Search This Blog
Chodavaramnet Followers
Showing posts with label Health Tips with Fruits. Show all posts
Showing posts with label Health Tips with Fruits. Show all posts
Wednesday, 24 May 2017
Tuesday, 3 January 2017
HEALTH BENEFITS WITH REGIPANDLU
రేగిపండ్లు.. చిన్నారులకు భోగిపళ్లు... వ్యాధి నిరోధకశక్తిని పెంచుతాయ్
రేగిపళ్ళు అనగానే ప్రతి ఒక్కరికీ తమ బాల్యం రోజులు గుర్తుకొస్తాయి. రేగిపళ్లులో చిట్టిరేగి, పెద్దరేగి, గంగిరేగి ఇలా అనేక రకాలు ఉన్నాయి. అలాంటి రేగిపళ్ళలో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. రేగిపళ్ళు జ్యూస్‌లో విటమిన్ ఏ, విటమిన్ సి అధికం. రేగిపండ్లను జ్యూస్ రూపంలో తీసుకున్నా.. అలాగే తీసుకున్న ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. రేగిపండ్లను రోజుకు 3-6 తినడం వల్ల శరీరంలో రక్తపోటు తగ్గుతుంది. ఈ పండ్ల జ్యూస్ త్రాగడం వల్ల శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గించుకోవచ్చు. రేగుపండ్లు తినడం వలన రక్తకణాల సంఖ్య పెరుగుతుంది. మానసికపరమైన ఒత్తిడి తగ్గుతుంది. రేగుపండు వ్యాధి నిరోధకశక్తిని పెంచడమే కాకుండా, ఆకలినీ ... ఆరోగ్యాన్ని పెంచడంలో ప్రముఖపాత్ర వహిస్తుందని పెద్దలు చెపుతుంటారు.
రేగిపండ్ల జ్యూస్ తాగడం వల్ల గుండెపోటు, హృద్రోగ వ్యాధులను దూరం చేసుకోవడమే కాకుండా, బరువు కూడా తగ్గొచ్చు. అనీమియాతో బాధపడుతున్నట్లైతే, రేగిపండ్ల జ్యూస్ తీసుకోవడం వల్ల వ్యాధి నుంచి బయటపడొచ్చు. ఎందుకంటే ఇందులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడే పొటాషియం ఉంది. కాబట్టి ఒక గ్లాసు రేగి పండ్ల జ్యూస్ త్రాగడం వల్ల, ఇది చర్మానికి మాత్రమే కాదు. శరీరానికి కూడా సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
అంతేనా తెలుగు పండుగలలో సంక్రాంతిని అతిపెద్ద పండుగ. భోగి... సంక్రాంతి... కనుమ అంటూ మూడు రోజులపాటు జరిగే పండుగ ఇది. 'భోగి' రోజున చిన్న పిల్లలకు భోగిపండ్లు పోయడమనే ఆచారం ఉంది. ఇరుగు పొరుగు వారిని పేరంటానికి పిలిచి, చిన్న రేగిపళ్ళు... శెనగలు... చిల్లర డబ్బులు... పూలరేకులు కలిపి భోగిపండ్లు పోస్తుంటారు. రేగుపండ్లలో ఎన్నో దివ్యమైన ఔషధ గుణాలు ఉన్నాయి. రేగుపండ్లు తలపై నుంచి పోయడం వలన, అవి శరీరమంతా తాకుతూ కిందపడతాయి కనుక, చర్మ సంబంధమైన వ్యాధులు రాకుండా కాపాడతాయి.
Wednesday, 13 July 2016
Wednesday, 8 June 2016
Monday, 9 May 2016
Thursday, 28 April 2016
Monday, 18 April 2016
Monday, 1 February 2016
POMOGRANATE FRUIT GIVES STRENGTH TO BONES
ఎముకల ఆరోగ్యానికి కూడా దానిమ్మ చాలా మంచిది. ఆస్టియోఆర్థ్రయిటిస్‌తో బాధపడేవారికి అత్యంత రుచికరమైన మందు దానిమ్మ పండు, రసం. . జాయింట్స్ లో రుమటాయిడ్ ఆర్థరైటిస్ మరియు ఓస్టిరియోఆర్థరైటిస్ ఇన్ఫ్లమేషన్ ను తగ్గిస్తుంది.అనేక హెల్త్ ఇష్యులను తగ్గిస్తుంది. దానిమ్మలో అయాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి . ఇది శరీరం యొక్క ఇమ్యునిటీని పెంచుతుంది . అందుకే ఈ మార్గంలో మహిళలకు చాలా మేలు చేస్తుంది.
Wednesday, 23 December 2015
Saturday, 5 December 2015
Thursday, 2 July 2015
Saturday, 21 February 2015
JAMA PANDU UPAYOGALU - HEALTH WITH GUAVA FRUIT - HEALTH TIPS WITH FRUITS ESPECIALLY WITH GUAVA
జామపండు - ఆరోగ్య రహస్యాలు
జామపండు తినటానికి అందరు ఇష్టతారు, కానీ దీని వలన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు తెలిస్తే ఆర్చర్యానికి గురవుతారు
1) అతితక్కువ క్యాలరీలు , తక్కువ కొలెస్ట్రాల్ కలిగి , ఎక్కువ పోషక విలువలు ఉన్న పండు జామపండు.
2) ఎక్కవ పీచు పదార్ధం (ఫైబర్) కలిగి ఉంటుంది.మలబద్దకాన్ని తగ్గిస్తుంది.
3) వయసుకు ముందే ముఖం పై ముడతలు , చర్మంలో సాగుదల లేకుండా చేస్తుంది.
4) A , B , C , విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. శరీరానికి కావాల్సిన యాంటిఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి.
5) కంటి సమస్యలు , కొన్ని రకాల క్యాన్సర్లు రాకుండా జామపండు కాపాడుతుంది.
6) స్త్రీలలో రుతుచక్ర సమస్యలు , బ్రెస్ట్ క్యాన్సర్ మరియు పురుషులలో ప్రోస్టేట్ క్యాన్సర్లు రాకుండా నివారిస్తుంది.
7) జామపండు ప్రతి రోజు తీసుకోవడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరిగి , అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి.
8) దీనిలో విటమిన్ ఎ , ఫ్లావనాయిడ్స్ అయిన బీటాకెరోటిన్ , లైకోపిన్ ఉండడం వల్ల ఉపిరితిత్తులకు , చర్మానికి , కంటికి చాల మంచిది
9) అతినీలలోహిత కిరణాల నుండి వచ్చే కొన్ని క్యాన్సర్ కారకాలను జామకాయ లో ఉండే లైకోపిన్ అడ్డుకుంటుంది.
10) జామకాయ లో ఉండే పొటాషియం గుండె జబ్బులు , బీపి పెరగకుండా చేస్తాయి.
11) అంతే కాకుండా జమకాయలో B కాంప్లెక్స్ విటమిన్స్ (B 6 , B 9 ) , E , K విటమిన్స్ ఉంటాయి.ఎర్ర రక్త కణాల ఉత్పత్తిలో జామకాయ ఎంతగానో సహాయపడుతుంది.
*******************
జామపండు ప్రతి రోజు ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. బాగామాగిన జామపండులోని 50 గ్రాముల గుజ్జు, పది గ్రాముల తేనెను కలిపి తీసుకుంటే శరీరంలో శక్తి పుంజుకుంటుందని ఆరోగ్య నిపుణులు సూచించారు.
* ఉదయం, రాత్రి వేళల్లో భోజనానంతరం జామపండు సేవిస్తే జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. దీంతోపాటు మానసిక ఒత్తిడి కూడా మటుమాయమవుతుందని నిపుణులు చెపుతున్నారు.
* గుండెజబ్బుతో బాధపడే వారు ప్రతి రోజు భోజనంతో పాటు జామపండు గుజ్జును మూడు నెలలపాటు తీసుకుంటే మంచి ఫలితముంటుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. జామపండును తింటే శరీరంలో రక్త సరఫరా సాఫీగా జరుగుతుంది.
* జామపండు చెట్టులోని ఆకులను (కనీసం 20-25 ఆకులు) నీటిలో ఉడకబెట్టండి. ఉడకబెట్టిన నీటిని చల్చార్చి అందులో పటిక వేసి బాగా కలుపుకోండి. ఆ నీటిని పుక్కలిస్తే పంటి నొప్పులుంటే మటుమాయమై పోతాయని వైద్యులు సలహా ఇస్తున్నారు.

Subscribe to:
Posts (Atom)