Search This Blog

Chodavaramnet Followers

Showing posts with label Hair Care Tips - Telugu. Show all posts
Showing posts with label Hair Care Tips - Telugu. Show all posts

Tuesday, 31 March 2020

Wednesday, 1 July 2015

TIPS IN TELUGU FOR OVER COMING HAIR LOSS - HAIR LOSS STOPPING KITCHEN TIPS IN TELUGU


జుట్టురాలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు

1) ప్రస్తుతం చిన్న పిల్లల దగ్గరనుండి , పెద్దవాళ్ళ వరకు జుట్టురాలడం సమస్యగా మారిపోయింది.

2) మొట్టమొదటిగా ఎక్కువగా ఒత్తిడి , మానసిక ఆందోళనలు లేకుండా జాగ్రత్త పడాలి.

3) ఆహారంలో ప్రోటీన్ , విటమిన్ , మినరల్స్ ,పీచు ఎక్కువగా ఉన్న పండ్లు , కూరగాయలు , ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి.

4) రోజులో కనీస వ్యాయామం 30 నిముషాలు ఉండేలా చూసుకోవాలి.

5) ప్రతి ఒక్కరు కనీసం ఒక రోజులో 10-12 గ్లాసుల నీటిని త్రాగాలి.

6) పని ఒత్తిడి , మానసిక ఆందోళన తగ్గించుకోవడానికి యోగ లో ప్రాణాయామం చక్కని పరిష్కారం.

7) కెమికల్ షాంపూ వాడకం , హెయిర్ డ్రైయర్ వాడకం భాగా తగ్గించాలి. కెమికల్స్ జెల్స్ , కెమికల్ షాంపూ వాడకం ఎక్కువైతే కుదుళ్ళు పటుత్వం కోల్పోయి , జుట్టు నిర్జీవంగా మారి , జుట్టు ఊడిపోతుంది.

8) వారం లో కనీసం రెండు నుండి మూడు సార్లు తల స్నానం చేసుకోవాలి. జుట్టు మీద మరీ వేడి నీళ్ళు కానీ , మరీ చల్ల నీళ్ళు పోసుకోకూడదు.

9) తలలో ఉండే చుండ్రు ప్రభావం వల్ల కూడా జుట్టు రాలిపోతుంది, చుండ్రు ఉంటె ముఖం మీద , వీపు మీద మొటిమలు వస్తాయి. కాబట్టి చుండ్రును తగ్గించుకోవాలి.

10) చుండ్రు ఉన్నవాళ్లు , తల స్నానం చేసే అరగంట ముందు కొబ్బరి నూనె లో , నిమ్మరసం కలిపి కొద్దిగా వేడి చేసి , జుట్టుకు , కుదుళ్ళకు పట్టించి , మృదువుగా వేళ్ళను ఉపయోగిస్తూ , ఒక 5 నిముషాలు మసాజ్ చేసుకోవాలి.

11) రాత్రి పడుకొనేటప్పుడు స్వచ్చమైన కొబ్బరి నూనె లేదా బాదాం నూనె లేదా ఆలివ్ నూనె తో తలను ఒక 5 నిముషాలు మసాజ్ చేసుకొని పడుకోవాలి.

12) ఆహార సమయాలు కచ్చితంగా పాటిస్తూ , రోజులో కనీసం 7-8 గంటల నిద్ర ఉండాలి.

13) ముఖ్యంగా క్యారట్ , బీట్రూట్ , ఆపిల్ , పాలు , గుడ్లు , చేపలు , ఆకుకూరలు , చిలగడదుంపలు , సోయాబీన్స్ , బీన్స్ , చిక్కుళ్ళు , ఖర్జూరాలు , అరటిపండు , బెర్రీ పండ్లు , మటన్ ఫ్లాష్ , పెరుగు , ఇలాంటి వాటిని ఎక్కువగా తీసుకోవాలి.

14) ఇలా పాటిస్తే , జుట్టురాలే సమస్య నుండి ఉపసమనం పొందవచ్చు.

Saturday, 27 June 2015

TIPS TO OVERCOME DRY HAIR PROBLEM IN WOMEN


జుట్టు పొడి బారిందా..!

కాలుష్యం వల్లా... షాంపూలూ, కండిషనర్లూ ఎక్కువగా వాడటం వల్లా జుట్టూ, మాడూ పొడి బారతాయి.
• దీన్ని నివారించాలంటే..
• అరకప్పు బేబీ షాంపూలో ఇరవై చుక్కల టీ ట్రీ నూనె వేసి మాడుకు పట్టించి అరగంటయ్యాక తలస్నానం చేస్తే సరిపోతుంది. టీ ట్రీ నూనెలో యాంటీ బ్యాక్టీరియా, యాంటీ ఫంగల్ గుణాలు ఉంటాయి. ఇవి జుట్టుకు మాయిశ్చరైజర్ గుణాలను అందించి పొడిబారడం, దురద నుంచి ఉపశమనాన్ని అందిస్తాయి.
• నిమ్మరసంలోని యాంటీసెప్టిక్ గుణాలు మాడును శుభ్రపరచడంలో సాయపడతాయి. నిమ్మరసాన్ని నేరుగా మాడుకు పట్టించి, పది నిమిషాల తరవాత కడిగేస్తే సరిపోతుంది.
• కొబ్బరినూనె అన్నింటి కన్నా మంచి చిట్కా. చేతులు శుభ్రంగా కడుక్కుని కొబ్బరినూనె మాడుకు తగిలేలా పట్టించండి. గంట తర్వాత షాంపూతో కడిగేస్తే సరి. ఇలా వారంలో రెండు సార్లు చేస్తే మంచిదే. కలబంద గుజ్జును మాడుకు రాసి అరగంటయ్యాక షాంపూతో కడిగేయాలి.
• అవకాడోలో విటమిన్లూ, సహజనూనెలూ, ఖనిజ లవణాలూ ఎక్కువగా ఉంటాయి. ఇవి జుట్టుని మృదువుగా మారుస్తాయి. ఒక అవకాడోని గుజ్జుగా చేసి, చెంచా తేనె, రెండు చెంచాల ఆలివ్ నూనె కలిపి పేస్ట్‌లా చేయాలి. దీన్ని మాడుకు పట్టించి అరగంటయ్యాక షాంపూతో తలస్నానం చేసి గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి. ఇలా తరచూ చేస్తే జుట్టు మెత్తగా తయారవుతుంది.

Thursday, 16 April 2015

FOR BEAUTIFUL BLACK HAIR TIPS IN TELUGU


నల్లని కురుల కోసం

ఎర్ర మందార పూలను రెండు గ్లాసుల నీళ్లలో వేసి, మరిగించి ఒక గ్లాసుకి వచ్చాక, వడగట్టి చల్లారాక ఒక సీసాలో పోసుకోవాలి. దీన్ని శిరోజాలకు రాసుకుని రెండు గంటల తర్వాత తలంటుకుటే పేను కొరుకుడు తగ్గుతుంది. జుట్టు రాలడం తగ్గి, నల్లగా అవుతుంది.

గుంటగలవరాకును దంచి రసం తీసి దానికి ఒక వంతు కొబ్బరి నూనె కలిపి, నీరు ఇగిరే దాకా మరిగించాలి. నూనె పైకి తేలిన తర్వాత వడకట్టి దాన్ని జుట్టుకు రాసుకుంటే జుట్టు రాలడం తగ్గడమే కాక, ఒత్తుగానూ పెరుగుతుంది.

మూలికా ఔషధాలతో చిన్న వయసులోనే నెరిసిపోయిన జుట్టుకు శాశ్వతంగా నలుపు చేయవచ్చుననే విషయం భారతీయ ఆయుర్వేద శాస్త్రంలో ఉందని పెద్దలు చెబుతారు.

'నీలకేశ తైలం' జుట్టును నల్లగాను, ఒత్తుగాను, పొడవుగాను చెయ్యడానికి, తలనొప్పి, కళ్లనొప్పి, మంటలు, కళ్లు ఎర్రబారడం వగైరా వ్యాధులు సోకకకుండా ఎంతగానో ఉపయోగపడుతుంది.

కొబ్బరిపాలు జుట్టు కుదుళ్లను దృఢం చేస్తాయి. కొబ్బరి పాలను మాడుకు పట్టించి తర్వాత తలస్నానం చేస్తే జుట్టుకు మాయిశ్చరైజర్‌ లభించి మృదువుగా అవుతుంది.
కొబ్బరి పాలలో నిమ్మరసం కలిపి ఫ్రిజ్‌లో 2-3 గంటలు ఉంచాలి. తర్వాత తీసి దానిపైన ఏర్పడ్డ పొరను తొలగించాలి. ఈ మిశ్రమాన్ని మాడుకు పట్టించి, వేడినీళ్లలో ముంచిన మెత్తని టవల్‌ను తలకు చుట్టాలి. గంటసేపు అలాగే ఉంచి, షాంపుతో తలస్నానం చేయాలి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తూ ఉంటే వెంట్రుకలు రాలడం తగ్గుతుంది.

Wednesday, 29 October 2014