Search This Blog
Chodavaramnet Followers
Showing posts with label Mutton Recipes - Telugu. Show all posts
Showing posts with label Mutton Recipes - Telugu. Show all posts
Thursday, 15 December 2016
Thursday, 15 August 2013
Friday, 7 June 2013
Thursday, 11 April 2013
Sunday, 24 March 2013
Thursday, 14 March 2013
MUTTON BIRYANI WITH TOMATO MASALA ALONG WITH SHEER KURMA PLUS DHOODI KHEER (SORAKAYA KHEER SWEET ITEM) - ALL TELUGU RECIPES HOT HOT COMBINATION
అలియా తబస్సుమ్...
మటన్ బిర్యానీ
కావలసిన వస్తువులు
బియ్యం - 1కిలో, మటన్ - 1కిలో, పెరుగు - పావులీటర్, డాల్డా - 150గ్రా||, నిమ్మకాయలు - 2, పచ్చిమిర్చి - 10, కారం - 1స్పూను,
ఉప్పు -తగినంత, కొత్తిమీర - 1కట్ట, పుదీనా - 1కట్ట, అల్లం వెల్లుల్లి పేస్ట్ - 3 టేబుల్ స్పూన్లు, ఉల్లిగడ్డలు - పావుకిలో (4పెద్దవి), లవంగాలు - 6, యాలకులు - 4, దాల్చిన చెక్క - కొంచెం, షాజీర - టీ స్పూను
తయారు చేసే విధానం
డాల్డాలో ఉల్లిపాయ ముక్కలు దోరగా వేయించి విడిగా పెట్టుకోవాలి. మటన్ కడిగి పెద్ద గిన్నెలో వేసి దానికి పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, వేయించిన ఉల్లిగడ్డముక్కలు సగం, ఉప్పు, కారం, పచ్చిమిర్చి ముక్కలు, 1 నిమ్మకాయ రసం, పెరుగు, లవంగాలు, యాలుకలు, దాల్చిన చెక్క, షాజీర, డాల్డా కూడా కొంచెం కలిపి ఒక గంట అలాగే వుంచాలి. తర్వాత బియ్యం సగం ఉడికాక (అంటే అన్నం పలుకుగా వుండాలి) నీళ్లు మొత్తం వొంపేయాలి. ఆ బియ్యాన్ని దినుసులన్నీ కలిపి వుంచిన మటన్ పైన వేయాలి. మిగిలిన డాల్డా, కొంచెం కొత్తిమీర, పుదీనా ఆకులు, వేపిన ఉల్లిపాయ ముక్కలు, నిమ్మకాయ రసం కూడా బియ్యం పైన వేసి పది నిమిషాలు ఉడకనివ్వాలి. తర్వాత సన్న సెగ మీద మరో పదినిమిషాలు ఉంచితే చాలు. ఉడికేటప్పుడు ఆవిరి పోకుండా చూసుకోవాలి. అంతే ఘుమఘుమలాడే మటన్ బిర్యానీ రెడీ. తినేముందు మటన్ అన్నం మొత్తం కలిసేలా కలియదిప్పాలి.
టమాటా మసాలా
కావలసిన వస్తువులు
టమాటాలు - పావుకిలో, చింతపండు - 100గ్రా||, నువ్వులు - 50గ్రా||,
కొబ్బరి - 1 చిప్ప, పల్లీలు - 50 గ్రా||, జీలకర్ర - 2టీ స్పూన్లు,
మెంతులు - టీ స్పూను, ఉల్లిగడ్డ - 2 పెద్దవి, కారం - 2 స్పూన్లు,
ఉప్పు - తగినంత, పసుపు - చిటికెడు, నూనె - 50 గ్రా||
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూను
తయారుచేసే పద్ధతి
జిలకర, నువ్వులు, పల్లీలు, మెంతులు వేయించుకొని పొడి చేసుకోవాలి. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం వేసి మెత్తగా రుబ్బుకోవాలి. టమాటాలను గుత్తి వంకాయ లాగా 4 ముక్కలు కోసి కొద్ది నూనెలో వేయించి తీయాలి. తాలింపు వేసుకొని నూరి ఉంచిన పేస్ట్ అంతా పచ్చి వాసన పోయేలా వేయించాలి. అందులో చింతపండు రసం పోసి చిక్కగా అయ్యే వరకు ఉడకనివ్వాలి. దింపేముందు వేయించిన టమాటాలను వేయాలి. బిర్యానీలో తింటే బావుంటుంది.
షీర్‌ఖుర్మా
కావలసిన పదార్థాలు
పాలు -1 లీటర్, పంచదార - పావుకిలో
సేమ్యా - 100 గ్రాములు, నెయ్యి - 100 గ్రాములు
జీడిపప్పు - 25 గ్రాములు, బాదంపప్పులు - 25 గ్రాములు
పిస్తా - 25 గ్రాములు, కిస్‌మిస్ - 25 గ్రాములు
సారపప్పు - 25 గ్రాములు, మిల్క్‌మెయిడ్ లేదా కోవా - 2 టీస్పూన్లు
ఎండు ఖర్జూర - 25 గ్రాములు, యాలకులు - 8
కర్బూజా గింజలు - 25 గ్రాములు
తయారు చేసే విధానం
సేమ్యాను నేతిలో దోరగా వేయించుకోవాలి. జీడిపప్పు, బాదం, పిస్తా, సారపప్పు, కర్బూజా గింజలు నేతిలో వేయించుకోవాలి. పాలు కాగపెట్టుకొని అందులో పంచదార వేసి మరికొద్ది సేపు పాలు కాగనివ్వాలి. అందులో వేయించిన సేమ్యా వేసి ఐదు నిమిషాలు ఉడికించాలి. పొయ్యిమీద నుండి దింపి వేయించి పెట్టుకున్న జీడిపప్పు, బాదం పప్పు.... అన్నీ అందులో వేస్తే సరి. రుచికరమైన షీర్‌ఖుర్మా రెడీ.
సొరకాయ ఖీర్
కావలసిన పదార్థాలు
సొరకాయ - 1 చిన్నది
పాలు -1 లీటరు
పంచదార - పావుకిలో
సగ్గుబియ్యం - పావుకిలో
కోవా - 100గ్రాములు
యాలకులు - 8
తయారు చేసే విధానం
సొరకాయ చెక్కుతీసి గింజలు లేకుండా తురుముకొని ఉడకబెట్టుకోవాలి. సగ్గుబియ్యాన్ని కూడా ఉడకబెట్టాలి. పాలు కాచి ఉడకబెట్టిన సొరకాయ, సగ్గుబియ్యాన్ని అందులో వేసి కలపాలి. పంచదారను కూడా వేసి బాగా కలియబెట్టాలి. దింపేముందు కోవా, యాలకుల పొడి వేసి కలుపుకోవాలి.
Friday, 22 February 2013
Tuesday, 12 February 2013
Subscribe to:
Posts (Atom)


















