Search This Blog

Chodavaramnet Followers

Showing posts with label Tourism. Show all posts
Showing posts with label Tourism. Show all posts

Friday, 23 February 2018

SRI KETHAKI SANGAMESWARA KSHETRA MAHATYAM - PART-II








SRI KETHAKI SANGAMESWARA KSHETRA MAHATYAM 

MANGALAHARATHI


SIVA STUTHI



SRI KETHAKI SANGAMESWARA KSHETRA MAHATYAM - PART-I












Tuesday, 12 December 2017

BRIEF ARTICLE ABOUT SRI RAJARAJESWARI SAHITHA SOMESWARA SWAMY VARI DEVASTHANAM - KOTIPALLI - EAST GODAVARI DISTRICT - ANDHRA PRADESH - INDIA


పవిత్ర గోదావరి నది ఒడ్డున ఉన్న ఈ కోటిపల్లి ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం. శ్రీరాజరాజేశ్వరి సహిత సోమేశ్వరస్వామి వారి దేవస్థానం కోటిపల్లి .
వ్యాస భగవానుడు రచించిన బ్రహ్మాండ పురాణములోని గౌతమీ మహాత్యములో ఈ కోటిపల్లి క్షేత్ర మహత్యముంది .
కోటిపల్లి గుడిలో రాజరాజేశ్వరి సహిత సోమేశ్వరస్వామివారు, అమ్మవారితో కూడిన కోటీశ్వర స్వామివారు,శ్రీదేవి, భూదేవి సహిత జనార్థన స్వామి వారు వేంచేసి ఉన్నారు.
ఈ క్షేత్రము పూర్వకాలమున "కోటి తీర్ధము గాను" సోమ ప్రభాపురము " గాను పిలువబడి నేడు "కోటిఫలి" మహాక్షేత్రముగా ఖ్యాతిపొంది విలసిల్లుచున్నది .
కోటిఫలి గౌతమీ నది ( గోదావరి ) ఒడ్డున ఉంది .ఇచట గౌతమీ పుణ్య నదీలో విష్ణుతీర్ధ, రుద్రతీర్ధ,బ్రహ్మతీర్ధ,మహేశ్వర తీర్ధ,రామతీర్ధాది అనేక పుణ్య నదులు కోటి సంఖ్యలో అంతర్వహినులుగా ప్రవహించుచున్న కారణముగా " కోటి తీర్ధ క్షేత్రము "గా ఖ్యాతి వహించినది .
స్వామి వారి ఆలయానికి ఎదురుగా ఉన్న కోనేరును సోమగుండం అని పిలుస్తారు .
ఉమా సమేత కోటిశ్వరాలయము
ఇంద్రుడు తాను చేసిన పాపాలు పోగొట్టు కోవడానికి ఉమా సమేతుడైన కోటీశ్వర లింగాన్ని ప్రతిష్ఠించగా , సోమేశ్వర స్వామి వార్ని చంద్రుడు ప్రతిష్ఠిం caaడు . కోటేశ్వరుడు ఎప్పుడు నీటిలోనే ఉంటాడు .
శ్రీ ఛాయ సోమేశ్వర స్వామి
చంద్రుడు కోటి తీర్ధమునకు వచ్చి , గౌతమీ పుణ్యనదిలో భక్తీ శ్రద్ధలతో శ్రీ సిద్దిజనార్దుని , కోటీశ్వరుని దర్శించి సేవించి సోమేశ్వర నామంతో శివలింగమును ప్రతిష్ఠించి పూజించి ప్రార్ధించి పాప విముక్తుడాయేనని , తాను కోల్పోయిన ఛాయను తిరిగి పొందుటచే ఈ లింగమునకు " ఛాయా సోమేశ్వర లింగము పేరు వచ్చినది అని స్థలపూరణం .శ్రీదేవి,భూదేవి సమేతుడైన సిద్ధి జనార్థన స్వామి వారిని కశ్యప ప్రజాపతి ప్రతిష్ఠించాడని, ఆయనే క్షేత్రపాలకుడని చెబుతారు.

ఈ పవిత్ర గౌతమీ తీర్థం లోని పుణ్య స్నానం సర్వపాపాలను తొలగించి పుణ్యాన్ని ఇస్తుంది. శివకేశవ భేదం లేదని ఈ క్షేత్రం మనకు పున: పున: చెబుతుంది. కోటీశ్వర లింగం యోగ లింగం అని, సోమేశ్వర లింగం భోగ లింగం అని, రాజరాజేశ్వరమ్మ భక్తుల కోరికలు తీర్చే తల్లి అని భక్తుల నమ్మిక.
శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు
అమ్మవారికి ప్రత్యేక ఆలయము కలదు . అమ్మవారు దివ్యమైన తేజస్సుతో నిరంతరమూ ప్రశాంత వదనముతో చిదానందముతో కూడిన వాత్సల్య పూరితమైన చూపులతో భక్తులకు దర్శన మోసంగుచూ వేంచేసియున్నారు .
ఆలయం లో నాలుగు ప్రదక్షిణ మండపాలు ఉన్నాయి. ఉత్తర మడపం లో కాలభైరవ స్వామి మందిరం ఉంది. అర్చకులు ప్రతీరోజు ప్రాతః కాలమందే కోటి తీర్థం నుండి జలాలు తీసుకొని వచ్చి స్వామికి అభిషేకం, అర్చన చేస్తారు. సాయం సంధ్య వేళ స్వామికి ధూప సేవ, ఆస్థాన సేవ, పవళింపు సేవ అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. పురాతన కాలంనుండి ఈ పవిత్రక్షేత్రాన్ని భక్తులు దర్శించి తరిస్తున్నారు. ఒకప్పుడు ఈ ప్రదేశాన్ని సోమప్రభాపురం అని పిలిచేవారు. ఇక్కడ సోమం కుండం అనే ఒక పెద్ద పుష్కరిణి నేటికీ ఉంది. ఆదిశంకరులు ఈ క్షేత్రాన్ని దర్శించారని చెబుతారు. ఈ దేవాలయం లోనే చంద్రమౌళిశ్వర స్వామి శంకరాచార్యుల మందిరం, ఉమా సమేత మృత్యంజయ లింగం , నవగ్రహాల గుడి ఉన్నాయి.
ఇది కాకినాడకు 38 కి.మీ.లు, రాజమండ్రికి 60 కి.మీ. దూరంలో ఉంది. కోటిపల్లి అమలాపురం నుండి 15 కి.మీ. దూరంలో ఉంది, ఇక్కడకు పడవ లేదా ఫెర్రి ద్వారా చేరుకోవచ్చు.





Wednesday, 24 May 2017

Pollachi Tourism, Travel Guide & Tourist Places - Pollachi - Around Pollachi - Tamil Nadu - India - Coimbatore


Pollachi is a town and a taluk headquarters in Coimbatore district, Tamil Nadu state, India. Located about 40 km to the south of Coimbatore, it is the second largest town in the district after Coimbatore

ARTICLE IN TELUGU ABOUT GREATEST INDIAN TOURIST SPOT - POLLACHI

Thursday, 19 January 2017

ARTICLE IN TELUGU ABOUT WORLD FAMOUS LORD SIVA TEMPLES - PANCH KEDAR TEMPLES - KEDARNATH - MADMAHESHWAR - TUNG NATH - RUDRANATH - KALPESHWAR


పంచ కేదారాలు

కురుక్షేత్ర యుద్ధం ముగుసిసిన తరువాత పాండవులు బ్రహ్మహత్యా పాతకం, దాయాదులను చంపిన పాపం పోగొట్టు కోవడానికి శివ దర్శననానికి వెళ్ళారు వారికి దర్శనం ఇవ్వడానికి ఇషట పడని ఈశ్వరుడు కాశీ విడిచి నంది రూపం ధరించి ఉత్తర దిశగా పయన మయ్యాడు. పాండవులు పట్టు వదలక వెంబడించగా గుప్త కాశీ ప్రాంతంలో నంది రూపంలో కనిపించిన ఈశ్వరుని పట్టుకోవడానికి భీమశేనుడు ప్రయత్నించగా ఈశ్వరుడు మాయమయ్యాడు. 

అప్పుడు ఈశ్వరుని శరీర భాగాలు ఐదు ఛోట్ల ప్రతిష్ఠితమై అవి పుణ్య క్షేత్రాలుగా భాసిల్లాయి. శివ పురాణంలో వర్ణించబడిన పంచ కేదారాలను పంచఆరామాలని పిలుస్తుంటారు. అవి వరసగా కేదారినాధ్, తుంగ నాధ్, రుద్ర నాధ్, మధ్య మహేశ్వర్, కల్పేశ్వర్. నేపాల్ లోని ఘోరక్ నాధ్ తెగ వారు పంచకేదార యాత్రకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. భారతీయులూ ఈ యాత్రకు ప్రాధాన్యత ఇస్తారు. కాఠ్మండు లోని పశుపతి నాధ్ ఆలయ నిర్మాణానికి ఈ పొంచ కేదారాల నిర్మాణానికి పోలికలు ఉంటాయి.

*కేదారినాధ్

ద్వాదశ జ్యీతిర్లింగాలలో ప్రసిద్ధి చెందింది పంచ కేదారాలలో మొదటిది కేదారనాధ్. పాండవులకు అందకుండా పారి పోయిన శివుని మూపురభాగం ఉన్న చోటు. ఇందుకు నిదర్శనంగా ఇక్కడి లింగం ఎనిమిది గజముల పొడవు, నాలుగు గజముల ఎత్తు, నాలుగు గజముల వెడల్పు ఉంటుంది. ఈక్కడి లింగం త్రిభుజాకారంలో ఉంటుంది. పాండవులు తమ అంతిమ దశలో స్వర్గారోహణ ఇక్కడ నుండి ప్రారంభించారు. శంకరాచార్యులు మోక్షం పొందిన క్షేత్రం ఇదే. సంవత్సరానికి ఆరు నెలలు మాత్రమే తెరచి ఉంచే ఈ ఆలయం ప్రతి సంవత్సరం అక్షయత్రుతియ నాడు తెరుస్తారు. 

కాత్రిక మాసంలో వచ్చే యమద్వివిధియ నాడు మూసి వేస్తారు. ఈ మధ్య కాలంలో స్వామి వారి ఉత్సవ విగ్రహాన్ని యూకీ మఠానికి తరలించి అక్కడ పూజలు నిర్వహిస్తారు. ఈ ఆలయం సముద్ర మట్టానికి 11,758 అడుగుల ఎత్తులో ఉంటుంది. హృషీ కేశ్ వరకు రైలు మార్గం ఉంటుంది. అక్కడి నుండి దాదాపు 250 కిలోమీటర్ల దూరం రోడ్డు మార్గంలో ప్రయాణించి గౌరీ కుండ్ చేరుకుని అక్కడి నుండి శిఖరానికి 14 మైళ్ళ దూరం కాలి నడకన చేరాలి. కానీ భక్తులు అనేక మంది డోలీలు, గుర్రాలపై ప్రయాణించి ఆలయం చేరుకుంటారు.

* తుంగనాధ్

పంచ కేదారాలలో రెండవది తుంగనాధ్. శివుని చేతులు లింగ రూపంలో వెలసిన క్షేత్రం ఇది. ఇది సముద్ర మట్టానికి 12,000 అడుగుల ఎత్తులో ఉంటుంది కేదారానికంటే ఎత్తైన ప్రదేశం. తుంగనాధుడంటే శిఖరాలకు అధిపతి అని అర్ధం. ఈ ఆలయంలోని లింగం ఒక అడుగు ఎత్తున చేతులను పోలి ఉంటుంది. స్వల్పంగా ఎడమ వైపు వాలి ఉంటుంది. గర్భగుడిలో శివునితో వ్యాస, గణపతి అష్టధాతు విగ్రహాలు ఉంటాయి. ప్రమధ గణాల విగ్రహాలు ఉంటాయి. పాండవుల చిత్రాలు గోడలో చెక్కి ఉంటాయి. ఆలయానికి కుడి వైపున పార్వతీ దేవి ఆలయం ఉంటుంది. వేరొక వైపున ఐదు ఆలయాలు ఉంటాయి . అవి పంచకేదారెఆల నమూనాలు. ఈ ఆలయాన్ని అర్జునుడు నిర్మించారని స్థల పురాణం చెప్తుంది. శీతా కాలంలో ఉత్సవ విగ్రహాలను ముకునాధ్ మఠానికి తరలించి పూజలు నిర్వహిస్తారు.

* రుద్రనాధ్

పంచ కేదారాలలో మూడవది రుద్రనాధ్. నంది రూపంలో ఉన్న శివుని ముఖ భాగం వెలసిన చోటు ఇదే. అరమోడ్పు కన్నులతో భువనమోహనంగా ముఖ లింగ రూపంలో ఉండే స్వామిని నీలకంఠ్ మహాదేవ్ అని భక్తులు పిలుస్తారు. తెల్ల వారు ఝామున అభిషేక వేళలో స్వామి వెండి తొడుగు తొలగిస్తారు. నిజరూప దర్శననానికి భక్తులు ప్రాధాన్యత ఇస్తారు. ఈ ఆలయం సముద్ర మట్టానికి 7,500 అడుగుల ఎత్తులో ఉంటుంది ఈ ఆలయానికి వెనుక భాగంలో వైతరణీ నది ప్రవహిస్తుంటుంది. ఇక్కడకు వచ్చే భక్తులు తమ పూర్వీకులకు మోక్షం ప్రసాదించమని వేడుకుంటారు. ఈ ఆలయానికి సమీప గ్రామం గోపేశ్వర్.గోపేశ్వర్ నుండి 24 మైళ్ళు క్లిష్టమైన కొండ దారిలో కాలి నడకన ప్రయాణించి ఆలయానికి చేరాలి కనుక పంచ కేదారాలలో ఇది చాలా కష్ట తరమైనదిగా భావిస్తారు. శీతాకాలంలో ఇక్కడి విగ్రహాలను గోపేశ్వర్కు తరలించి అక్కడ పూజలు నిర్వహిస్తారు.

* మధ్య మహేశ్వర్

పంచ కేదారాలలో నాలుగవది మధ్య మహేశ్వర్. విశ్వనాధుని నాభి భాగం లింగంగా వెలసిన క్షేత్రం. నంది రూపంలూ ఉన్న ఈశ్వరుని భీమసేనుడు పట్టుకున్న గుప్త కాశీకి 24 మైళ్ళ దూరంలో ఉన్న ఈ క్షేత్రం ఎత్తు సముద్ర మట్టానికి 11,470 అడుగులు. ఈ ఆలయానికి ఎడమ వైపున రెండు చిన్న ఆలయాలు ఉన్నాయి ఒకటి పార్వతీ దేవిది, ఒకటి అర్ధ నారీశ్వరునిది. ఈ మూడు ఆలయాలను భీమసేనుడు నిర్మించాడని చెప్తారు. ఆలయానికి కుడి వైపున చలువరాతితో నిర్మించిన సరస్వతీ దేవి ఆలయం ఉంటుంది. శీతా కాలంలో ఇక్కడి విగ్రహాలను యూకీ మఠానికి తరలించి అక్కడ పూజలు నిర్వహిస్తారు.

* కల్పనాధ్

పంచ కేదారాలలో చివరిది కల్పనాధ్. ఈ ఆలయం సముద్ర మట్టానికి 7,400 అడుగుల ఎత్తులో ఉంటుంది. హృషీకేశ్ బద్రీనాధ్ రోడ్డు మార్గంలో 12 కిలోమీటర్లు ప్రయాణించి ఈ ఆలయం చేరుకోవచ్చు. శివుని ఝటాఝూటం ఇక్కడ లింగ రూపంలో వెలసిందని స్థల పురాణం చెప్తుంది. ఈ ఆలయంలో సంవత్సరమంతా పూజలు నిర్వహిస్తారు. కోడలపై దట్టమైన అడవుల మధ్య చిన్న గుహలో వెలసిన ఈ స్వామిని ఝటేశ్వర్ అని భక్తులు పిలుస్తారు. అత్రి, అనసూయల పుత్రుడైన దుర్వాస మహర్షి ఈ ఆలయప్రాంగణంలో ఉన్న కల్ప వృక్షం కింద తపస్సు చేసి శివుని నుండి అనేక వరాలు పొందాడని ప్రతీతి.



Tuesday, 19 April 2016

SRI SANKARACHARYA TEMPLE - SRINAGAR - INDIA


శంకరాచార్య దేవాలయం, శ్రీ నగర్!
.
శంకరాచార్య దేవాలయం తఖ్త్- ఎ-సులేమాన్ అని కూడా పిలవబడే 
శంకరాచార్య కొండ మీద శ్రీనగర్ నగర ఉపరితలానికి 1100 అడుగుల ఎత్తులో ఉంది. ఈ ఆలయం హిందూ మతానుసారం లయకారి అయిన శివుని కి అంకితం చేయబడింది.

ఇది కాశ్మీర్ లోయలో పురాతన ఆలయాలు ఒకటి.
దీన్ని క్రీ.పూ 371 లో నిర్మించిన రాజా గోపాదత్య పేరునే ఆలయానికి పెట్టారు.
ఆది శంకరాచార్య తన కాశ్మీర్ పర్యటనలో భాగంగా ఇక్కడ బస చేసిన తర్వాత ఆలయం పేరుని గోపదారి నుండి శంకరాచార్య దేవాలయం గా మార్చారు.
తరువాత దోగ్రా పాలకుడు, మహారాజా గులాబ్ సింగ్, భక్తుల సౌలభ్యం కోసం ఆలయానికి రాతి మెట్లు కట్టించాడు
. ఆలయ విద్యుద్దీకరణ 1925 లో జరిగింది. హిందువులకు ఒక ముఖ్యమైన
మత కేంద్రంగా మాత్రమే గాక, ఈ ఆలయం గొప్ప పురావస్తు విలువ
కూడా కలిగి ఉంది.

Monday, 11 April 2016

ARTICLE ABOUT SRI UMAKOPPULINGESWARA SWAMY TEMPLE - PALIVELA - KOTHAPET MANDALAM, EAST GODAVARI DISTRICT, ANDHRA PRADESH - MUST VISIT


శ్రీ ఉమాకొప్పులింగేశ్వర స్వామి దేవాలయం 

పలివెల, తూర్పు గోదావరి జిల్లా, కొత్తపేట మండలానికి చెందిన గ్రామము. పలివెల రాజమండ్రికి 50 కి.మీ., కాకినాడకు 90 కి.మీ. మరియు అమలాపురానికి 25 కి.మీ. దూరంలో కలదు. ఈ గ్రామములొ శ్రీ ఉమాకొప్పులింగేశ్వర స్వామి దేవాలయం కలదు. ఇక్కడ శివరాత్రి రోజున కళ్యాణ మహోత్సవం విశేషం.

* గ్రామం పేరు

"పలివెల" అను పేరు ఈ గ్రామానికి రావడం గురించి రెండు కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి.

* పౌరాణిక గాధ

పౌరాణిక గాధ ననుసరించి, క్షీరసాగర మధనంలో ఉద్భవించిన అమ్రుతలింగాన్ని రాక్షసులు ఒక 'పల్వలము' (గొయ్యి)లో దాచారు. అగస్త్యమహాముని ఆ అమ్రుతలింగాన్ని పరమేశ్వరితో సహా అక్కడే ప్రతిష్ఠించాడు. ఆ పల్వలమే కాలక్రమేణా పలివెలగా మారింది.

* చారిత్రక గాధ.

ఈ ప్రాంతాన్ని పూర్వకాలములో పల్లవులు పాలించుట వలన "పల్లవ" నండి "పలివెల" అయిందని అంటారు.

స్థ్లల పురాణం*

ఇక్కడి శివలింగ ప్రతిష్థ అగస్త్య మహర్షి ద్వారా జరిగింది అని ప్రతీతి. ఈ దేవాలయములొని కళ్యాణ మండపాన్ని11 వ శతాబ్దం లొ రాజరాజ నరేంద్రుడు జీర్ణోద్ధారణ చేశాడని చెబుతారు. ఈ ఆలయ కళ్యణ మండపములో వేదిని అల్లాదరెడ్డి క్రీ.శ 1416లో కట్టించి ఈ మండపమునకు కొత్త రూపాన్ని ఇచ్చినట్లు ఈ మండపములోనే శాసనము ఉంది. అగస్త్యమహర్షి శివ పార్వతుల కళ్యాణం చూడవలెనని కొరికతో కౌశిక నది ఒడ్డున శివలింగ ప్రతిష్థ చేశాడు. దక్ష యజ్ఞానికి పూర్వం ఇంద్రాది దేవతలు మరియు హిమవంతుడు అగస్త్య మహర్షి పార్వతి కళ్యాణాని కి వస్తే ప్రళయం వస్తుంది అని భావించి విశ్వంభరుడుని అగస్త్య మహర్షి వద్దకు పంపుతారు. అగస్త్య మహర్షి తన దివ్యదృష్టి తో శివ పార్వతుల కళ్యాణం వీక్షించగా శివ పార్వతులు మధుపర్కాలలో కనిపిస్తారు. అగస్త్య మహర్షి శివుని ప్రార్దించగా శివుడు ప్రత్యక్షమై వరాన్ని కొరుకోమనగా అగస్త్య మహర్షి శివపార్వతులను ఒకే పీఠంపై అనుగ్రహించమని కోరుతాడు. ఇదే ఇక్కడ విశేషం. వేరే ఎక్కడ శివ పార్వతులు ఒకే పీఠం మీద కనపడరు. మొదట ఈ క్షేత్రం లొ శివుడు లోల అగస్త్య లింగేశ్వరుని గా తరువాత కొప్పులింగేశ్వర స్వామి గా పూజలందుకొంటున్నాడు.

* సాహిత్యాధారాలు

శ్రీనాథుడు ని కాలంలొ అగస్త్య లింగేశ్వరునిగా పూజలందుకొన్నట్లుశ్రీనాథుడు శ్లొకాన్ని వ్రాశాడు. ఈయన తన కాశీఖండము, భీమఖండము మరియు శివరాత్రి మహాత్మ్యములలో ఈ స్వామిని కొప్పయ్య, కొప్పులింగడు అని గొప్పగా వర్ణిస్తూ, ఈస్వామే తన ఇంటి ఇలవేల్పని చెప్పాడు. ఈ కాలానికే చెందిన అజ్జరపు పేరయలింగ కవి కూడా తన "ఒడయనంబి విలాసం"లో ఈ స్వామిని గురించి వర్ణిస్తూ, ఇప్పటి ఈ చిన్న గ్రామమును ఒక గొప్ప పట్టణముగా చెపుతూ ఇంద్రుడు ఒక్కసారి ఇక్కడికి వస్తే తన స్వర్గాన్ని మరిచిపోతాడని అన్నాడు. ఈ సాహిత్యాధారాల వలన క్రీ.శ 14వ శతాబ్దంనాటికే పలివెల గొప్ప పట్టణమని, ఇక్కడ వేంచేసి ఉన్న కొప్పులింగేశ్వరుని ఆలయము ఒక ప్రముఖ పుణ్యక్షేత్రమని తెలుస్తోంది.

చారిత్రక ఆధారాలు: ఈ ఆలయములో అనేక శాసనాలు ఉన్నాయి. ఇప్పటి వరకూ లభించిన వానిలో పురాతనమైనది క్రీ.శ 1170 కి చెందింది. ఇది ఒక ప్రముఖ కవి యొక్క దాన శాసనము. ఇంకా కాకతీయ ప్రతాపరుద్రునికి చెందిన శాసనము, రెడ్డిరాజులకు చెందిన శాసనాలే కాక ముస్లిం రాజైన కుతుబ్-ఉల్-ముల్క్ కు చెందిన దానశాసనము ఉండడం విశేషం. ప్రస్తుతము క్రీ.శ 15వ శతాబ్దము వరకూ శాసనాలు లభించాయి. పిఠాపురం రాజావారి పాలనలో కూడా పలివెల ఒక ప్రత్యేకమైన ఠాణాగా ఉండేది. ఈ ఆధారాల వలన క్రీ.శ.10వ శతాబ్దం నుండి కూడా రాజులు, ప్రముఖులు, సామాన్య ప్రజలు ఆలయపోషణ చేసినట్లు తెలుస్తోంది. ప్రతాపరుద్రుని కాలంలొ ఆలయ జీర్ణొద్దారణ జరిగినట్లు శిలాశాసనాలు చెబుతున్నాయి. ముస్లింల దండయాత్రల సమయం లొ నంది తల విరిగి పడింది దానిని ఇప్పుడు అతికించడం జరిగింది.

* కొప్పు లింగేశ్వరుడు

అక్కడి ప్రజల కథ ప్రకారం ఒకప్పుడు ఒక వెలనాటి పూజారి ఈ శివలింగారాధన శక్తి వంచన లేకుండా చేస్తూ ఉండెవాడు. కాని అ పూజారికి ఒక దురలవాటు ఉండేది. ఆయన కు ఒక వేశ్య తొ సంబంధం ఉండేది. ఆ పూజారి మీద ఆరాజ్యపు రాజు కి చాలా పిర్యాదులు అందుటూ ఉండేవి. ఇది గమనించి ఒక రోజు ఆరాజ్యపు రాజు స్వామి దర్శనానికి రాగా ఆ పూజారి స్వామి ప్రసాదాన్ని రాజు కు ఇస్తాడు. ఆ ప్రసాదం లొ ఒక వెంట్రుక కనిపిస్తుంది. రాజు ప్రశ్నించగా మా శివునకు జటాజూటం ఉన్నదని రాజు కి తెలిపుతాడు. రాజు పూజారిని జటాజుటం చూపించమనగా పూజారి ఆ రోజు స్వామి కి ప్రత్యేక అలంకారంలో ఉన్నారు కాబట్టి మరుసటి రోజు వచ్చి చూస్తే స్వామివారి జటాజూటం కన్పిస్తుంది అని ఆ పూజారి చెప్పగా ఆ రాజు ఆ రోజుకి నిష్క్రమించి తరువాత రోజు రావడానికి అంగీకరిస్తాడు. కాని శివవింగం మీద జాటాజుటం కనిపించకపోతే ఆ పుజారి తల తీయించి వేస్తాను అని చెప్తాడు.

ఆ రోజు రాత్రంతా శివలింగానికి పూజలు చేసి మహాదేవుడిని తనను కాపాడమని వేడుకోంటాడు. తరువాత రోజు రాజు దర్శనానికి వచ్చి చూస్తే శివలింగాన్ని చూస్తే జటాజూటం కనిపిస్తుంది. ఆఆరాజుకి ఆ జటాజుటం నిజమో కాదో అని సంశయం కలిగి జటాజుటాన్ని లాగి చుస్తాడు, శివ లింగం నుంచి నెత్తురు వస్తుంది, వెంటనే రాజుకు కంటి చూపు పోతుంది. అప్పుడు ఆ రాజు శివామహాదేవా అని వేడుకొనగా ఆరాజుకు కంటి చూపు వస్తుంది. ఆ రరాజు తన సామ్రాజ్యంలో జుటుగపాడు (ఇప్పటి రావులపాలెం మండలం లొని ఒక గ్రామం) అనే గ్రామాన్ని మాన్యంగా రాజు ప్రకటిస్తాడు. ఇప్పటికి కూడా శివలింగము కు జాటాజూటం ఉంది. అప్పటినుండి ఇప్పటివరకు ఈ పవిత్రక్షేత్రంలొ కొప్పులింగేశ్వరుడు గా పరమ శివుడు భక్తుల దర్శనం ఇచ్చి దర్శనం చేసుకొన్న వారిని మహాదేవుడు తరింపజేస్తున్నాడు. ఆంధ్రపదేశ్ పురావస్తుశాఖ ఈ గుడిలో ఉన్న రాజగోపురం, స్వామిమందిరం, కొన్ని స్తంభాలు పై ఉన్న శిల్పాలు ను పరిరక్షిస్తోంది.

* ఆలయము గురించిన విశేషాలు

ఈ ఆలయమును తూర్పున కౌసికి, దక్షిణమున సాంఖ్యాయని, పడమర వశిష్ఠ, ఉత్తరాన మాండవి మరియు పల్వల అను అంతర్వాహినిగా ఉన్న ఐదు నదులు చుట్టి ఉన్న ప్రదేశములో నిర్మించినట్లు చెబుతారు. ఈనాడు కూడా కౌసికి, వసిష్ఠలతో పాటు గర్భగుడిలో వర్షాకాలములో నీరు నిండుటచే పల్వలను కూడా చూడవచ్చును. ఇటీవల గర్భ్గగ్రుహమును గ్రానైటు రాయి పరచి బాగు చేశారు.

ఈ ఆలయము పలివెల మధ్యలో నాలుగెకరాల సువిశాల ప్రాంగణములో, ఒక దానిలో ఒకటి గా ఉన్న రెండు ఎత్తైన ప్రాకారాలతో, చుట్టూ వీధులతో రాజసంగా ఉంటుంది. ఈ ప్రాంగణములో ప్రధానాలయము, ఎన్నో మండపాలు, పరివార దేవతాలయాలు ఉన్నాయి. ఈ మండపాలలో చాళుక్యుల మరియు రెడ్డిరాజుల వాస్తు సాంప్రదాయాలను చూడవచ్చును. ఈ ప్రాంగణములోని మండపాలు అందలి శిల్పాలలో క్రీ.శ 10వ శతాబ్ధము నుండి క్రీ.శ 17వ శతాబ్ధము మధ్యకాల వాస్తు-శిల్ప పరిణామమును చూడవచ్చును.

ఈ ఆలయములో వివిధ శిల్పాలు కనువిందు చేస్తాయి. ఇవి వేంగి(తూర్పు)చాళుక్యుల మరియు రెడ్డిరాజుల కాలంనాటి శిల్పలక్షణాలు కలిగి ఉన్నాయి. గర్భగుడిలో ప్రతిష్టించబడిన లింగమునకు ముందువైపున అగ్రభాగములో చతురస్రాకారములో ఒక పొడుచుకువచ్చిన భాగము ఉంది. దీనినే కొప్పు అంటారు. ఇందువలననే ఈ స్వామి కొప్పులింగేశ్వరుడుగా ప్రసిద్ధిగాంచాడు. ఈయనకు ప్రక్కనే పార్వతీదేవి (ఉమాదేవి) ప్రతిష్టించబడి ఉంది. ఈమెకు ఉన్న ప్రభామండలమునకు రెండు వైపులా గణపతి మరియు కుమారస్వామి కూడా ఉన్నారు.

సాధారణంగా శైవాలయాలలోని గర్భగుడిలో ప్రధానంగా లింగము ఉండి, అమ్మవారు ఒక ప్రక్కగా ఉంటుంది, లేక ప్రత్యేకంగా ప్రతిష్టించబడి ఉంటుంది. ఇంక వినాయకుడు, కుమారస్వాములు వేరేగా పరివారదేవతాలయాలలో ఉంటారు. కానీ ఇక్కడ స్వామివారు మరియు అమ్మవారు ప్రక్క ప్రక్కనే ఒకే పీఠంపై ఉన్నట్లుగా ఉన్నారు. అందువలననే ఈ స్వామిని ఉమాకొప్పులింగేశ్వరుడు అంటారు. ఈవిధముగా ఆది దంపతులు సకుటుంబ సమేతంగా గర్భగుడిలోనే ఒకే పీఠంపై వేంచేసి దర్శనమివ్వడం ఇక్కడి విశేషం. ప్రాంగణములో వినాయకుడు, కుమారస్వామి, భైరవుడు, చండికేశ్వరస్వామి మరియు పాపవిమోచన స్వాములు ప్రత్యేకముగా ప్రతిష్టించబడి భక్తుల పూజలందుకుంటున్నారు.

వివిధ మండపాలపై ఉన్న శిల్పాలు అతి మనోహరంగానూ ఆలోచింపజేసీవిగానూ ఉన్నాయి. ఈ మొత్తము శిల్పసంపదను నాలుగు ప్రధాన వర్గాలుగా వర్గీకరించవచ్చును. అవి శైవము, వైష్ణవము, సాంఘీకము మరియు ఇతరములు. శైవములో శివ-పార్వతుల వివిధ రూపాలు-వృషభారూఢమూర్తి, లింగోధ్భవమూర్తి, నటరాజు, అర్ధనారీశ్వరుడు మొదలైన అనేకరూపాలేకాక పురాణగాథలైన కిరాతార్జునీయం, మృగవ్యధ మొదలగు గాథలు కూడా ఉన్నాయి. వైష్ణవ శిల్పాలలో కృష్ణుడు, లక్ష్మీదేవి ఇంకా రామాయణ గాధలు ఉన్నాయి.

సాంఘీకాలు మరియు ఇతరాలలో ఆనాటి జీవనవిధానాన్ని ప్రతిబింబించే ఎన్నో శిల్పాలు, నర్తకీమణులు, లతలు, జంతువులు మొదలైన శిల్పాలు ఉన్నాయి. మొత్తంగా ఈ ఆలయశిల్పం అత్యంత విలువైంది. ఈ శిల్పాలు వాతావరణ ప్రభావానికి, దాడులకు గురి అవడం వలన చాలా నష్టం వాటిల్లింది. ఇక్కడ ఒక విష్ణాలయము ఉండేదనడానికి ఆధారాలు కూడా ఉన్నాయి. ఆ ఆలయము ఇప్పుడు లేదు. అది కాలక్రమేణా శిధిలమైనా అయి ఉండాలి లేదా ఆలయవాస్తు-శిల్పానికి జరిగిన నష్టంలో ఇదీ ఒకటైనా అయి ఉండాలి. అదే కనుక అయితే ఈ ఆలయానికి అధిక శాతంలోనే నష్టం జరిగిందని చెప్పవచ్చును.

ఆలయానికి ఈ మధ్యకాలములో జరిగిన జీర్ణోద్ధరణ కార్యక్రమాల వలన పడిపోవడానికి సిధంగా ఉన్న కట్టడాలను గట్టిపరచడం, కొన్ని కొత్తకట్టడాలు చోటు చేసుకోవడంతో ఆలయము కొత్త శోభలను సంతరించుకుంది. ఇప్పుడు ఈ ఆలయము ఆధునికత అనే మేలిముసుగులో దాగిన అపురూపమైన పురాతనాలయము.

* పండుగలు, విశేషాలు

01. గణపతి నవరాత్రులు
02. దేవీ నవరాత్రులు
03. కార్తీక మాసం
04. సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం, సుబ్రహ్మణ్య షష్ఠి
05. ధనుర్మాసం
06. కొప్పు లింగేశ్వర స్వామి కళ్యాణం

Thursday, 21 January 2016

ARTICLE ABOUT THE GREAT TEMPLE YADHAGIRI GUTTA - INDIA


యాదగిరి గుట్ట-దేవాలయం

దేశంలోనే ఏకైక నరనారసింహ క్షేత్రం అహోబలం. ఆ తరువాత అంత ప్రాముఖ్యత ఉన్న క్షేత్రం యాదగిరిగుట్ట. ఎందుకంటే ఇది పంచనారసింహ క్షేత్రం.
సృష్టికి పూర్వం శ్రీమహావిష్ణువు నరసింహ రూపంలోనే బ్రహ్మకు దర్శనం ఇచ్చారట.
'ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలం తం సర్వతో ముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్ముత్యం నమాన్యహం'
అని మంత్రోపదేశం చేశారట. దీని వల్లే బ్రహ్మకు వేద దర్శనమై, ఆ తరువాత సృష్టి మొదలుపెట్టారట. అంతటి ప్రాముఖ్యం ఉన్న అవతారం నృసింహావతారం. అలాంటి నారసింహుడు వెలసిన పవిత్ర క్షేత్రం యాదగిరి.
స్థలపురాణం
యాదగిరి గుట్టకు సంబంధించిన కథకు మూలం వాల్మీకి రామాయణంలోని విభాండక ఋషి. అతడి పుత్రుడైన ఋష్యశృంగుడి కుమారుడు యాదరుషి. అతణ్ణే యాదర్షి అంటారు. చిన్నపట్నుంచి నరసింహుడి భక్తుడైన అతడికి ఆ స్వామిని దర్శించాలని బలమైన కోరిక ఉండేదట.
నరసింహుణ్ణి అన్వేషించడానికి అడవులూ, కొండలూ కోనలూ తిరిగాడు. నరసింహుని దర్శనం కాలేదు. అలా సంచరిస్తున్న యాదర్షి ఒకరోజు ఇప్పుడున్న యాదగిరి అరణ్య ప్రాంతానికి చేరుకుని అలసిపోయి ఒక రావిచెట్టు కింద పడుకున్నాడు. అప్పుడు కలలో ఆంజనేయస్వామి కనిపించి 'నీ పట్టుదల నాకు నచ్చింది. నీకు తోడుగా నేనుంటాను. కఠినంగా తపస్సు చేస్తే స్వామి తప్పక ప్రత్యక్షమవుతాడు' అని చెప్పారట. నిద్రలేచిన యాదర్షి అక్కడే తపస్సు మొదలుపెట్టాడు. కొన్నాళ్లకు ఉగ్రనారసింహుడు ప్రత్యక్షమయ్యారట. ఆ తేజస్సును చూడలేక శాంత స్వరూపంతో కనిపించమని కోరారట యాదర్షి. అప్పుడు లక్ష్మీసమేతుడై దర్శనమిచ్చి 'ఏం కావాలో కోరుకో' అని అడిగాడు స్వామి.
'నీ దర్శనం కోసం ఇంత ఘోర తపస్సు సామాన్యులు చేయలేరు. అందుకే నువ్వు శాంత రూపంతోనే ఇక్కడ కొలువై ఉండిపో' అని కోరారట. అప్పుడు కొండశిలమీద స్వామి ఆవిర్భవించాడు. కొన్నాళ్ల తరువాత యాదర్షికి మరో కోరిక కలిగింది. స్వామిని ఒకే రూపంలో చూశాను. వేర్వేరు రూపాల్లో చూడలేకపోయానే అనుకుని మళ్లీ ఈ ప్రాంతానికి వచ్చి తపస్సు మొదలుపెట్టాడు. కొన్నాళ్లకు స్వామి ప్రత్యక్షమైయ్యాడు.
'నా రూపాలన్నీ నువ్వు చూడలేవు' అయినా నీకోసం మూడు రూపాలు చూపిస్తాను అని జ్వాలా, యోగానంద, గండభేరుండ నారసింహ రూపాల్లో దర్శనమిచ్చారు. జ్వాలా నారసింహుడు సర్పరూపంలో ఉంటాడు. యోగానందుడు అర్చా విగ్రహరూపంలో ఉంటాడు. గండభేరుండ నారసింహుడు కొండ బిలంలో కొలువై ఉంటాడు. తరువాత యాదర్షి...తనను స్వామిలో ఐక్యం చేసుకోమని కోరడంతో అలాగే చేసుకున్నారట స్వామి. ఆ యాదర్షి పేరుమీదనే ఇది యాదగిరిగుట్ట అయింది.
దేవాలయ విశిష్ఠత
ఆ తరువాత దాని గురించి ఎవరికీ తెలియదు. యాదగిరి ప్రాంతమంతా సామాన్యులు చొరబడలేని ఆరణ్యప్రాంతం కావడంతో ఇటీవల వరకు అనగా 19వ శతాబ్దం వరకు స్వామికి నిత్యధూపదీప నైవేద్యాలు జరిగే అవకాశం లేకపోయింది. శ్రీకృష్ణదేవరాయలు దర్శించుకొని వెళ్లిన తర్వాత కూడా చాలా కాలం వరకు దుర్గమమై ఉన్నందున ఈక్షేత్రాన్ని ప్రజలు మరచిపోయే వరకు వచ్చింది. కాగా సుమారు రెండు వందల సంవత్సరాల క్రిందట ఒకరోజు రాత్రి ఈ ప్రాంత గ్రామాధికారికి స్వామి కలలో కనిపించి తాను ఈ ప్రాంతంలోనే నాలుగు రూపాల్లో ఉన్నానని గుర్తులు చెప్పారట. గ్రామాధికారి వెళ్ళి రేఖామాత్రంగా ఉన్న స్వామిరూపాలనూ, గుహనూ, ఆంజనేయుణ్ణీ కనుగొన్నారట. అప్పట్నుంచీ స్వామికి పూజాదికాలు మొదలయ్యాయి. ఈ వ్యవహారాలను పర్యవేక్షించేందుకు గుల్లపల్లి రామభట్టును నియమించారు. వారి సంతతి వారే వంశపరపరంగా ఈక్షేత్రాన్ని అంటి పెట్టుకొని సేవలు చేస్తున్నారు.
గర్భగుడిలో ఎదురుగా ఉండే స్వామి జ్వాలా నరసింహుడు. మరి కాస్త లోపలయోగముద్రలో యోగానందస్వామి. లక్ష్మీనరసింహ స్వాములను చూడొచ్చు.
గర్భాలయం నుంచి బయటకు వస్తే మెట్లకు ఎడమపక్కన క్షేత్రపాలకుడైన హనుమంతుడి గుడి ఉంది. హనుమంతుడి విగ్రహానికి కిందన ఉన్న పెద్ద రాతిచీలికలో గండభేరుండ నరసింహుని స్వయంభువు రూపం కనిపిస్తుంది. ఆంజనేయస్వామిని దర్శించుకున్నాక బయట ఎడమవైపున మెట్లు దిగితే పుష్కరిణి. కుడివైపు కొన్ని మెట్లు దిగితే పర్వతవర్థినీ సమేత రామలింగేశ్వరుని ఆలయం కనిపిస్తాయి.
ఈ క్షేత్రంలోని స్వామివారి పుష్కరిణికి కూడా ఓ ప్రత్యేకత ఉంది. దీనినే "విష్ణుకుండం" అని పిలుస్తుంటారు. యాదగిరి నరసింహస్వామి పాదాల వద్ద నుంచి నిరంతరం పెల్లుబుకుతూ వచ్చే నీరు ఈ పుష్కరిణిలో చేరుతుంటుంది. భక్తుల రాక యేటేటా పెరగడంతో ఈక్షేత్రం తెలంగాణ తిరుపతిగా వాసికెక్కింది. ఇదిలా ఉండగా హైదరబాద్‌ వాస్తవ్యుడైన రాజామోతీలాల్‌ యాదగిరి లక్ష్మీనర్సింహస్వామి వైభవం విని స్వామి వారిని దర్శించాడు. స్వామి వారికి ఆలయనిర్మాణం చేయించాడు. ప్రాకారం, గోపుర ద్వారం, ముఖమండపం నిర్మించాడు. ఆ తర్వాత భక్తులు తమ యాత్ర సందర్భాల్లో పలు సౌకర్యాలు ఏర్పరుచుతూ వచ్చారు. ప్రస్తుతం ఈక్షేత్ర యాజమాన్యం దేవాదయ శాఖ ఆధ్వర్యంలో ఉంది. యాదగిరిలక్ష్మీనర్సింహ క్షేత్రం జనాకర్షకమై భక్తుల కొంగుబంగారమై విరాజిల్లుతున్నది.
ఈ క్షేత్రంలో' ప్రదక్షిణల మొక్కు' ప్రధానమైనది. దీనివల్ల మానసిక, శారీరక, ఆర్థికబాధల నుంచి విముక్తి కలుగుతుందని భక్తుల నమ్మకం. మండలం (41 రోజులు), అర్థమడలం, 11 రోజుల ప్రదక్షిణల మొక్కులు మొక్కుకుంటారు భక్తులు. నిత్యం గర్భాలయానికి రెండుసార్లూ, ఆంజనేయస్వామికి 16 సార్లూ ప్రదక్షిణలు చేస్తారు. ఈ మొక్కు తీర్చుకునే దశలో స్వామి కలలోనే తమకు శత్ర చికిత్సలు చేసి, శారీరక బాధల నుంచి విముక్తి చేస్తారని నమ్ముతారు.
బ్రహ్మోత్సవాలు
సత్యనారాయణస్వామి వ్రతాలకు అన్నవరం తర్వాత అంత ప్రసిద్ధి చెందిన క్షేత్రం యాదగిరిగుట్ట. రోజులో నాలుగుసార్లు ఈ వ్రతాలు జరుగుతాయి.శ్రీ యాదగిరిగుట్ట వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రతీ ఏటా ఫాల్గుణశుద్ధ విదియ నుంచి మొదలై ద్వాదశి వరకు 11 రోజుల పాటు కన్నుల పండవగా కొనసాగుతాయి. ఈ బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని విశేష అలంకారాలు, సేవలు నిర్వహిస్తారు. 11 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలలో ఎదుర్కోళ్ళు, కళ్యాణం, రథోత్సవం ముఖ్యమైనవి. బ్రహ్మాత్సవాలలో భాగంగా స్వామి జగన్మోహిని , రామ, కృష్ణ, నరసింహ అవతరాలలో భక్తులకు దర్శనమిస్తారు. ఉదయం పూట అలంకారాలు, సాయంత్రం పూట సేవలు నిర్వహిస్తారు. బ్రహ్మాత్సవాలను పురస్కరించుకొని స్వామి వారికి కేశవాహాన సేవ, అన్నవాహాన సేవ, కల్పవృక్షం, గరుడసేవ, అశ్వవాహాన సేవలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ సేవల సందర్భంగా స్వామి అమ్మవారులను పట్టుపీతాంబరాలు, వివిధ బంగారు ఆభరణాలు, పూలతో శోభాయమానంగా అలంకరించి పుర వీధులలో ఊరేగిస్తారు. ఆధ్యాత్మిక భావన వెల్లివిరిసేందుకు 75 మంది రుత్వికులతో రామాయణం, మహాభారతం, భాగవతం, విష్ణుసహాస్రనామాలు, సుందరకాండ పారాయణాలు చేస్తారు.
మార్గం
యాదగిరి గుట్ట హైదరాబాద్‌ నుంచి 60 కి.మీ దూరంలో ఉంది. ఇక్కడికి చేరుకోవడానికి ఆర్టీసీ బస్సులున్నాయి. హైదరాబాద్‌ - వరంగల్‌ జాతియ రహదారిలో రామగిరిక్రాస్‌ రోడ్డు నుంచి రావొచ్చు. రైలుమార్గంలో భవనగిరి, రాయగిరి, ఆలేరు రైల్వేషేషన్లలో దిగి స్వామి సన్నిధికి చేరుకోవచ్చు. ఈ క్షేత్రాన్ని దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్‌ నుంచి సరికొత్తగా 'యాదగిరి రోడ్డు' పేరిట 8 లైన్ల రహదారి నిర్మాణపనులు చేపట్టారు.
వసతి విషయానికి వస్తే...ఆలయాన్ని ఆనుకునే అనేక వందల గదులు గల ఎన్నో సత్రాలు ఉంటాయి. ఇందులో కొన్ని ఉచితంగా ఇచ్చే గదులు కూడా ఉంటాయి. అద్దె గదులు వం7ద రూపాయలలోపు దొరుకుతుంటాయి. ఇక భోజన సౌకర్యం కోసం ఈ ప్రాంతంలోనే భక్తులను, పర్యాటకులను ఆకర్షించే విధంగా పలు రకాల హోటళ్లు ఉన్నాయి.
నమో లక్ష్మీ నారసింహయా నమ

ARTICLE IN TELUGU ABOUT HITSORICAL PLACE THIRUVAIYARU IN INDIA



    Thiruvaiyaru
    Town in India
    Thiruvaiyaru is a panchayat town in Thanjavur District in the Indian state of Tamil Nadu. Thiruvaiyaru is situated on the banks of the river Kaveri, 13 km from Thanjavur. Thiruvaaiyaru has an old Siva temple dedicated to Panchanatheeswar.Wikipedia
    Getting there10 h 10 min flight. View flights
    Weather25°C, Wind NE at 11 km/h, 79% Humidity
    Population14,535 (2001)
    Local timeThursday 10:33 PM

Tuesday, 19 January 2016

Saturday, 31 October 2015

THREE EYES HANUMAN TEMPLE - THRINETRA DASA BHUJA VEERANJANEYA SWAMY TEMPLE AT ANANDHA MANGALAM - NAGAPATNAM DISTRICT - TAMILNADU - INDIA


మూడు కన్నుల హనుమంతుని మున్నెన్నడైనా చూసారా
హనుమంతుడు … ఈ పేరు వినగానే మనకు వానర రూపంలో ఉండే ఆంజనేయస్వామి గుర్తుకు వస్తాడు. అంతే కాదు భక్తికి మారుపేరుగా, బ్రహ్మచర్యానికి ప్రతీకగా కూడా ఆంజనేయుడు కీర్తికెక్కాడు. హనుమంతుడు సాధారణంగా చేతిలో సంజీవని పర్వతంతోనో, లేదా రాముని పాదాల వద్దో మనకు కనిపిస్తాడు. అయితే పదిభుజాలు, మూడు కళ్లు కలిగిన ఆంజనేయుడిని తెలుసుకున్నారా ?
అయితే ఆ రూపాన్ని చూసేందుకు తమిళనాడు రాష్ట్రం, నాగపట్నం జిల్లాలోని ఆనందమంగళం పట్టణంలో ఉన్న త్రినేత్ర దశభుజ వీరాంజనేయ ఆలయానికి వెళ్లాల్సిందే. ఈ ఆలయంలో పది భుజాలు, నుదురుపై మూడో కన్ను కలిగిన ఆంజనేయుడు భక్తుల పూజలందుకుంటున్నాడు. త్రేతాయుగంలో విష్ణుమూర్తి రామావతారమెత్తి రావణుడిని సంహరించిన పిమ్మట నారదుడు ఆయనను కలుసుకున్నాడు.
“స్వామి లంక నాశనముతో మీ యుద్ధము పూర్తికాలేదు. రావణుని వారసులు ఉన్నారు. తండ్రి మృతిపై ప్రతీకారం తీర్చుకునేందుకు వారు తప్పకుండా మీపై యుద్ధానికి వస్తారు. వారు ప్రస్తుతం సముద్ర అడుగు భాగంలో తపస్సు చేస్తున్నారు. వారి తపస్సు పూర్తి కాకముందే మీరు వారిని సంహరించాల”ని వేడుకున్నాడు.
అప్పుడు రాముడు “నారదా ! రామావతారంలో నా కర్తవ్యం పూర్తయినది. మరికొన్ని రోజుల్లో ఈ అవతారాన్ని చాలించనున్నాను. ఇందుకు ఇంకెవరినైనా ఎంపిక చేయుమ”ని అన్నాడు. , రాక్షస వధకు హనుమంతుడిని పంపించాలని అందరూ నిర్ణయించారు.
యుద్ధంలో సహాయంగా ఉండేందుకు విష్ణు మూర్తి తన శంఖు, చక్రాలను హనుమంతుడికి ప్రసాదించారు. బ్రహ్మదేవుడు తన కమండలాన్ని, పరమ శివుడు తన మూడో కంటిని ఆంజనేయుడికి ఇచ్చారు .. ఇలా వివిధ దేవతల నుంచి పది ఆయుధాలు పొందిన అంజనీపుత్రుడు దశభుజుడయ్యాడు.విశిష్ఠంగా కైలాసనాధుని నుంచి మూడో కన్ను పొందడంతో ముక్కంటిగా మారాడు.
వానర శ్రేష్టుడు రాక్షస వధ పూర్తిచేసి విజయంతో తిరిగి వచ్చాడు. ఈ రూపంలో ఆయన రాక్షసులను అంతమొందించి అక్కడ వెలిసినందున ఆ ప్రాంతంలో ఆలయాన్ని నిర్మించి భక్తులు పూజిస్తున్నారు. రాక్షస వధతో హనుమంతుడు ఆనందంగా ఉన్నందున ఆ ప్రాంతానికి ఆనందమంగళమ్ అనే పేరు స్థిరపడిందని భక్తులు చెబుతుంటారు.

Monday, 21 September 2015

Brief Article about Rama Dhanuvu - Ramanarayanam-Srimadramayana Pranganam, Vizianagaram, Andhra Pradesh. India


This is in Vizianagaram, Andhra Pradesh, India
Ramanarayanam-Srimadramayana Pranganam, Vizianagaram, Andhra Pradesh.

The structure was built in the shape of ‘Rama Dhanuvu’
‘Ramanarayanam’, an aesthetic and spiritual project. The facility spreading over 15 acres would certainly be a visual treat for the young and old alike.
The structure was built in the shape of ‘Rama Dhanuvu’ (the sign Sagittarius in the zodiac) has two floors with Sri Maha Vishnu temple on the one and Sri Rama temple on the other. Linking both the temples in the shape of a bow is the ‘Pranava Margam’ that bears all-important ‘khandaas’ of Saint Valmiki’s Srimadhramayana in visual forms.
With Lord Vigneswara temple at the entrance, the path in the shape of an arrow leads to the complex that has colour fountains. At the tip of the arrow, a 60-feet-high Hanuman statue has been installed which is visible even from a distance of 1km. In foreground of the two-floor complex, Sri Lakshmi and Sri Gnana Sarswati idols have been installed.

Friday, 11 September 2015

Monday, 10 August 2015