Search This Blog

Chodavaramnet Followers

Wednesday, 20 July 2016

OKKA KSHANAM AND MORE TELUGU JOKES COLLECTION BY SRI VINJAMURI VENKATA APPA RAO GARU

దేవుడు చూస్తున్నాడు
నిత్యానంద యోగ సభ వారు కొత్తగా చేరిన యువ సన్యాసులకు శిక్షణా శిబిరం నిర్వహిస్తున్నారు.
మధ్యాహ్నం వారందరికీ ఒక పెద్ద మర్రిచెట్టు కింద భోజనాల ఏర్పాటు .యువ సన్యాసులందరూ
ఒకరి వెనుక ఒకరు నెమ్మదిగా కదులుతూ అక్కడ ఉన్న పండ్లు, పచ్చి కూరలు,కందమూలాలు
తీసుకొని తింటున్నారు. మామిడి పళ్ళ బుట్ట దగ్గర ఇలా రాసి ఉంది
" ఒక్కరికి ఒక మామిడి పండు మాత్రమే,దేవుడు చూస్తున్నాడు ".
అది చూసి సదానందుడు, భోగానందునితో
" మిత్రమా ! ఆపిల్ పళ్ళు చెరో పది అందుకో.మామిడి పళ్ళు మాత్రం రెండే తీసుకో.
దేవుడు వాటినే చూస్తున్నాడు "

ఒక్క క్షణం
భక్తుడు : వెయ్యి కోట్లు మీకు ఎంతతో సమానం దేవా ?
దేవుడు : ఒక్క పైసా .
భక్తుడు : కోటి సంవత్సరాలు ఎంతతో సమానం ?
దేవుడు : కేవలం ఒక్క క్షణం
భక్తుడు : ఐతే నాకు ఒక పైసా ధానం చెయ్యండి స్వామి .
దేవుడు : 'ఒక్క క్షణం ' ఆగు భక్తా ఇస్తాను .

భోధకుడిని
రామం : పెళ్లికి ముందు నువ్వు ఏమి చేసేవాడివి ?
కవి : భోధకుడిని
రామం : మరి ఇప్పుడు ఏమి చేస్తున్నావు ?
కవి : విద్యార్థిగా ఉన్నా
రామం : అదేంటి ?
కవి : బోదించే విషయాలు అన్నీ మా ఆవిడ చూసుకుంటుంది .వినేవన్నీ నేను చూసుకుంటున్నాను .