Search This Blog
Chodavaramnet Followers
Showing posts with label Ganapathi Chathurdhi Festival Articles. Show all posts
Showing posts with label Ganapathi Chathurdhi Festival Articles. Show all posts
Thursday, 5 September 2019
Monday, 26 November 2018
Saturday, 29 October 2016
Monday, 21 September 2015
Wednesday, 20 August 2014
VINAYAKA CHAVITHI FESTIVAL ARTICLES IN TELUGU - WHY POOJA TO BE PERFORMED LORD GANESH STATUE MADE WITH CLAY ?
వినాయక చవితి సమీపిస్తున్నందున వినాయక చవితికి సంబంధించి మట్టి గణపతినే పూజించడం ఎందుకు? గణపతి నిమజ్జనం ఎందుకు? పత్రిపూజ ఎందుకు? గణపతి తత్వం ఏమిటి? వినాయకచవితి నివేదనలోని ఆయుర్వేద రహస్యాలు ఏమిటి? మొదలైన అంశాలను గణపతి అనుగ్రహంతో రోజు అందించే ప్రయత్నం చేస్తాను. - 1
ఓం గం గణపతయే నమః
అసలు మట్టి వినాయకుడినే పూజించడం ఎందుకు?
గణపతి లీలా వైభవాన్ని చెప్తున్న సూతులవారిని శౌనకాదులు ఒక సందేహం అడిగారు. "ఓ మహర్షి! ఈ వినాయక చవితి వ్రతమునందు మట్టితో చేసిన గణపతినే పూజించడానికి కారణం ఏమిటి? పూజానంతరం వినాయక ప్రతిమను నీటిలో నిమజ్జనం చేయడం దేనికి?"
"మునీంద్రులారా! మంచి ప్రశ్నలు వేశారు. వినండి. పరమేశ్వరుడు విశ్వవ్యాపిత (అంతటా ఉన్నది పరమాత్ముడే) తత్వము కలిగినది భూమి కాబట్టి తొలుత మట్టితో గణపతిని చేసి, గణపతి యొక్క విశ్వవ్యాపకత్వాన్ని(అంతటా, అన్నింట అంతర్లీనంగా ఉన్నది గణపతే) ప్రకటించాడు. విశ్వవ్యాపకత్వము కలిగి ఉన్నది ప్రకృతి స్వరూపమైన మట్టి ఒక్కటే. దాని నుండే సకల జీవులు సృష్టించబడతాయి. దాని నుండి లభించే పోషక పదార్ధాల ద్వారానే సర్వజీవులు పోషింపబడతాయి. చివరకు సర్వజీవులు మట్టిలోనే లయమవుతాయి. ఇదే సృష్టి రహస్యం. ఇదే పరబ్రహ్మతత్వం. ఈ సత్యమును చాటడానికే నాడు పరమశివుడు పరబ్రహ్మ స్థూలరూపమైన భూమి నుండి మట్టిని తీసి దానితో విగ్రహాన్ని చేసి ప్రాణం పోశాడు (లింగపురాణం గణేశ ఖండం ప్రకారం శివుడే వినాయకుడి రుపాన్ని మట్టితో తయారుచేశాడు). మృత్తికయే పరబ్రహ్మ కనుక, #మట్టితో వినాయకుడిని చేసి పరబ్రహ్మ స్వరూపంగా పూజించడం ఆనాటి నుంచి ఆచారంగా వస్తున్నది. అంతేకాదు మట్టి ఎక్కడైనా, ఎవరికైనా లభిస్తుంది, దానికి బీదా, ధనిక అనే తారతమ్యం లేదు. సర్వ సమానత్వమునకు ఏకైక తార్కాణం భుమి/మట్టి/వసుధ. బంగారంతో విగ్రహం కొందరే చేయించుకోగలరు. విఘ్నేశ్వరుడు అందరివాడు. అందుకే అందరివాడైన గణపతి విగ్రహాన్ని మట్టితో చేసి పూజించే ఆచారాన్ని పరమశివుడే ప్రారంభించాడు. నేడు సమస్తమానవాళి ఆచరిస్తోంది. సర్వజీవ సమానత్వమునకు ప్రతీక మట్టి వినాయకుడు. అందుకే మట్టి విగ్రహానికి ప్రాధాన్యం, పూజ" అని చెప్పాడు సూతుడు.
మట్టి గణపతులనే ఆరాధించడమే మన సంప్రదాయం. మట్టి గణపతులనే పూజించండి. తద్వారా జరిగే కాలుష్యాన్ని నివారించండి.
ఓం గం గణపతయే నమః
ఓం గం గణపతయే నమః
అసలు మట్టి వినాయకుడినే పూజించడం ఎందుకు?
గణపతి లీలా వైభవాన్ని చెప్తున్న సూతులవారిని శౌనకాదులు ఒక సందేహం అడిగారు. "ఓ మహర్షి! ఈ వినాయక చవితి వ్రతమునందు మట్టితో చేసిన గణపతినే పూజించడానికి కారణం ఏమిటి? పూజానంతరం వినాయక ప్రతిమను నీటిలో నిమజ్జనం చేయడం దేనికి?"
"మునీంద్రులారా! మంచి ప్రశ్నలు వేశారు. వినండి. పరమేశ్వరుడు విశ్వవ్యాపిత (అంతటా ఉన్నది పరమాత్ముడే) తత్వము కలిగినది భూమి కాబట్టి తొలుత మట్టితో గణపతిని చేసి, గణపతి యొక్క విశ్వవ్యాపకత్వాన్ని(అంతటా,
మట్టి గణపతులనే ఆరాధించడమే మన సంప్రదాయం. మట్టి గణపతులనే పూజించండి. తద్వారా జరిగే కాలుష్యాన్ని నివారించండి.
ఓం గం గణపతయే నమః
ARTICLE ON SECRET / SCIENTIFIC REASON BEHIND SRI GANESH CHATHURDHI POOJA / LORD GANESH PUJA / VINAYAKA CHAVITHI FESTIVAL
!! OM MAHAGAPATIMBHAJHEY !!
ఓం గం గణపతయే నమః
పత్రి పూజ వెనకున్నశాస్త్రీయ కారణం ఏమిటి?
వినాయక చవితి వర్షాకాలంలో వస్తుంది. ప్రకృతి అంతా పచ్చగా ఉంటుంది. చెట్లు త్వరగా పెరుగుతాయి. అదే సమయంలో రోగాలు కూడా త్వరగా వ్యాపిస్తాయి. మన గణపతికి సమర్పించే ఏకవింశతి పత్రాలను (21 రకాల పత్రిని) ముట్టుకోవడం వేత, వాసన పీల్చడం చేత ఈ కాలంలో వచ్చే అనేకానేక వ్యాధులు నివారించబడుతాయి. ఎందుకంటే ఈ 21 రకాల పత్రికి ఎన్నో అధ్భుతమైన ఔషధ గుణాలున్నాయి. మన స్వామికి సమర్పించిన పత్రి యొక్క వాసన ఇల్లంతా వ్యాపించడం వలన, ఇంట్లో ఉన్న క్రిములను నశిస్తాయి.
9 రోజులపాటు వరసిద్ధి వినాయకుడికి పత్రిపూజ చేయాలని చెప్తారు. ఎందుకంటే ఈ తొమ్మిది రోజులు ఆ గణపతి విగ్రహం వద్ద కూర్చుని భజనలు, నృత్యగీతాలతో గడుపుతాం కనుక, 9 రోజుల పాటు ఈ పత్రి నుంచి వచ్చే ఔషధ గుణాలు సమ్మిళ్ళితమైన వాయువు మన శరీరంలో రోగనిరోధక శక్తిని వృద్ధి చేసి, ఇంతకముందు చేరి ఉన్న రోగకారక క్రిములను నశింపజేసి, సంవత్సరం మొత్తం ఆరోగ్యంగా ఉంచుతుందని ఆయుర్వేద శాస్త్రం చెప్తోంది.
వర్షాకాలంలో ఎక్కడెక్కడి నుండో వచ్చి బురద నీరు చెరువుల్లో చేరుతుంది. ఆ నీటిలో క్రిములుంటాయి. ఆ నీరు తాగడం చేత అనారోగ్యం కలిగే అవకాశం ఎక్కువ. అందుకే వినాయక ప్రతిమతో పాటు ఆ పత్రిని కూడా నీటిలొ వదిలితే, పత్రిలో ఉన్న ఔషధ గుణాల కారణంగా నీటి శుద్ధి జరుగుతుంది. నీటిలో అసహజమైన రసాయనాలు కలిపి శుద్ధి చేసేకంటే, సహజమైన పద్దతిలో, ప్రకృతి ప్రసాదించిన ఓషధుల చేత నీటిని శుద్ధి చేయడం శ్రేయస్కరమని భావించారు మన పూర్వీకులు. అట్లాగే మనకు అవసరమైన నీటిని, భూమిని, గాలిని శుద్ధి చేసుకోవడమే ఈ పండుగలో ఉన్న రహస్యం. ఈ విధంగా ఒక ప్రాంతం, రాష్ట్రం, దేశమంతా చేయడం వలన అందరూ ఆరోగ్యంతో సంతొషంగా ఉంటారు. ఆరోగ్యవంతమైన ప్రజలున్న దేశం మాత్రమే అభివృద్ధి చెందగలుగుతుంది. దానికి దోహదం చేస్తున్నది వినాయకచవితి. అందుకే వినాయకచవితి ఆయుర్వేదఆరోగ్య పండుగ అంటారు ఆయుర్వేద వైద్యులు ఏల్చూరి రాజారంజిత్ గారు.
ఏదైనా ఒక పండుగ, లేదా పూజ చేస్తున్నామంటే, అది మనకు మాత్రమే కాదు, మన సమాజానికి, దేశానికి, ప్రపంచానికి మేలు చేయాలన్న తపన కలిగిన పరమ నిస్వార్ధపరులు మన ఋషులు. ప్రతి పనిలోనూ విశ్వమానవ కల్యాణం గురించి కాంక్షించిన మహాపురుషులైన ఋషుల వారసత్వం మనదని సగర్వంగా చెప్పుకుందాం. ధర్మాన్ని, దేశాన్ని, ప్రకృతిని కాపాడుకుందాం. భావితరాలకు అందిద్దాం.
ఓం గం గణపతయే నమః
Subscribe to:
Posts (Atom)











