Search This Blog

Chodavaramnet Followers

Tuesday 19 April 2016

SRI SANKARACHARYA TEMPLE - SRINAGAR - INDIA


శంకరాచార్య దేవాలయం, శ్రీ నగర్!
.
శంకరాచార్య దేవాలయం తఖ్త్- ఎ-సులేమాన్ అని కూడా పిలవబడే 
శంకరాచార్య కొండ మీద శ్రీనగర్ నగర ఉపరితలానికి 1100 అడుగుల ఎత్తులో ఉంది. ఈ ఆలయం హిందూ మతానుసారం లయకారి అయిన శివుని కి అంకితం చేయబడింది.

ఇది కాశ్మీర్ లోయలో పురాతన ఆలయాలు ఒకటి.
దీన్ని క్రీ.పూ 371 లో నిర్మించిన రాజా గోపాదత్య పేరునే ఆలయానికి పెట్టారు.
ఆది శంకరాచార్య తన కాశ్మీర్ పర్యటనలో భాగంగా ఇక్కడ బస చేసిన తర్వాత ఆలయం పేరుని గోపదారి నుండి శంకరాచార్య దేవాలయం గా మార్చారు.
తరువాత దోగ్రా పాలకుడు, మహారాజా గులాబ్ సింగ్, భక్తుల సౌలభ్యం కోసం ఆలయానికి రాతి మెట్లు కట్టించాడు
. ఆలయ విద్యుద్దీకరణ 1925 లో జరిగింది. హిందువులకు ఒక ముఖ్యమైన
మత కేంద్రంగా మాత్రమే గాక, ఈ ఆలయం గొప్ప పురావస్తు విలువ
కూడా కలిగి ఉంది.