Search This Blog

Chodavaramnet Followers

Showing posts with label Bhakthi Poetry - Telugu. Show all posts
Showing posts with label Bhakthi Poetry - Telugu. Show all posts

Friday, 15 September 2017

RADHA KRISHNA BHAKTHI POETRY


చంద్ర కౌముదికి నేడు ; 
ఇంతింత శోభలెటుల!?
ఎటుల!? ఎటుల!? 
నుడువుమా ; || 
;
గాన లోలుడు, వేణుగాన లోలుడు ;
కడవలలో పాలు త్రుళ్ళు,
త్రుళ్ళింతల రంగరింపు ;
ఇంపుసొంపు నవ్వులే,
క్రిష్ణయ్య నవ్వులే ; ||
;
యమున అలల దరిశనమౌ ;
ఆతని ప్రతిబింబములే ;
కెరటాలను చిలికేను కన్నయ్య నీడలు ;
చిలికి చిలికి - కడకు నీరు వెన్నెలాయెను ;
వెన్నెలల వ్రేపల్లె తడిసి మురిసెను ; ||

Thursday, 13 July 2017

JAYADEVUNI ASTAPADHI - BAPU CHITRAM


జయదేవుని అష్టపది ..బాపు గారి చిత్రం !
.
(ాగం రూపక తాళం )
.
అనిల తరళ కువలయ నయనేన
తపతి న సా కిసలయ శయనేన
సఖీ ! యా రమితా వనమాలినా (ధృవం)

వికసిత సరసిజ లలితముఖేన
స్ఫుటతీ న సా మనసిజ విశిఖేన

అమృత మధుర మృదుతర వచనేన
జ్వలతి న సా మలయజ పవనేన

స్థల జలరుహ రుచికర చరణేన
లుఠతి న సా హిమకర కిరణేన

శజల జలద సముదయ రుచిరేణ
దళతి న సా హృది విరహభరేన

కనక నిష రుచి శుచి వసనేన
శ్వసితి న సా పరిజన హసనేన

సకల భువనజన వర తరుణేన
వహతి న సా రుజ మతి కరుణేన

శ్రీ జయదేవ భణిత వచనేన
ప్రవిశతు హరి రపి హృదయ మనేన

సఖీ, గాలికి కదలాడే పద్మాల వంటి కన్నులు గల వనమాలి తో రమించిన స్త్రీ చిగురాకుల శయ్య మీద పరితపించదు. కోమలమైన పద్మము వంటి ముఖము గల వనమాలి తో రమించిన స్త్రీ మన్మధుని బాణాలకు ఛిద్రం కాదు.

తియ్యనైన అమృత వచనములు చేసే వనమాలి తో రమించిన స్త్రీ శీతలములైన గాలులకు తాపము చెందదు. తామర తూడులవంటి కర చరణాల వనమాలితో రమించిన స్త్రీ చంద్రుని కిరణాలకు విలవిలలాడదు.

కారుమబ్బుల వంటి వనమాలి తో సుఖము పొందిన యువతి యొక్క హృదయం విరహ బాధను చెందదు. శుభ్రమైన పీతాంబరములు ధరించిన వనమాలితో రమించిన స్త్రీ పరిజనుల వికటములకు నిట్టూరుపు చెందదు.

అన్ని భువనములలోని జనులలో ఉత్తమ యువకుడైన వనమాలితో రమించిన వనిత కరుణార్ధ్రమైన విరహాన్ని కలుగదు.

శ్రీ జయదేవ కవి వచనముల ద్వారా హరి మన హృదయాలలో ప్రవేశించుగాక.

శ్లో. మనోభవానందన ! చందనానిల
ప్రసీద రే దక్షిణ ! ముంచ వామతాం
క్షణం జగత్ప్రాణ ! నిధాయ మాధవం
పురో మమ ప్రాణహరో భవిష్యసి

మనోభవునికి ఆనందం కలిగించే చందన వనం నుండి వీచు ఓ పవనమా, దక్షిణ దిక్కునుండి ప్రసరించువాడా, నీ వంకరతనాన్ని వీడుము. జగతికి ప్రాణమునిచ్చు ఓ వాయువా! మాధవుడిని ఒక్క క్షణం నా ముందు నిలుపుము. నన్ను బాధించి నా ప్రాణాలను హరిస్తున్నావు.

శ్లో. రిపు రివ సఖీ సంవాసోఒయం శిఖీవ హిమానిలో
విష మివ సుధారశ్మిర్యస్మిన్ దునోతి మనోగతే
హృదయమదయే తస్మిన్నేవం పునర్వలతే బలాత్
కువలయ దృశాం వామ: కామో నికామనిరంకుశ:

అతడు నా మనసులో ఉండుట వలన, చెలికత్తెల నడుమ వుండటం నన్ను బాధిస్తున్నది. అమృతకిరణాలు వర్షించే చంద్రుడు కూడా విషం వలే హింసిస్తున్నాడు. కృష్ణుని చుట్టూ నా మనస్సు తిరుగుతున్నది. కఠినుడైన మన్మధుడు పద్మనయనలను పీడిస్తున్నాడు.

శ్లో. బాధాం విదేహి మలయానిల ! పంచబాణ
ప్రాణాన్ గృహాణ న గృహం పునరాశ్రయిష్యే
కిం తే కృతాంత భగిని ! క్షమయా తరంగై:
అంగాని సించ మమ శామ్యతు దేహదాహ:

ఓ విదేహి, ఓ మలయానిలుడా, నన్ను బాధించుము. నాగృహమునకు నేను ప్రాణములతో తిరిగి వెళ్ళను. ఓ యమునా నదీ, నీ తరంగాలతో నా తనువును తడుపుము. అలా నా దేహమునకు వుపశమనము కలుగుగాక.

శ్లో. ప్రాతర్నీల నిచోల మచ్యుత ముర స్సంవీత పీతాంబరం
రాధాయాశ్చకితం విలోక్య హసతి స్వైరం సఖిమండలే
వ్రీడా చంచల మంచలం నయనయో రాధాయరాధాననే
స్వాదుస్వేరముఖోయమస్తు జగదానందాయనందాత్మజ:

తెల్లవారుఝామున రాధామాధవులు తమ మందిరము నుండి వచ్చినప్పుడు రాధ యొక్క నల్లని వస్త్రాన్ని అచ్యుతుడు, వాని పీతాంబరాన్ని రాధ కట్టుకున్నారు. అదిచూచిన చెలికత్తెలు పకపకా నవ్వగా సిగ్గు పడుచున్న రాధను చిరునవ్వుతో చూస్తున్న కృష్ణుడు జగమునకు ఆనందము కలిగించుగాక.

Wednesday, 23 September 2015

Friday, 11 September 2015

LORD SRI KRISHNA BHAKTHI POETRY BY SRI Brahmasri Chaganti Koteswara Rao Garu


అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం

హృదయం మధురం గమనం మధురం మధురాధిపతేరఖిలం మధురం

వచనం మధురం చరితం మధురం వసనం మధురం వలితం మధురం

చలితం మధురం భ్రమితం మధురం మధురాధిపతేరఖిలం మధురం

వేణుర్మధురో రేణుర్మధురః పాణిర్మధురః పాదౌ మధురౌ

నృత్యం మధురం సఖ్యం మధురం మధురాధిపతేరఖిలం మధురం

గీతం మధురం పీతం మధురం భుక్తం మధురం సుప్తం మధురం

రూపం మధురం తిలకం మధురం మధురాధిపతేరఖిలం మధురం

కరణం మధురం తరణం మధురం హరణం మధురం రమణం మధురం

వమితం మధురం శమితం మధురం మధురాధిపతేరఖిలం మధురం

గుంజా మధురా బాలా మధురా యమునా మధురా వీచీ మధురా

సలిలం మధురం కమలం మధురం మధురాధిపతేరఖిలం మధురం

గోపీ మధురా లీలా మధురా యుక్తం మధురం ముక్తం మధురం

దృష్టం మధురం శిష్టం మధురం మధురాధిపతేరఖిలం మధురం

గోపా మధురా గావో మధురా యష్టిర్మధురా సృష్టిర్మధురా

దలితం మధురం ఫలితం మధురం మధురాధిపతేరఖిలం మధురం

ఇతి శ్రీమద్వల్లభాచార్యవిరచితం మధురాష్టకం సంపూర్ణం

Thursday, 5 September 2013

Saturday, 31 August 2013

Thursday, 29 August 2013

ADHI GURUVU - ADHI SANKARA CHARYULU VARI - ANIMUTYALU - TELUGU QUOTATIONS AND TEACHINGS OF ADISANKARA CHARYA


ADHI GURUVU - ADHI SANKARA CHARYULU VARI - ANIMUTYALU - 
TELUGU QUOTATIONS AND TEACHINGS OF ADISANKARA CHARYA
TELUGU BHAKTHI QUOTATIONS

THE WORDS AND MEANING OF BRAHMA PADAMULU


THE WORDS AND MEANING OF BRAHMA PADAMULU 

Thursday, 20 June 2013

Wednesday, 30 January 2013