Search This Blog

Chodavaramnet Followers

Saturday, 13 August 2016

ANDHRA KODI KURA - ANDHRA CHICKEN TELUGU RECIPE


ఆంధ్రా కోడి కూర

కావలసినవి:
చికెన్‌: అరకిలో, అల్లంవెల్లుల్లి: 5 టీస్పూన్లు, కారం: 5 టీస్పూన్లు, ఉప్పు: తగినంత, నూనె: 4 టేబుల్‌స్పూన్లు, ఉల్లిముక్కలు: 2 కప్పులు, టొమాటో గుజ్జు: కప్పు, పచ్చిమిర్చి: నాలుగు, కరివేపాకు: 2 రెబ్బలు, దనియాలపొడి: 2 టీస్పూన్లు, మిరియాలపొడి: అరటీస్పూను, కొత్తిమీర తురుము: 2 టేబుల్‌స్పూన్లు మసాలాకోసం: జీలకర్ర: టీస్పూను, సోంపు: అరటీస్పూను, లవంగాలు: 4, యాలకులు: రెండు, దాల్చినచెక్క: అంగుళంముక్క, గసగసాలు: టేబుల్‌స్పూను.

తయారుచేసే విధానం:
చికెన్‌ ముక్కల్ని బాగా కడిగి 4 టీస్పూన్ల కారం, 4 టీస్పూన్ల అల్లంవెల్లుల్లి, తగినంత ఉప్పు పట్టించి అరగంటసేపు నాననివ్వాలి. పచ్చిమిర్చిని కూడా సన్నగా తరగాలి. బాణలిలో మసాలా కోసం తీసుకున్నవన్నీ వేయించి చల్లారాక పొడి చేసి ఉంచాలి. బాణలిలో నూనె వేసి కాగాక ఉల్లిముక్కలు, పచ్చిమిర్చిముక్కలు, కరివేపాకు, మిగిలిన అల్లంవెల్లుల్లి వేసి వేయించాలి. తరవాత చికెన్‌ ముక్కలు, గరంమసాలా, మిగిలిన కారం, దనియాల పొడి వేసి బాగా కలపాలి. నాలుగైదు నిమిషాలు ఉడికిన తరవాత టొమాటో గుజ్జు వేసి నూనె తేలేవరకూ ఉడికించాలి. ఇప్పుడు సుమారు ఓ కప్పు నీళ్లు పోసి తగినంత ఉప్పు, మిరియాల పొడి వేసి మరికాసేపు ఉడికించి కొత్తిమీర తురుము జల్లి దించాలి.