Search This Blog

Chodavaramnet Followers

Showing posts with label Padyalu - Poems - Telugu. Show all posts
Showing posts with label Padyalu - Poems - Telugu. Show all posts

Monday, 4 April 2016

Wednesday, 25 November 2015

Friday, 31 October 2014

SOUNDARYA LAHARI BHAKTHI POEMS AND ITS MEANING IN TELUGU



తాత్పర్యం –కపర్దినీ !నారీ తిలకమైన నువ్వు స్వభావ సిద్ధం గానే బాగా కృశించి ,సన్నదైనదీ ,స్తన భారం తో బడలిపోయి ,వంగినదీ ,మేళ మెల్లగా తెగి పోతుందేమో అన్నట్లు ఉండేదీ ,ఒడ్డు విరిగిన ఏటి గట్టు పై ఉన్న చెట్టు లాగా ఉన్న ,నీ నడుము చిరకాలం మాకు సౌఖ్యాన్నివ్వాలి .

విశేషం –నడుము చాలా సన్నగా ఉండి ,పది పోతుందేమో అన్నట్లున్నా ,శరీరం నిలిచే ఉండి .నడుము క్రుశించినా శ్రీ దేవి మహాదేవుని భాగ్య వశం తో నిల్చి ఉండి అని భక్తీ రాసొంమేశితం అయిన హాస్యోక్తి .ఆమె నడుము విరిగితే ,సకల లోకాలకు విలయమే .జగత్ క్షేమం కోసం ఆమె నడుం చిర కాలం ఉండాలి .నడుము అతి సూక్ష్మ మైనదీ ,అతి సారవత్వ మైనది అని భావం

Saturday, 27 September 2014

POEMS FROM MANU CHARITRA WRITTEN BY THE GREAT ALLASANI PEDDANA IN TELUGU


పద్య సాహిత్యం » మనుచరిత్ర.లో కొన్ని పద్యాలు........రచన: అల్లసాని పెద్దన.
.
తొలితెలుగు ప్రబంధం మనుచరిత్ర. నీతినీ ధర్మాన్నీ భక్తినీ బోధించటం అంతకుముందు వచ్చిన తెలుగు రచనల గమ్యం.
ఐతే పెద్దన తన మనుచరిత్రతో తెలుగు సాహిత్యాన్నంతటినీ ఓ మలుపు తిప్పాడు. 
.
వాల్మీకి శోకం శ్లోకం ఐతే పెద్దన ఆనందం ప్రబంధమైంది.
సామాజికస్థితిగతులు అసంతృప్తికరంగా ఉన్నప్పుడు, జీవితం దుఃఖభాజనంగా కనిపించినప్పుడు “సాహిత్యప్రయోజనం సమాజశ్రేయస్సే” అన్న దృష్టి సాహితీకారులకు కలగటం చూశాం, ఇప్పుడూ చూస్తున్నాం.
సుఖసంతోషాల్తో సౌభాగ్యంతో ఆకాశమంత ఆత్మవిశ్వాసంతో ఉన్న సమాజపు జీవనదృష్టిని ప్రతిబింబించేవి తొలితరం ప్రబంధాలు. వాటిలో తొలిదీ ఉన్నతమైనదీ ఈ మనుచరిత్ర.
.
వరణాద్వీపవతీ తటాంచలమునన్‌ వప్రస్థలీ చుంబితాం
బరమై సౌధసుధాప్రభా ధవళిత ప్రాలేయరుఙ్మండలీ
హరిణంబై అరుణాస్పదంబనగ ఆర్యావర్తదేశంబునన్‌
పురమొప్పున్‌ మహికంఠహార తరళ స్ఫూర్తిన్‌ విడంబింపుచున్‌
.
ఆ పురి బాయకుండు మకరాంక శశాంక మనోజ్ఞమూర్తి భా
షాపరశేషభోగి వివిధాధ్వర నిర్మల ధర్మకర్మ దీ
క్షాపరతంత్రు డంబురుహగర్భ కులాభరణం బనారతా
ధ్యాపనతత్పరుండు ప్రవరాఖ్యు డలేఖ్యతనూవిలాసుడై
.
.శీలంబుం కులమున్‌ శమంబు దమముం చెల్వంబు లేబ్రాయముం
పోలంజూచి ఇతండె పాత్రుడని ఏ భూపాలు డీవచ్చినన్‌
సాలగ్రామము మున్నుగా కొనడు మాన్యక్షేత్రమున్‌ పెక్కుచం
దాలం పండు నొకప్పుడుం తరుగ దింటం పాడియుం పంటయున్‌
.
ముడిచిన యొంటికెంజెడ మూయ మువ్వన్నె
మెగముతోలు కిరీటముగ ధరించి
కకపాల కేదార కటక ముద్రిత పాణి
కురుచ లాతాముతో కూర్చిపట్టి
ఐణేయమైన ఒడ్డాణంబు లవణిచే
నక్కళించిన పొట్టమక్కళించి
ఆరకూటచ్ఛాయ నవఘళింపగ చాలు
బడుగుదేహంబున భస్మమలది
మిట్టయురమున నిడుయోగపట్టె మెరయ
చెవుల రుద్రాక్షపోగులు చవుకళింప
కావికుబుసంబు జలకుండికయును పూని
చేరె తద్గేహ మౌషధసిద్ధు డొకడు
.
మౌనినాథ కుటుంబ జంబాల పటల
మగ్న మాదృశ గృహమేధిమండలంబు
నుద్ధరింపంగ నౌషధమొండు కలదె
యుష్మదంఘ్రిరజో లేశమొకటి తక్క..

Monday, 22 September 2014

POEM AND MEANING OF UTTHARA HARI VAMSA KAVYAM BY NACHANA SOMANADHUDU


మ. అరి జూచున్ హరి జూచు జూచుకములం దందంద మందార కే

సరమాలామకరందబిందుసలిలస్యందంబు లందంబులై

తొరుగం బయ్యెద కొం గొకింత దొలగం దొడ్తో శరాసారమున్

దరహాసామృతపూరముం గురియుచుం దన్వంగి కేలీగతిన్

(పై పద్యం ఉత్తర హరివంశ కావ్యం లోనిది. నాచన సోమనాథుడు రచించినది. చాలా ప్రసిద్ధమైన పద్యం.)

శ్రీకృష్ణుడు నరకాసురునిపై యుద్ధానికి పోతూ తోడుగా సత్యభామను గూడా తీసుకువెళతాడు. నరకాసురుని రాజధానిని చేరీ చేరగానే పట్టణానికి రక్షగా ఉన్న రాక్షసులందరినీ చంపి, ఆ తరువాత ఇతర రాక్షస వీరులు రాగా వారితోనూ యుద్ధం చేస్తూ, మూర్ఛ పోయి, సేదదీరి లేచి సత్యభామతో, నువ్వూ సంగ్రామాన్నే కోరావు గదా, ఇప్పుడు అవసరం వచ్చింది. ఇదిగో శార్ఙ్గము అంటూ తన ధనుస్సును ఆమె చేతికి ఇస్తాడు. ఇది ఆమె నరకాసురునితో యుద్ధం చేసేటప్పుడు ఆమె సంరంభాన్ని వర్ణిస్తూ చెప్పిన పద్యం.

ఇటు శత్రువును చూస్తూ, అటు ప్రియుని చూస్తూ ఏకకాలంలో వీరాన్నీ, శృంగారాన్నీ ప్రదర్శిస్తున్నది. ఆమె అటు అరిని (శత్రువుని) చూస్తున్నది. అతని మీద బాణ పరంపర కురిపిస్తున్నది. ఇటు హరిని చూస్తున్నది. అతనిపై చిరునవ్వులను చిందిస్తున్నది. ఈ రెండు పనులూ ఒక హేలావిలాసంగా నిర్వహిస్తున్నది. ఆ సందర్భంలో ఆమె పయ్యెద కొంగు కొంచెం తొలిగింది. మెడలోని మందారమాల లోని పువ్వుల నుంచి తేనె సొనలు కురిసి ఆమె వక్షస్థలాన్ని చిత్తడి గావిస్తున్నాయి. ఇదీ దృశ్యం. ఆమె సౌందర్యమూ, శృంగారమూ, వీరమూ, చిరునవ్వుల జల్లూ, మెడలోని మందారదామం లోని మకరందాల ధార, కొంచెంగా తొలగిన పైటకొంగు — ఒక ఆహ్లాదకరమైన దృశ్యాన్ని ఈ పద్యంలో రూపు కట్టించాడు సోమన కవి.

Friday, 11 July 2014

FUNNY POEMS - CHAMATHKARA PADYAMALU



చమత్కార పద్యములు
(నానార్థగాంభీర్యచమత్కారిక నుండి సేకరణ)

1. కమలా కమలా మోదిత
కమలా కమలావతంస కమలా కమలా
కమలాకమలాన్వయవర
కమలా కమలాస్య రాధగానరెయిచటన్

2. కమలాకర కమలాకర
కమలాకర కమలకమల కమలాకారా
కమలాకర కమలాకర
కమలాకరమైన కొలను గనిరక్కాంతల్

3. విషధరనుత విషధరనుత
విషధరనుత విషధరాంత విషధరవినుతా
విషధరసుత విషసుషపతి
విషధర విషవరద నిన్ను వేమరు దలతున్

4. గంగం దరంగ రవమెస
గంగంబ్రవహించు నిన్ను గంగను గొనియే
గంగను బురములనెల్లన
గంగల నిర్జరులపురి తగం గనుపట్టెన్

5. లోలాలిలాలి లీలా
లీలా లీలాలలేల లీలలు లలులే స
లోలో లైలాలలలో
లీలాలోలాలు లోల లేలూ లేలా

6. నాని నీనాను నేనును నానినాను
నాన నేనును నిన్నూనినున్న నన్ను
నెన్న నున్నను నిన్నెన్న నున్న నాన
నిన్న నేనన్న నున్న నన్నెన్ను నన్ని

7. రాధితరాధిరాధి రధిరాధిత ధీదితపూర్వనీయ స
ద్రాధిత నాధినాధి తరదారిత రారితరారితరైరి సు
చాత్రాధి నా ధ నాయుతర చారిత కూరిత వారితాంబు వి
స్ఫూదిత సాధులోక నుత పూరిత రాజిత పూర్వశేఖరా

8. తవతవ తాహితాహి యహితార కమాల కలాలచంచరీ
జవజవ జాలజాల నహిజాలకవాలకవీలచుంబినీ
కవకవ కావకావశుక కాహిత కాహిత లోకసుందరీ
నవనవ నావనావని వనాహితనాహిత పూర్వశేఖరా

9. జలకలకలకులకులకుల
జలదకలక జలజములుకజలమలకపయో
ఫలనిలవలలన యలస
త్ఫలదాయక ఫలిత లలిత పూర్వవివేకా

10. శరశర కాండకాండ హరిచందన చందన నాగనాగ సుం
దరధర చంద్రచంద్ర శ్రిత నారదనారద తారతార భూ
ధరధర రాజరాజ హయదానవ దానవ కాశ కాశ స
త్పురపురమారమార హర భూధరభూధర కాలకాలహా