Search This Blog

Chodavaramnet Followers

Showing posts with label Dasaradhi Satakam Poems Collection. Show all posts
Showing posts with label Dasaradhi Satakam Poems Collection. Show all posts

Tuesday, 22 July 2014

DASARADHI SATAKAM TELUGU POEMS COLLECTION AND ITS MEANING


దాశరథీ శతకము -- రామదాసు 
కరమనురక్తి మందరము గవ్వముగా నహిరాజు త్రాడుగా 
దొరకొని దేవదానవులు దుగ్ధ పయోధి మథించుచున్నచో
ధరణి చలింప లోకములు తల్లడమందగ గూర్మమై ధరా
ధరము ధరించితీవేగద ! దాశరదీ కరుణాపయోనిదీ

భావము :
ఈ పద్యమున రామదాసు మహా విష్ణువు యొక్క కూర్మావతారమును వర్ణించి, శ్రీరాముని ప్రార్దిం చు చున్నాడు. దాశరధ రామా ! దేవదానవులు మందర పర్వతమును కవ్వముగాను, సర్పరాజు, వాసుకిని త్రాడుగాను చేసి ఆశక్తితో గొప్ప ప్రయత్నముతో, పాల సంద్రమును చిలికు నప్పుడు, భూమంతయు కంపించుచు ,లోకములన్ని తల్లడిల్లి పోవుచుండగా , ఆ పర్వతమును నీవు వీపున దాల్చి కాపాడినాడవు.