Search This Blog

Chodavaramnet Followers

Wednesday, 10 February 2016

FISH FOOD 2 PREGNANT WOMEN GIVES INTELLIGENT HEALTHY CHILDREN


కాబోయే తల్లులు చేపలను తింటే.. తెలివైన పిల్లలు! 

గర్భవతులు వారానికి ఒకసారైనా చేపలను తింటే వారికి పుట్టే పిల్లలు తెలివైనవాళ్లుగా ఉంటారని ఒక అధ్యయనం వెల్లడిస్తోంది. స్పెయిన్‌లోని ‘పర్యావరణ సాంక్రమిక వ్యాధుల పరిశోధన సంస్థ’కు చెందిన జోర్డిజుల్వెజ్‌ నేతృత్వంలో ఈ అధ్యయనం జరిగింది. దీంట్లోభాగంగా 2,000 మంది తల్లులు, వారి పిల్లలను పరిశీలించారు. గర్భం దాల్చిన మూడోనెల నుంచి వారికి పుట్టిన పిల్లలకు ఐదేళ్ల వయసు వచ్చేవరకూ వీరి అధ్యయనం కొనసాగింది. సగటున వారానికి ఒకసారి చేపలను తీసుకున్న తల్లులకు పుట్టిన పిల్లల తెలివితేటలు (ఐక్యూ).. అంత తరచుగా చేపలను తీసుకోని తల్లులకు జన్మించిన పిల్లలకన్నా 2.8 శాతం ఎక్కువ ఉందని వీరు గుర్తించారు. ట్యూనా, టైల్‌ వంటి చేపల్లో పాదరసం మోతాదు ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటిని గర్భవతులు తినవద్దనే అభిప్రాయం నెలకొనిఉందని, కానీ దీంట్లో వాస్తవం లేదని జుల్వెజ్‌ తెలిపారు. వాస్తవానికి ఈ చేపలను తినటం వల్ల పుట్టబోయే పిల్లలకు ఆరోగ్యపరంగా ఎంతో మేలుజరుగుతున్నట్లు తెలిసిందన్నారు. ఈ పిల్లల్లో ఆటిజం వచ్చే ప్రమాదం కూడా తక్కువగా ఉంటుందని వెల్లడించారు.