Search This Blog

Chodavaramnet Followers

Showing posts with label Mushroom Curries/Recipes. Show all posts
Showing posts with label Mushroom Curries/Recipes. Show all posts

Monday, 20 May 2013

CHILLI WITH MUSHROOM AND NOODLES


కావలసిన పదార్థాలు:
బటన్‌ మష్రఉమ్స్‌(పుట్టగొడుగులు) -500గ్రా.
క్యాప్సికమ్‌ -200గ్రా.
మీడియం సైజు ఉల్లిపాయలు -2
అల్లం - 50గ్రా.
వెల్లుల్లి- 6 పాయలు
నూనె- 5 టీస్పూనులు
కారంపొడి- 1 టీస్పూన్‌
డార్క్‌ సోయాసాస్‌ -2టీ స్పూనులు
వెనీగర్‌- 2టీ స్పూనులు
కార్న్‌ ప్లోర్‌- 1టీ స్పూన్‌
మంచినీరు- 1కప్పు
తయారీ విధానం: మష్రఉమ్‌ రెండుగా కట్‌చేసుకోవాలి. క్యాప్సికమ్‌లను కూడా సగానికి కట్‌చేసి వాటిలోని విత్తనాలను తీసివేయాలి. ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లిలను మెత్తగా పేస్ట్‌ చేయాలి. ఓ బాణలిలో 5టీ స్పూన్ల నూనెను వేడిచేసి , అందులో నూరిన మిశ్రమాన్ని వేసి వేయించాలి. అందులోనే కారంపొడి కూడా వేసి పావుకప్పు నీటినిచేర్చి మిశ్రమం గట్టిపడేంత దాకా సిమ్‌లో ఉడికించాలి. ఆ తరువాత క్యాప్సికమ్‌, మష్రఉమ్‌ ముక్కల్ని వేసి తగినంత ఉప్పుకూడా చేర్చి కలిపి, మూతపెట్టి సిమ్‌లో బాగా ఉడికేంత వరకు మగ్గించాలి. బ్లాక్‌ సోయాసాస్‌, వెనిగర్‌లను కూడా మిశ్రమానికి కలిపి, కార్న్‌ఫ్లోర్‌ను కాసిన్ని నీటిలోవేసిి కలిపి కూరలోపోయాలి. ఆపై ఒక నిమిషం సిమ్‌లో ఉడికించి దించేయాలి. అంతే చిల్లీ మష్రఉమ్‌ రెడీ. దీన్ని వేడి వేడిగా వెజిటబుల్‌ రైస్‌ లేదా నూడుల్స్‌తో కలిపి సర్వ్‌ చేస్తేసూపర్బ్‌గా ఉంటుంది. ట్రై చేసి చూడండి.