అష్టమూర్తి లింగములు
పంచభూతలింగములు అనగానే అయిదు క్షేత్రములు గుర్తుకు వస్తాయి.
1. పృథ్వీలింగం - కాంచీపురంలోని ఏకామ్రేశ్వర లింగము
2. జలలింగం - తమిళనాడులోని తిరుచునాపల్లి శ్రీరంగానికి సమీపంలోని జంబుకేశ్వర లింగం
3. అగ్నిలింగం - అరుణాచలంలోని అరుణాచలేశ్వర లింగం
4. వాయులింగం - శ్రీకాళహస్తీశ్వర మహాలింగం
5. ఆకాశలింగం - చిదంబరేశ్వర లింగం
ఈఅయిదు ఉన్న క్షేత్రం ఈ శరీరం.
6. సూర్యలింగం: ప్రొద్దున్నే ఆకాశంలో చూస్తే కనపడుతుంది. సూర్యలింగం ప్రత్యక్షం. ఇది కోణార్క్ లో ఉన్నది. ఇది శిల్పులు చెక్కిన ఆలయం కాదు. దీని గురించి పురాణాలలో ఉన్నది. కాశీలో గభస్తీశ్వరుడు, లోలార్కేశ్వరుడు అను పేర్లతో శివుడు సూర్య రూపంలో ఉన్నాడు.
7. చంద్రలింగం: ఇదీ ప్రత్యక్షమే. ప్రభాస క్షేత్రంలో ఉన్న సోమనాధ జ్యోతిర్లింగం. ఇది జ్యోతిర్లింగం అయినప్పటికీ చంద్రకళలతో ఉంది. సోమశిల సోమేశ్వర క్షేత్రమే. పంచారామాలలో సోమారమమనే క్షేత్రం మనకి కనపడుతూ ఉన్నది. ఇక్కడ విశేషం ఏమిటంటే శుక్లపక్షంలో తెల్లదనం రోజు రోజుకూ పెరుగుతూ ఉంటుంది. కృష్ణపక్షంలో క్రమంగా తరుగుతూ ఉంటుంది. భారతీయ దేవాలయాలలో వైజ్ఞానిక దైవత్వ రహస్యం అత్యంత ఆశ్చర్యకరం. ఇటువంటి దివ్య క్షేత్రాలు భారతదేశంలో అందునా హిందువులకు మాత్రమే ఉన్నాయి అని మనం సగర్వంగా, సానందంగా చెప్పుకోవచ్చు.
8. యజమాన లింగం: నేపాల్ క్షేత్రంలో పశుపతి లింగం పేరుతో మనకి కనపడుతూ ఉన్నది.