Search This Blog

Chodavaramnet Followers

Wednesday, 10 February 2016

BANANA PROTECTS FROM SKIN CANCER EXPERTS ANALYSIS


చర్మ క్యాన్సర్‌ చికిత్సలో.. అరటి తోడ్పాటు! 

అరటి పండు తొక్కపై కనిపించే నల్లమచ్చలు.. మానవ చర్మ క్యాన్సర్‌ను వేగంగా, తేలికగా గుర్తించేందుకు మార్గం చూపుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. టైరోసినేజ్‌ అనే ఎంజైమ్‌ కారణంగా అరటి పండ్ల తొక్కపై చిన్న, గుండ్రని మచ్చలు ఏర్పడతాయి. ఇదే ఎంజైమ్‌ మానవ చర్మంపై కనిపిస్తుంది. 

ఈమచ్చలు చర్మక్యాన్సర్‌.. మెలనోమాతో బాధపడే వారిలోనూ పెద్ద సంఖ్యలో కనిపిస్తాయి. ఓ శాస్త్రవేత్తల బృందం ఈ ఏకరూపతను క్యాన్సర్‌ స్కానర్‌ను తయారు చేసేందుకు ఉపయోగించుకుంది. మానవ కణజాలంపై ఉపయోగించే ముందు అరటి తొక్కలపై పరీక్షించి చూసింది. ఈ ఎంజైమ్‌ మెలనోమా వృద్ధిని పట్టిచూపే మార్కర్‌గా పనిచేస్తుందని స్విట్జర్లాండు పరిశోధకులు పేర్కొన్నారు. పండ్లతో అధ్యయనం చేపట్టడం ద్వారా మానవ ముక్క పరీక్షలపై ప్రయత్నించడంకన్నా ముందే రోగనిర్ధరణ పరీక్ష పద్ధతిని అభివృద్ధి చేయగలిగినట్లు పరిశోధకులు హ్యూబర్ట్‌ గిరాల్ట్‌ పేర్కొన్నారు. దువ్వెన దంతాల తరహా మైక్రోఎలక్ట్రోడ్లతో ఉండే ఈస్కానర్‌ను చర్మంపై ఉంచినప్పుడు టైరోసినేజ్‌ ఎంజైమ్‌ పరిమాణం, వ్యాప్తిని గుర్తిస్తుందని వివరించారు. స్కానర్‌ను భవిష్యత్తులో కణతుల్ని నాశనం చేసేందుకూ ఉపయోగిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.