Search This Blog

Chodavaramnet Followers

Showing posts with label Vitamin-D Health Tips. Show all posts
Showing posts with label Vitamin-D Health Tips. Show all posts

Friday, 9 September 2016

HOW TO GET VITAMIN-D FROM SUN AND MORE VITAMINS HEALTH TIPS IN TELUGU


ఏసీల కింద కూర్చుని గంటల తరబడి కంప్యూటర్లను కంటి చూస్తూ రోజంతా గడిపేసేవారి సంఖ్య రోజు రోజుకీ పెచ్చరిల్లిపోతోంది. శారీరక శ్రమ లేని పనులు చేస్తూ చాలామంది అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. ఒబిసిటీ కారణంగా అనారోగ్య సమస్యలను కొనితెచ్చుకుంటున్నారు. ఇలా కంప్యూటర్ల ముందే అతుక్కుపోతున్న వారు రోజూ ఓ అరగంట ఎండలో నిలబడితే చాలు.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినవారవుతామని న్యూట్రీషన్లు అంటున్నారు. 

రోజూ కాసేపు ఎండలో ఉంటే శరీరానికి డి విటమిన్ అనే పోషకం చేరుతుంది. ఇక, కొవ్వులేని పాలతో చేసిన పదార్థాల ద్వారానూ ఈ విటమిన్‌ అందుతుంది. విటమిన్ డి ద్వారా ఎముకలు దృఢంగా మారతాయి. చర్మానికీ మేలు జరుగుతుంది.

ఇక రోజూ కేవలం గ్లాసుడు పాలు తాగడం ద్వారా శరీరానికి సరిపడే క్యాల్షియం అందకపోవచ్చు. అందుచేత ఇతర డైరీ ఉత్పత్తులు చేర్చుకోవాలి. అలాగే టోఫు, చేపలూ..లాంటివాటి నుంచి ఆ పోషకాన్ని అందుకోవచ్చు. ఇలా తీసుకోవడం వల్ల గుండె, కండరాలకు చాలా మంచిది. ఒమెగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఇది అధికరక్తపోటును కూడా అదుపులో ఉంచుతుంది. మంచి కొలెస్ట్రాల్‌ని పెంచుతుంది.

ఆలివ్‌నూనె, వాల్‌నట్లు, బాదం లాంటివీ తీసుకోవాలి. ఇంకా విటమిన్‌ బి12 పోషకం లోపం ఉన్నప్పుడు వయసురీత్యా సమస్యలు పెరుగుతాయి. చేపలు, మాంసం, గుడ్లు, చికెన్, పాలు వంటి పదార్థాల్లో ఈ పోషకం ఎక్కువగా కనిపిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

Tuesday, 16 December 2014

VITAMIN-D HEALTH TIPS IN TELUGU - VITAMIN-D DEFICIENCY PROBLEMS AND REMEDIES



విటమిన్‌ డి లోపంతో మానసిక సమస్య

విటమిన్‌ డి లోపించిందో ఒత్తిడి తప్పదంటున్నారు పరిశోధకులు. ప్రధానంగా సూర్యరశ్మి ద్వారా లభించే డి విటమిన్‌ లోపిస్తే మానసిక ఒత్తిడి ఖాయమని ఈ తాజా అధ్యయనంలో తేలింది.
అమెరికాలోని యూని వర్శిటీ ఆఫ్‌ జార్జియా నిర్వహించిన సర్వేలో సీజనల్‌ డిప్రెషన్‌కు (సీజనల్‌ అఫెక్టివ్‌ డిజార్డర్‌ - ఎస్‌.ఎ.డి) కారణం సూర్యరశ్మేనని తేలింది. ఆధునిక జీవనశైలిలో ఎప్పుడూ ఏసీ రూముల్లో ఉండటం, సూర్యరశ్మికి దూరంగా ఉండే ఐటీ హబ్‌లు, కంపూటర్ల ముందు కూర్చునే ఉద్యోగాలు చేయడం... ఇలాంటి వాటివల్ల ఒత్తిడి పెరిగిపోతుంది. ఈ స్థితే మానసిక ఒత్తిడికి దారి తీస్తుందని పరిశోధకులు తేల్చారు. కాబట్టి విటమిన్‌ డి అనేది మానసిక ఆరోగ్యానికి చాలా అవసరమని పరిశోధకులు చెబుతున్నారు. కాబట్టి, ప్రతి రోజు కొన్ని నిమిషాల పాటు సూర్యోదయం లేదా సూర్యాస్తయం సమయంలో ఆరుబయట సూర్యరశ్మిలో తిరగడం వల్ల విటమిన్‌ డి శరీరానికి అందుతుంది. తద్వారా మానసిక ఒత్తిడిని దూరం చేసుకోవచ్చునని పరిశోధకులు సూచిస్తున్నారు.