Search This Blog

Chodavaramnet Followers

Showing posts with label Drinking Tea Health Benefits. Show all posts
Showing posts with label Drinking Tea Health Benefits. Show all posts

Tuesday, 20 December 2016

WINTER PROTECTION WITH HERBAL TEA


చలికాలపు ఇబ్బందులా? హెర్బల్ టీలు ఉన్నాయిగా..
హెర్బల్ టీ యాంటీ ఆక్సిడెంట్ లతో నిర్మితమై ఉంటుంది.
రోజు లో రెండు సార్లు హెర్బల్ టీ తాగండి.
చలికాలంలో కలిగే అలర్జీలకు దూరంగా ఉంచుతుంది.

ప్రస్తుత కాలంలో ఎక్కువగా మనం వింటున్న పదం- "హెర్బల్ టీ", ఆర్గానిక్ కు పూర్తి వ్యతిరేఖంగా ఉండేదే హెర్బల్ టీ. హీర్బల్స్ లేదా మూలికల మరియు సహాజ ఆకులతో తయారు చేయటం వలన వీటిని హెర్బల్ టీ గా పేర్కొంటారు. ఈ హెర్బల్ టీని చాలా పురాతన కాలం నుండి తాగుతున్నారు మరియు వేడి సుగంధ పానీయ ద్రావణాన్ని 5000 సంవత్సరాల పూర్వం నుండి వాడుతున్నారు.
ఇది కూడా చదవండి : నోస్ బ్లాక్ ను తగ్గించే ఆయుర్వేద ఔషదాలు
నిజంగా చెప్పలంటే, మూలిక ఆకులను వేడి నీటిలో ఉంచి, 3 నుండి 4 నిమిషాల పాటూ వేడి చేయటం వలన తయారు చేసే ద్రావణం లేదా కషాయంగా దీనిని పేర్కొనవచ్చు. ఈ ఆకులను "కామెల్లియా సైనెన్సిస్" గా పేర్కొంటారు. చాలా సందర్భాలలో ఆరోగ్యాన్ని పెంచే మంచి సువాసన కలిగిన చల్లటి లేదా వేడి ద్రావణాన్ని టీకి పర్యాయపదంగా పేర్కొంటారు.
కావున హెర్బల్ అనే పదాన్ని మూలికలు లేదా మూలికల నుండి తయారు చేసిన టీలకి వాడవచ్చు. ఈ రకం టీ ల వలన అనేక రకాల ప్రయోజానాలు ఉన్నాయి- ఏకాగ్రత నుండి మన శరీరంలో జీవక్రియ పెంచుట వరకు సహాయపడతాయి. ఒక కప్పు వేడి హెర్బల్ టీలో కావలసినన్ని పోషకాలు మరియు యాంటీ ఆక్సిడెంట్ లు ఉంటాయి. దీనిలో కూడా కెఫీన్ ఉంటుంది కావున పిల్లలకు హెర్బల్ టీ లను ఇవ్వకూడదు.
హెర్బల్ టీలను వేడి నీటిలో మూలికలను లేదా ఆకులను కలిపి తయారు చేస్తారు లేదా మూలికలను లేదా ఆకులను నీటిలో వేసి వేడి చేయటం ద్వారా హెర్బల్ టీ తయారు చేస్తారు.కామెల్లియా సినేన్సిస్ ప్లాంట్ నుండి చేసిన టీ మాత్రమే కాదు చాలా రకాల హెర్బల్ టీలలో కెఫీన్ ఉండదు.
చలికాలంలో హెర్బల్ టీ లను తాగటం వలన శరీరానికి పోషకాలను అందిస్తుంది. వేడిగా ఉండే ఈ ద్రావణం- శరీరాన్ని హైడ్రేటేడ్ గా ఉంచటమే కాకుండా, ఆరోగ్యాన్ని పెంపొందించేదిగా ఉంటుంది. అంతేకాకుండా, వీటిని రోజులో పరిమిత స్థాయిలో మాత్రమే తాగాలి. ఎక్కువగా తాగటం వలన దుష్ప్రభావాలు కూడా కలగవచ్చు. హెర్బల్ టీ లను తాగే ముందు ఆయుర్వేద వైద్య నిపుణుడి సలహా తప్పక పాటించండి.

Saturday, 26 November 2016

Monday, 11 July 2016

CHAMANTHI FLOWER TEA HEALTH AND BEAUTY BENEFITS


చామంతి టీ చమక్కుమనిపిస్తుంది

గ్రీన్‌ టీనే కాదు...పూల తేనీరు తాగడం వల్లా బోలెడు ప్రయోజనాలు అంటున్నాయి తాజా అధ్యయనాలు. అందాన్ని ఇనుమడింప చేయడంలో చామంతి టీది ప్రత్యేక స్థానం..

* చామంతి టీని ముఖానికి రాసుకుని ఆరనివ్వండి. ఇది వడలిన చర్మం తక్షణ ఉపశమనం పొందేలా చేస్తుంది. దీనిలోని పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లూ, చర్మగ్రంథుల లోపలివరకూ చొచ్చుకునిపోయి శుభ్రం చేస్తాయి. చర్మం తాజాగానూ ఉంటుంది. అంతేనా కాలిన గాయాలు, దోమకాటు వల్ల వచ్చే దద్దుర్లు తగ్గుతాయి.

* చర్మంపై పేరుకున్న టాన్‌ ముఖాన్ని కాంతివిహీనంగా మార్చేస్తుంది. చామంతి టీని రోజూ ముఖానికి రాసుకుంటే సహజ బ్లీచింగ్‌ ఏజెంట్‌లా ఉపయోగపడుతుంది. ఇది చర్మ ఛాయను మెరుగుపరిచి వన్నెలీనేలా చేస్తుంది. ఇది చర్మాన్ని బిగుతుగా చేస్తుంది. ఫలితంగా ముఖంపై ఏర్పడే మచ్చలు వంటివి తగ్గుముఖం పడతాయి.

* నిద్రలేమి, పని ఒత్తిడి ...ఇతరత్రా కారణాలు కళ్లకింద వాపు వస్తుంది. ఇలాంటప్పుడు చామంతి టీ బ్యాగులని ఫ్రిజ్‌లో ఉంచి మూసిన కనురెప్పలపై ఉంచితే సమస్య దూరమవుతుంది. కంటి అలసటా తగ్గుతుంది. కళ్లకింద ఏర్పడే నల్లటి వలయాలూ దూరమవుతాయి.

* కప్పున్నర పాలపొడికి, అరకప్పు చామంతి టీని చేర్చి మెత్తగా కలపాలి. దీన్ని ఒంటికి పట్టించి నలుగులా రుద్దాలి. ఇది సహజ స్క్రబ్‌లా పనిచేస్తుంది. మృతకణాలు తొలగి చర్మం నునుపుగా మారుతుంది. చర్మం తేమగానూ ఉంటుంది.

* పావుకప్పు గోరింటాకు పొడికి చామంతి టీని చేర్చి నానబెట్టాలి. దీన్ని నాలుగైదు గంటల తరవాత తలకు పట్టించి...మరో గంట ఉంచాలి. ఆపై తలస్నానం చేస్తే జుట్టుకి తగిన పోషణ అందుతుంది. మెరుపులీనుతుంది.