Search This Blog

Chodavaramnet Followers

Saturday, 13 August 2016

KRISHNA PUSHKARALU 2016 TELUGU BHAKTHI / DEVOTIONAL ARTICLES COLLECTION


గంగానది పాపాన్ని పోగొట్టిన నది 

కృష్ణానది అత్యంత పవిత్రమైనదనీ ఈ నదిని తలచినా, చూసినా, స్నానం చేసినా సకలపాపాలు నశించి ముక్తి లభిస్తుందని పరాశర మహర్షి పేర్కొన్నారు. సరస్వతీ నదిలో మూడు రోజులు, యమునా నదిలో ఐదు రోజులు, గంగానదిలో ఒక్కసారి స్నానమాచరిస్తే ముక్తి లభిస్తుందనీ, అయితే కృష్ణానదిని స్మరిస్తేనే ముక్తి కలుగుతుందని కృష్ణామహాత్మ్యంలో చెప్పబడింది.
అటువంటి కృష్ణానది గంగానదికి సోకినా పాపాన్నే పోగొట్టినట్లు కృష్ణామహాత్మ్యంలో చెప్పబడింది. అందుకు సంబంధించిన గాథ ఒకటి ప్రచారంలో ఉంది.

పూర్వం గంగానదీతీరంలో ఒక స్త్రీ ఉండేది.
జీవనం కోసం వ్యభిచారం చేస్తూ ఉండేది. ప్రతిరోజూ రాత్రిపూట గంగాతీరంలో వ్యభిచారం చేసేది. తెల్లవారుతూనే గంగానదిలో స్నానం చేసి తనకు సోకిన పాపాన్ని తొలగించుకుంటూ వుండేది. అందువల్ల గంగానదికి పాపం లభించింది. పాపాన్ని పోగొట్టుకొనేందుకు అనేకరకాలైన ఆలోచనలు చేసిన గంగానది చివరకు కాకి రూపాన్ని ధరించి కృష్ణానదికి వచ్చి అందులో స్నానమాచరించి తన మలినాన్ని పోగొట్టుకొని హంసరూపంలో తిరిగి వెళ్ళేది. ఈవిధంగా గంగానది ప్రతిరోజూ చేస్తూ ఉండేది. ఇలా గంగానదికి సోకినా పాపాన్నే పోగొట్టిన పవిత్రనది ‘కృష్ణానది’.
అట్టి కృష్ణానదిలో స్నానమాచరించడమే కాదు కృష్ణ కృష్ణ అని స్మరించినా చాలు ముక్తి లభిస్తుంది.

అంబత్వద్దర్శనాన్ముక్తిః నజానే స్నానజం ఫలం
స్వర్గారోహణ సోపానాం మహాపుణ్య తరంగిణీం
అధికాం సర్వతీర్థానాం కృష్ణవేణీం నమామ్యహం!!