కావలసినవి
బంగాళాదుంపలు-6
కంద-ఒకటిన్నర కిలో
శాండ్‌విచ్ రొట్టె స్లయిసులు-6
ఉడికించిన క్యారెట్ ముక్కలు-ఒక కప్పు
ఫ్రెంచ్ బీన్స్ ముక్కలు-ఒక కప్పు
ఉడికించిన పచ్చి బఠానీలు- ఒక కప్పు
ఆరెంజ్ ఫుడ్‌కలర్-ఒక టీస్పూన్
కారం-ఒక టీస్పూన్
గరంమసాలా- ఒక టీ స్పూన్
అల్లం వెల్లుల్లి ముద్ద- ఒక టేబుల్ స్పూన్
పచ్చిమిర్చి ముద్ద-ఒక టేబుల్ స్పూన్
కొత్తిమీర- ఒక స్పూన్
తయారుచేసే విధానం
బంగాళా దుంపలను ఉడికించి, వొలిచి నలిపి ముద్ద చేసుకోండి. కందపై చెక్కుతీసి, చిన్నముక్కలుగా చేసి, ఉడికించి దానిని కూడా ముద్దగా చేసుకోండి. రొట్టెముక్కలు కొంచెం నీటితో తడపండి. కంద, బంగాళాదుంపల మిశ్రమంలో రొట్టె ముక్కలు వేసి బాగా పిసకండి. ఉడికించిన క్యారెట్ ముక్కలు, ఫ్రెంచ్‌బీన్స్, బఠానీలను కూడా ఒకసారి కలిపి ముద్ద చేసి పై మిశ్రమాన్ని చేర్చండి. కారం, గరంమసాలా, ఉప్పు చేర్చి కలపండి. చివరగా నూరిన మసాలా ముద్దలను ఆరెంజి రంగును చేర్చి బాగా కలపండి. శేఖ్ కబాబ్‌ల ఆకారంలో (లేదా మీకిష్టమైన ఆకారంలో) ఈ మిశ్రమాన్ని విభజించి తయారుచేసుకుని, నూనె లేదా డాల్డాలో ఎర్రగా వేయించి తీయండి. రొట్టెముక్కలు, గ్రీన్ చట్నీల కలయికతో ఈ కబాబ్‌లు సర్వ్ చేయండి.