Search This Blog

Chodavaramnet Followers

Wednesday, 20 July 2016

Vinjamuri Venkata Apparao TELUGU JOKES COLLECTION

కేకలు
'ఏమిటయ్యా కాంతయ్య .....నువ్వు సినిమాకి వెళ్లి వచ్చినప్పుడల్లా మీ ఆవిడ అలా కేకలేస్తుంది .
ఏమి అంటుంది ఏమిటి ?
'నేను సినిమాకి వెళ్తున్నది చాలదా ? మీరు కూడా వెళ్లి ఎందుకు అలా డబ్బు తగలేస్తారు 'అని కేకలేస్తుంది .

మారి పంకజం
జడ్జి : ఇదేమిటండి ! కుమారి పంకజం అని పిలిస్తే బోనులోకి ముసలమ్మ వచ్చి నిలబడింది ఏమిటి ?
ప్లీడర్ : ౩౦ సంవత్సరాల క్రితం ఈ కేసు మొదలయినప్పుడు ఆమె కుమారి పంకజమే సార్ !

చిరునామా
రామ్మోహన్ : ఇప్పుడు నేను ఇక్కడ ఉన్న ఉత్తరాన్నిపోస్ట్ చేస్తే రెండు రోజుల్లో ఢిల్లీ చేరుతుందా లేదా ?
పోస్ట్ మాస్టర్ : తప్పకుండా చేరుతుంది
రామ్మోహన్ : ఎటువంటి పరిస్థితుల్లో ఇది వెళ్ళదు.కావాలంటే పందెం .
పోస్ట్ మాస్టర్ : అదెలా ! ఎందుకు వెళ్ళదు ?
రామ్మోహన్ : దీని మీద ముంబై చిరునామా వుంది గా
హిహిహిహి .......
పోస్ట్ మాస్టర్ : ఇప్పుడు ఈ కర్ర తీసుకొని నీ వీపు పగలకొడితే నీ వీపు పగులుతుందా లేదా ?
రామమోహన్ : ఖచ్చితంగా పగులుతుంది
పోస్ట్ మాస్టర్ : కాని పగలదు పందెం
రామ్మోహన్ : ఆ ఆ ఆ .....?????? వద్దులే .

గొడ్లచావిడి
ఓనర్ : నీవు వంటపని గొప్పగా చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది . ఇక్కడకు రాకముందు ఎక్కడ పని చేసేవాడివి ?
వంటవాడు : గొడ్లచావిడి లో మేత వాడిగా

ఇద్దరు
రాజు సన్నటి మార్గం గుండా నడుస్తున్నాడు , అతనికి వెంగళరావు ఎదురు వచ్చాడు
వెంగళరావు : స్టుపిడ్స్ కి నేను దారి ఇవ్వను , తప్పుకో
రాజు : కాని నేను ఇస్తాను , వెళ్ళు .

JOKES COLLECTED BY
SRI Vinjamuri Venkata Apparao