Search This Blog
Chodavaramnet Followers
Showing posts with label Ulavalu Health Benefits. Show all posts
Showing posts with label Ulavalu Health Benefits. Show all posts
Tuesday, 2 April 2019
Thursday, 31 August 2017
Wednesday, 7 December 2016
HEALTH BENEFITS WITH INDIAN GRAINS - ULAVALU - AYURVEDIC TREATMENT
ఉలవలు ఆరోగ్యానికి ఎంతో మంచి చేస్తాయి. అలాగే బరువును బాగా తగ్గిస్తాయి. అయితే ప్రస్తుతం ఉలవలంటేనే ఎక్కువ మందికి నచ్చట్లేదు. అదీ ఉడికించిన గింజలను తినే అలవాటున్న వాళ్లు.. ఏ శనగలనో, పెసర గింజలనో తినడానికి ఇష్టపడుతున్నారు. కానీ ఉలవలను వారానికోసారైనా డైట్‌లో చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. సాధారణంగా వంద గ్రాముల పిజ్జా తింటే.. అందులో 12 గ్రాముల కొవ్వు ఉంటుంది. అదే వంద గ్రాముల ఉలవల్ని తింటే కొవ్వు అస్సలుండదు. వంద గ్రాముల ఉలవల్లో 321 కేలరీల శక్తితో పాటు 22 గ్రాముల ప్రొటీన్లు, 57 గ్రాముల కార్బొహైడ్రేడ్లు, 287 మిల్లీగ్రాముల కాల్షియం, 311 మి.గ్రా. ఫాస్ఫర్‌సలతో పాటు పీచుపదార్థాలుంటాయి. అదే పిజ్జాలో పోషకవిలువలు శూన్యం. ఉలవలు తింటే జ్వరం, జలుబు, అల్సర్, కాలేయ, కిడ్నీ సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఇంకా ఉలవలు మహిళలలో వచ్చే బహిష్టు సమస్యలకు దివ్యౌషధంగా పనిచేస్తుంది. ఇక, కండరాలను పటిష్టంగా ఉంచడంతోపాటు నరాల బలహీనతను దూరం చేసే ఉలవలను ఉలవచారు, గుగ్గిళ్లు, కూరలు, లడ్డూలు, సూప్‌లు ఇలా తయారు చేసుకోవచ్చు. అధిక బరువు సమస్యకు ఉలవలు దివ్యౌషధంగా పనిచేస్తాయి. నాణ్యమైన ఉలవలను సన్నటి సెగమీద లేతగా వేగించి.. చల్లారిన తరువాత మెత్తటి పౌడర్‌లా చేయాలి. రోజూ పరకడుపున రెండు చెంచాల పొడిని గ్లాసుడు నీళ్లలోకి వేసుకుని తాగితే బరువు తగ్గుతారు. ఉలవల్లో మధుమేహాన్ని నియంత్రించే గుణం ఉంది. ఇక ప్రస్తుతం అధిక బరువు అందరినీ వేధిస్తున్న సమస్య. అధిక బరువు ఉన్నవారికి పొట్ట పెరిగిపోవడం ప్రధాన సమస్యగా మారింది. అలా భారీగా పెరిగిన పొట్టని తగ్గించుకోవడం కోసం అనేక మంది తమకు తెలిసిన పద్ధతులను పాటిస్తూనే ఉన్నారు. కానీ సహజ పద్దతిలో ప్రయత్నిస్తే చాలా సులభంగా పొట్టని తగ్గించుకోవచ్చు. ఈ చిట్కాను పాటిస్తే పొట్టను ఈజీగా తగ్గించుకోవచ్చు. ఉలవ జావతో బరువు తగ్గండి ఎలాగంటే..?ఉలవలు - వంద గ్రాములు.నీరు - ఒక లీటరుఅల్లం పేస్ట్ - రెండు స్పూన్లుజీలకర్ర పొడి - ఒక టీ స్పూన్ఉప్పు - తగినంత మిరియాల పొడి - అర టీ స్పూన్ తయారీ విధానం: ముందుగా స్టౌ మీద పెట్టి నీళ్లు మరిగాక.. అల్లం పేస్ట్, జీలకర్ర పొడి.. తగినంత నీరు వేసి తెల్లనివ్వాలి. ఆపై ఉలవ పిండిని చేర్చి గడ్డకట్టకుండా గరిటెతో తిప్పుతూ.. జావలా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని రోజూ సాయంత్రం పూట తీసుకుంటే పొట్ట తగ్గుతుంది. ఇంకా సాగిన పొట్ట కూడా దగ్గరికొస్తుంది. నెలపాటు చేస్తే.. పొట్ట తగ్గడంతో పాటు బరువు కూడా తగ్గుతుంది
Subscribe to:
Posts (Atom)