Search This Blog

Chodavaramnet Followers

Saturday, 13 August 2016

GUDDU BANGALADUMPA MASALA TELUGU RECIPE - EGG POTATO MASALA RECIPE


గుడ్డు, బంగాళాదుంప మసాలా

కావల్సినవి:
ఉడికించిన గుడ్లు - ఐదు, బంగాళాదుంప, ఉల్లిపాయ - పెద్దవి ఒక్కోటి చొప్పున, పచ్చిమిర్చి - ఐదు, అల్లం, వెల్లుల్లి ముద్ద - ఒకటిన్నర చెంచా, ధనియాలపొడి - రెండు చెంచాలు, పసుపు - పావుచెంచా, సోంపు పొడి - అరచెంచా, గరంమసాలా - చిటికెడు, చిక్కని కొబ్బరిపాలు - రెండు కప్పులు, జీడిపప్పు ముద్ద - టేబుల్‌స్పూను, ఉప్పు - తగినంత, నూనె - పావుకప్పు.

తయారీ:
బాణలిని పొయ్యిమీద పెట్టి నూనె వేడిచేసి ఉల్లిపాయ ముక్కలూ, తగినంత ఉప్పూ వేయాలి. అవి ఎర్రగా వేగాక నిలువుగా తరిగిన పచ్చిమిర్చి, అల్లంవెల్లుల్లి ముద్ద వేసి వేయించాలి. రెండు నిమిషాల తరవాత గరంమసాలా, ధనియాలపొడీ, పసుపూ, సోంపుపొడీ, జీడిపప్పు ముద్దా, ఉడికించిన బంగాళాదుంప ముక్కలూ, చిక్కని కొబ్బరిపాలూ వేసేయాలి. కాసేపటికి కొబ్బరిపాలు ఉడుకుతాయి. అప్పుడు మంట తగ్గించి ఉడికించి పెట్టుకున్న గుడ్లను మధ్యకు కోసి అందులో వేయాలి. ఇది గ్రేవీలా తయారయ్యాక దింపేయాలి.