Search This Blog

Chodavaramnet Followers

Showing posts with label Recipes - Telugu. Show all posts
Showing posts with label Recipes - Telugu. Show all posts

Monday, 26 December 2016

TASTY BREAKFAST MYSORE BONDA RECIPE MAKING IN TELUGU


మైసూర్‌బోండా గుల్లగా ఎలా?

* మాకు మైసూర్‌బోండా అంటే చాలా ఇష్టం. ఇప్పటికే చాలాసార్లు ఇంట్లో ప్రయత్నించాను. కానీ, హోటళ్లలోలా గుండ్రంగా, రుచిగా రావడంలేదు. కొన్నిసార్లు లోపలిభాగం అసలు కాలడంలేదు. అది పైన గుల్లగా, లోపల మృదువుగా ఉండాలంటే ఏం చేయాలో చెప్పండి.

• మైసూర్‌బోండా సరైన విధానంలో చేస్తే గనుక మీరన్నట్లుగానే వస్తుంది. నాలుగు వంతుల మైదాకి ఒక వంతు బియ్యప్పిండి తప్పనిసరిగా కలపాలి. అంతకన్నా ఎక్కువగా బియ్యప్పిండి కలిపితే చాలా గట్టిగా వస్తాయి. ఈ రెండింటినీ ఓ గిన్నెలో తీసుకుని కొద్దికొద్దిగా పుల్లటి మజ్జిగ పోస్తూ గారెల పిండిలా కలుపుకోవాలి. అది అందుబాటులో లేకపోతే నీళ్లు కూడా కలపొచ్చు. పొరపాటున నీళ్లు ఎక్కువైతే రెండు చెంచాల మైదాకి, చెంచా బియ్యప్పిండి చొప్పున కలుపుతూ సరిచేసుకోవాలి. బోండా లోపలి భాగం మెత్తగా రావాలంటే అందులో కొద్దిగా వంటసోడా వేయాలి. అది కూడా రెండు కప్పుల మైదాకి ముప్పావు చెంచా సోడా వాడాలి. పెరుగు పుల్లగా లేకపోతే పిండి కలిపిన తర్వాత ఒక గంటపాటు నాననివ్వాలి. అదే పుల్లని పెరుగయితే అరగంట నానితే సరిపోతుంది. ఇది రుచిగా రావాలంటే ఉప్పూ, పచ్చిమిర్చితోపాటూ అల్లం ముక్కలూ, జీలకర్ర వేసుకోవచ్చు. ఇంకాస్త రుచి కోసం పచ్చి కొబ్బరి తురుము కూడా ఉపయోగించొచ్చు. కాస్త కారంగా ఉండాలనుకుంటే మిరియాలూ, సన్నగా తరిగిన కరివేపాకూ, కాస్తంత ఇంగువా, కొత్తిమీర తరుగు వేయాలి. చేతికి కొద్దిగా నూనె రాసి ఈ పిండిని నిమ్మకాయంత పరిమాణంలో తీసుకుని కాగే నూనెలో వేయాలి. నూనెలో వేశాక బోండాలను కలియతిప్పుతూ ఉంటే అన్ని వైపులా బాగా వేగుతాయి. మీరు అనుకున్నట్లు హోటలు రుచిలో వస్తాయి.

Tuesday, 2 August 2016

JHAL ZEERA JUICE FOR GOOD HEALTH


శరీరాన్ని డిటాక్సిఫై చేసే జల్ జీరా జ్యూస్

కావాల్సిన పదార్ధాలు :
1) ఒక స్పూన్ జీలకర్ర 
2) ఒక పెద్ద గ్లాస్ వాటర్
3) ఒక అర చెక్క నిమ్మరసం
4) చిటికెడు మిరియాల పొడి
5) చిటికెడు సాల్ట్

తయారీ విధానం :
ఒక గిన్నెలో పెద్ద గ్లాస్ వాటర్ దానిలో ఒక స్పూన్ జీల కర్ర వేసి మరిగించాలి.గోరువెచ్చగా చల్లార్చి దానిలో అరచెక్క నిమ్మరసం , చిటికెడు సాల్ట్ , చిటికెడు మిరియాల పొడి వేసి తీసుకోవాలి.
ఉదయం పరగడుపున లేదా సాయంత్రం ఖాళీ కడుపుతో తీసుకొంటే మంచిది.

ప్రయోజనాలు:
1) శరీరం నుండి టాక్సిన్స్ ఫ్లష్ అవుట్ చేస్తుంది.
2) పొట్టను క్లీన్ చేస్తుంది.
3) కొలెస్ట్రాల్ అదుపులో ఉంచుతుంది, షుగర్ లెవెల్స్ నార్మల్ చేస్తుంది.
4) PCOD , ఋతుచక్రం సమస్యలను తగ్గిస్తుంది.
5) జీర్ణ శక్తిని పెంచుతుంది.

Tuesday, 12 July 2016

Thursday, 21 January 2016

MAKING OF COCONUT CHUTNEY RECIPE IN TELUGU - KOBBARI CHUTNEY RECIPE MAKING


నోరూరించే కొబ్బరి చట్నీ

కావల్సిన పదార్థాలు: 
ఫ్రెష్ గా తురుమిన కొబ్బరి : 1cup పెరుగుం 2tbsp(బాగా గిలకొట్టాలి) ఆవాలు: 1/2tsp పచ్చిమిర్చి: 8 ఎండుమిర్చి: 2 ఉప్పు: రుచికి సరిపడా ఉద్దిపప్పు: 1tsp
నూనె: కొద్దిగా నీళ్ళు: కొద్దిగా కరివేపాకు : 2రెమ్మలు

తయారుచేయు విధానం:
1. ముందుగా మిక్స్ జార్లో కొబ్బరి తురుము, పచ్చిమిర్చి, మరియు పెరుగు వేసి, కొద్దిగా నీళ్ళు పోసి బ్లెడ్ చేయాలి . మెత్తగా పేస్ట్ చేయాలి . తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లో వేసి పక్కన పెట్టుకోవాలి. 2. తర్వాత పాన్ లో కొద్దిగా నూనె వేసి అందులో ఆవాలు వేసి వేగిన తర్వాత ఎండు మిర్చి, కరివేపాకు వేసి ఒక నిముషం వేగించాలి.రుచికరమైన శెనగపప్పుకొబ్బరి చట్నీ 3. పోపు వేగిన తర్వాత అందులో మిక్సీలో తయారుచేసుకొన్న కర్డ్ కోకనట్ చట్నీ వేసి, మీడియం మంట మీద 5నిముషాలు మిక్స్ చేస్తూ ఉడికించి స్టౌ ఆఫ్ చేయాలి . 4. ఈ చట్నీని సర్వింగ్ బౌల్లో వేసి ఇడ్లీ, వడ లేదా దోస, ప్లెయిన్ రైస్ కు కాంబినేషన్ గా వడ్డించవచ్చు.

Saturday, 1 November 2014

SNACKS WITH SOYA BEANS - HEALTH FOOD RECIPE FOR ALL AGES


సోయాబీన్స్ తో స్నాక్ తయారీ విధానం 

సోయాబీన్స్ లో ప్రోటీన్ , విటమిన్స్ , మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. 

ఆరోగ్యానికి మంచిది. సోయాబీన్స్ తో స్నాక్ తయారీ చూద్దాం !

కావలసినవి 
1) 1 కప్ సోయాబీన్స్ (ఒక 3-4 గంటలు నానబెట్టి,ఉడికించుకోవాలి)
2) చిటికెడు మిరియాలపొడి
3) సన్నగా తరిగిన ఉల్లిపాయలు & పచ్చిమిర్చి
4) సన్నగా తరిగిన కొత్తిమీర
5) ఒక స్పూన్ నిమ్మరసం
6) తగినంత ఉప్పు .

తయారీ విధానం
మొదటగా ఒక బౌల్ లో ఉడికించిన సోయాబీన్స్ , మిరియాలపొడి , ఉల్లిపాయ , పచ్చిమిర్చి ముక్కలు , 
కొత్తిమీర , తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. కావాలంటే నిమ్మరసం వేసుకోవచ్చు.
 కొద్దిగా ఆయిల్ వేసి తాలింపు కూడా పెట్టుకోవచ్చు.

పిల్లలకు , పెద్దలకు మంచి స్నాక్ ఇది !!! ట్రై చేయండి.

Thursday, 5 September 2013