Search This Blog

Chodavaramnet Followers

Thursday, 30 August 2018

SECRET BEHIND THILAKAM ON SHIVA LINGAM


శివడు లింగాకారం పైన మూడు తిలకాలను దిద్దుతారు వాటి యొక్క రహస్యము.

1. మొదటిది బ్రహ్మ కి గుర్తు
2. రెండవది విష్ణువు కి గుర్తు
3. మూడవది శంకరుడు కి గుర్తు

మద్యలో గంధాన్ని బిందువుగా పెడతారు, అది పరమాత్మని యొక్క స్మృతి చిహ్నమునకు గుర్తు అదే పరమాత్మని యొక్క యథార్థ స్వరూపం.

1. పరమాత్ముని నామం సదా శివ,

2. సదా శివ అంటే
సదా - ఎల్లప్పుడూ , శివ అనగా కళ్యాణకారి " మంగళకారి " మరియు "శుభకారి"

3. పరమాత్మ జ్యోతిర్బిందు స్వరూపుడైన చైతన్య మూర్తి ఇతనికి స్థూల సూక్ష్మ స్వరూపములు రెండూ లేవు.

4. పరమాత్మ బ్రహ్మా-విష్ణు-శంకరుల సూక్ష్మలోకాలకు పైన బ్రహ్మలోకంలో (ముక్తిధామంలో) ఉంటారు.

5. పరమాత్మ త్రిమూర్తి, అనగా బ్రహ్మా, విష్ణు, శంకరులను కూడ సృష్టించినవాడు.

6. పరమపిత పరమాత్మ బ్రహ్మా ద్వారా సృష్టి స్థాపన, విష్ణువు ద్వారా పాలన, శంకరుని ద్వారా మహావినాశనము,
ఈ ముగ్గురు చేత మూడు కర్తవ్యాలను చేయించువాడు పరమాత్మడు అందుకే ఇంగ్లీష్ లో GOD అంటారు.

7. లింగం శబ్ధము లీనము అనగా వస్తువును తెలియపరచు చిహ్నమని మరియు లక్షణములు చూపించేది అని
అర్థము. పరమాత్మ లక్షణములు చూపించేది కావున శివలింగం అని అంటారు .

8. ఓం నమః శివాయ అంటే
ఓం - నేను ఆత్మను
నమః - నమస్కారం
శివాయ -పరమాత్మడు
ఆత్మనైనా నేను పరమాత్మకి నమస్కారం చేస్తున్నాను అని అర్ధం.