Search This Blog
Chodavaramnet Followers
Showing posts with label Winter Care Tips. Show all posts

Friday, 3 November 2017
Tuesday, 20 December 2016
WINTER PROTECTION WITH HERBAL TEA
చలికాలపు ఇబ్బందులా? హెర్బల్ టీలు ఉన్నాయిగా..
హెర్బల్ టీ యాంటీ ఆక్సిడెంట్ లతో నిర్మితమై ఉంటుంది.
రోజు లో రెండు సార్లు హెర్బల్ టీ తాగండి.
చలికాలంలో కలిగే అలర్జీలకు దూరంగా ఉంచుతుంది.
ప్రస్తుత కాలంలో ఎక్కువగా మనం వింటున్న పదం- "హెర్బల్ టీ", ఆర్గానిక్ కు పూర్తి వ్యతిరేఖంగా ఉండేదే హెర్బల్ టీ. హీర్బల్స్ లేదా మూలికల మరియు సహాజ ఆకులతో తయారు చేయటం వలన వీటిని హెర్బల్ టీ గా పేర్కొంటారు. ఈ హెర్బల్ టీని చాలా పురాతన కాలం నుండి తాగుతున్నారు మరియు వేడి సుగంధ పానీయ ద్రావణాన్ని 5000 సంవత్సరాల పూర్వం నుండి వాడుతున్నారు.
ఇది కూడా చదవండి : నోస్ బ్లాక్ ను తగ్గించే ఆయుర్వేద ఔషదాలు
నిజంగా చెప్పలంటే, మూలిక ఆకులను వేడి నీటిలో ఉంచి, 3 నుండి 4 నిమిషాల పాటూ వేడి చేయటం వలన తయారు చేసే ద్రావణం లేదా కషాయంగా దీనిని పేర్కొనవచ్చు. ఈ ఆకులను "కామెల్లియా సైనెన్సిస్" గా పేర్కొంటారు. చాలా సందర్భాలలో ఆరోగ్యాన్ని పెంచే మంచి సువాసన కలిగిన చల్లటి లేదా వేడి ద్రావణాన్ని టీకి పర్యాయపదంగా పేర్కొంటారు.
కావున హెర్బల్ అనే పదాన్ని మూలికలు లేదా మూలికల నుండి తయారు చేసిన టీలకి వాడవచ్చు. ఈ రకం టీ ల వలన అనేక రకాల ప్రయోజానాలు ఉన్నాయి- ఏకాగ్రత నుండి మన శరీరంలో జీవక్రియ పెంచుట వరకు సహాయపడతాయి. ఒక కప్పు వేడి హెర్బల్ టీలో కావలసినన్ని పోషకాలు మరియు యాంటీ ఆక్సిడెంట్ లు ఉంటాయి. దీనిలో కూడా కెఫీన్ ఉంటుంది కావున పిల్లలకు హెర్బల్ టీ లను ఇవ్వకూడదు.
హెర్బల్ టీలను వేడి నీటిలో మూలికలను లేదా ఆకులను కలిపి తయారు చేస్తారు లేదా మూలికలను లేదా ఆకులను నీటిలో వేసి వేడి చేయటం ద్వారా హెర్బల్ టీ తయారు చేస్తారు.కామెల్లియా సినేన్సిస్ ప్లాంట్ నుండి చేసిన టీ మాత్రమే కాదు చాలా రకాల హెర్బల్ టీలలో కెఫీన్ ఉండదు.
చలికాలంలో హెర్బల్ టీ లను తాగటం వలన శరీరానికి పోషకాలను అందిస్తుంది. వేడిగా ఉండే ఈ ద్రావణం- శరీరాన్ని హైడ్రేటేడ్ గా ఉంచటమే కాకుండా, ఆరోగ్యాన్ని పెంపొందించేదిగా ఉంటుంది. అంతేకాకుండా, వీటిని రోజులో పరిమిత స్థాయిలో మాత్రమే తాగాలి. ఎక్కువగా తాగటం వలన దుష్ప్రభావాలు కూడా కలగవచ్చు. హెర్బల్ టీ లను తాగే ముందు ఆయుర్వేద వైద్య నిపుణుడి సలహా తప్పక పాటించండి.
Saturday, 19 November 2016
Tuesday, 26 July 2016
Monday, 16 November 2015
Tuesday, 3 November 2015
Friday, 26 December 2014
WINTER CARE HEALTH FOOD TIPS
శీతాకాలం చురుకైన ఆహారం
చురుకులేని వాతావరణంలో ఎంత ప్రయత్నించినా ఉత్సాహం కలగదు. మనసూ, శరీరం కూడా మందకొడిగానే ఉంటాయి. దీన్నే 'సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్' అంటారు. ఈ సమస్య తగ్గాలంటే ఆహారంపై దృష్టి పెట్టాలి.
'డి' విటమిన్‌తో ఈ సమస్య చాలావరకూ తగ్గుముఖం పడుతుంది. ఈ కాలంలో ఎండ నుంచి తగినంత 'డి' విటమిన్ లభించదు. అందుకే చేపల నుంచి పొందే ప్రయత్నం చేయాలి. చేపలు తినడం వల్ల మెదడు నుంచి సెరటోనిన్ అనే రసాయనం విడుదలవుతుంది. ఇది మనసుని హుషారుగా ఉంచుతుంది. ఈ కాలంలో గుడ్లని ఎక్కువగా తీసుకోవాలి. వాటిల్లోని ఒమెగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు సహజమైన ఉత్సాహ కారకాలుగా పనిచేస్తాయి. కోడిగుడ్లలోని ఫాస్పోలిపిడ్స్ మెదడు చురుగ్గా పనిచేసేలా చేస్తాయి. జ్ఞాపకశక్తిని పెంచుతాయి.
ఎక్కడ చూసినా కమలాలు కనువిందుగా కనిపిస్తున్నాయి కదా! ఆలస్యం ఎందుకు తినేయండి.
కమలాల్లో విటమిన్ 'సి' మాత్రమే కాదు... మెదడుని ఉత్తేజితం చేసే ఫొలేట్లు దానిలో ఎక్కువగా ఉంటాయి. బాదం గింజలూ, వాల్‌నట్లూ, వేరుసెనగా, జీడిపప్పూ కొద్దిగా తీసుకున్నా ఫలితం ఉంటుంది. ఎందుకంటే వాటిల్లోని సెలీనియమ్ నిరాశను తగ్గించి, మానసికోత్సాహం కలిగేలా చూస్తుంది.

Tuesday, 16 December 2014
WINTER CARE HEALTH WITH FRUITS - TIPS IN TELUGU - FRUITS THAT GIVES ENERGY AND HEALTH AND PROTECTION IN WINTER SEASON
శీతాకాలంలో ఎలాంటి పండ్లు తీసుకోవచ్చు?
శీతాకాలంలో విటమిన్ సి పుష్కలంగా ఉండే పండ్లను తీసుకోవాలి. న్యూట్రీషియన్స్ ఉండాలి.
శీతాకాలంలో దానిమ్మను తీసుకోవచ్చు. దానిమ్మను అలాగే తీసుకోవడం లేదా సలాడ్స్ రూపంలో తీసుకోవడం వంటివి చేయొచ్చు. ఇది క్యాన్సర్ కణాలను నివారిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లను పూర్తిగా కలిగి వండే ఈ ఫ్రూట్‌ను తీసుకోవడం ద్వారా హృద్రోగ సమస్యలను దూరం చేసుకోవచ్చు.
సి విటమిన్ ఫ్రూట్స్ గల నిమ్మ, ఆరెంజ్, గ్రేప్ ఫ్రూట్స్, కివి ఫ్రూట్స్, కమలాలు వంటివి తీసుకోవాలి. కమలాలు తీసుకోవడం ద్వారా వింటర్లో ఏర్పడే చర్మ సమస్యలను దూరం చేసుకోవచ్చు. అలాగే వింటర్లో శరీరానికి కావలసిన ఎనర్జీ లభించాలంటే నిమ్మ, ఆరెంజ్, గ్రేవ్ ఫ్రూట్స్ తీసుకోవాల్సిందే.
ఫ్రూట్స్ జ్యూస్ తీసుకునేటప్పుడు వేడి చేసిన నీటిని చల్లార్చి వాటితో తయారు చేసిన జ్యూస్‌లను తీసుకోవడం మంచిది. అలాగే రాత్రిపూట కాకుండా మధ్యాహ్నం పూట పండ్లను ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

WINTER CARE HEALTH TIPS IN TELUGU - LIST OF FOOD ITEMS THAT GIVES PROTECTION FROM COLD WINTER
చలికాలంలో తప్పక తీసుకోవాలి
దాల్చినచెక్క
తీపిగా, వగరుగా ఉండే దాల్చిన చెక్క కూరల్లో, కేకుల్లో వాడతారు. కాఫీలో ఒక చిన్న చెక్క వేసినా రుచి పెరుగుతుంది. రోగనిరోధకశక్తిని పెంచుతుంది. ఎక్కువ వయసు ఉన్నవారికి, జబ్బుతో బాధపడుతున్నవారికి మంచిది. డయాబెటిక్ రోగుల్లో బ్లడ్ షుగర్ స్థాయిలను నియంత్రిస్తుంది.
యాలుకలు
మన సంప్రదాయపు తీపి వంటకాల్లో యాలకులది ముఖ్యస్థానం. ఆకుపచ్చని, బ్రౌన్ వెరైటీలలో యాలకులు దొరుకుతాయి. మంచి వాసననిచ్చే యాలకులు చలికాలం తీసుకుంటే మంచిది.
అల్లం
అల్లం కడుపునొప్పిని తగ్గిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. జలుబు, దగ్గులకు మంచి మందు. చలికాలం జీర్ణక్రియ కొద్దిగా లోపిస్తుంది. అల్లం టీలో వేసుకుని, సూప్‌లలో వేసుకుని తాగడం వలన మేలు జరుగుతుంది.
మిరియాలు
మిరియాలు పొడి చేయకుండా అలానే సూప్‌లలో, రసంలో వాడచ్చు. సలాడ్లలో మిరియాల పొడి చల్లుకుని తినచ్చు. దశాబ్దాల నుంచి దగ్గు, జలుబు, అజీర్ణం, నిద్రలేమికి మిరియాలు వాడడం సాధారనం.
లవంగాలు
దగ్గుకు సత్వర ఉపశమనం లవంగాలు. లవంగాలను బియ్యంతో తయారు చేసిన పదార్థాలు, కూరల్లో వేసుకుంటే రుచి, ఆరోగ్యం రెండూ.
వెల్లుల్లి
ప్రపంచవ్యాప్తంగా వెల్లుల్లిని వాడతారు. వెల్లుల్లి బ్యాక్టీరియా బారినుంచి రక్షించి రోగనిరోధకతను పెంచుతుంది.

Wednesday, 21 May 2014
Saturday, 10 May 2014
Tuesday, 19 November 2013
Tuesday, 15 October 2013
Thursday, 3 October 2013
Sunday, 21 July 2013
Tuesday, 9 July 2013
Sunday, 30 June 2013
Subscribe to:
Posts (Atom)