
ఇదంతా దూరం నుండి చూస్తున్న ధర్మరాజు " మన అభిమన్య కుమారుడు దుర్భేద్యమైన వ్యూహంలో ప్రవేశించి హయములను, గజములను చంపి రధములను విరిచి, పదాతి దళమును తనుమాడి. అనేక సైనిక ప్రముఖులను చంపి ద్రోణుడు మొదలైన మహాయోధులను భయభ్రాంతులను చేసి వీరస్వర్గం అలంకరించాడు. అటువంటి మహాయూధుని మరణముకు చింతించ పని లేదు " అన్నాడు. అప్పటికే చీకట్లు కమ్మాయి. ఆ రోజుకు యుద్ధము మాని వారి వారి శిబిరాలకు వెళ్ళారు. కౌరవ సేనలో ఆనందోత్సాహాలు నిండగా పాండవ యోధుల్లో విషాద ఛాతలు కమ్ముకున్నాయి.

Subscribe to:
Posts (Atom)