Search This Blog

Chodavaramnet Followers

Tuesday, 26 February 2013

TELUGU FESTIVAL RECIPES - SPECIAL GARELU - SPECIAL BURELU


బొబ్బర్లతో

కూటు
కావలసిన పదార్థాలు: బొబ్బర్లు - 1 కప్పు, చింతపండు గుజ్జు - అరకప్పు, నూనె - 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు - 1 టీ స్పూను, అల్లం వెల్లుల్లి పేస్టు - 1 టీ స్పూను, ఉప్పు - రుచికి తగినంత. పేస్టు కోసం: ఉల్లిపాయ - 1, ఎండు మిర్చి - 3, పచ్చికొబ్బరి తురుము - 1 కప్పు. పొడికోసం: (వేగించిన) మెంతులు - 1 టీ స్పూను, గసగసాలు, మినప్పప్పు, శనగపప్పు, నువ్వులు - 1 టేబుల్ స్పూను చొప్పున, పల్లీలు - 2 టేబుల్ స్పూన్లు.
తయారుచేసే విధానం:3 కప్పుల నీటిలో బొబ్బర్లని ఉడికించి నీరు వడకట్టి పక్కనుంచాలి. అరకప్పు నీటిలో పొడి, చింతపండు గుజ్జు కలపాలి. నూనెలో ఆవాలు వేగాక, అల్లం వెల్లుల్లి, ఉల్లిపేస్టు పచ్చివాసన పోయేదాక వేగించి, చింతపండు మిశ్రమం కలిపి, కొద్ది నీరు పోసి మూతపెట్టి 5 నిమిషాలు ఉడికించాలి. తగినంత ఉప్పు, పసుపు కలపాలి. చివర్లో ఉడికించిన బొబ్బర్లు వేసి 6 నిమిషాల తర్వాత దించేముందు అర టీ స్పూను నెయ్యి కలపాలి. వేడి వేడి అన్నంతో చాలా రుచిగా ఉంటుంది.

బచ్చలితో గారెలు
కావలసిన పదార్థాలు: బొబ్బర్లు - 1 కప్పు, బచ్చలి కూర 1 కప్పు, జీలకర్ర - అర టీ స్పూను, బియ్యప్పిండి - 3 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి - 4, చిన్న ఉల్లిపాయ - 1, అల్లం - అంగుళం ముక్క, కొత్తిమీర తరుగు - అరకప్పు, కరివేపాకు - 4 రెబ్బల తరుగు, ఉప్పు - రుచికి తగినంత, నూనె - సరిపడా.
తయారుచేసే విధానం:బొబ్బర్లను 5 గంటలు నానబెట్టి నీళ్లు పోయకుండా, మరీ మెత్తగా కాకుండా కచ్చాపచ్చాగా రుబ్బుకోవాలి. ఈ ముద్దలో సన్నగా తరిగిన బచ్చలి, పచ్చిమిర్చి, అల్లం, ఉల్లి, జీర, కొత్తిమీర వేసి చిన్న చిన్న ఉండలుగా చేసుకుని, కాగిన నూనెలో గారెల్లా వేసి మంట బాగా తగ్గించి నిదానంగా లోపల కూడా ఉడికేలా దోరగా వేగించుకోవాలి.

తీపి బూరెలు
కావలసిన పదార్థాలు: బొబ్బర్లు - 1 కప్పు, పచ్చి కొబ్బరి తురుము - 1 కప్పు, బెల్లం/పంచదార - 1 కప్పు, యాలకుల పొడి - 1 టీ స్పూను, నూనె - వేగించడానికి సరిపడా, మైదా - పావుకేజీ, ఉప్పు - రుచికి తగినంత.
గ్రేవీ కోసం : గంటసేపు నానబెట్టిన బొబ్బర్లను కుక్కర్లో 5 నిమిషాలు ఉడికించి, నీరు వడకట్టాలి. బొబ్బర్లలో కొబ్బరి తురుము, యాలకుల పొడి, బెల్లం తరుము/ పంచదార వేసి చేత్తో ముద్దలా కలిపి, నిమ్మకాయంత ఉండలు చేసుకోవాలి. ఉప్పు వేసిన మైదాను నీటితో జారుగా కలిపి, ఉండలు ముంచి నూనెలో దోరగా వేగించుకోవాలి.