Search This Blog

Chodavaramnet Followers

Saturday, 27 June 2015

DRY FRUITS - DATES - KARJURA FRUIT HEALTH TIPS IN TELUGU


ఖర్జూర పండు చాలా విలువైన ఔషధం మరియు శరీరానికి ఒక టానిక్ వలే పనిచేస్తుంది. కర్జూరాలను స్టోర్ చేయడం చాలా సులభం. కర్జూరాలు మిగిలిన డ్రై ఫ్రూట్స్ కంటే ధర చాలా తక్కువ. ఈ కర్జూరాల వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయి. మిగిలిన డ్రై ఫ్రూట్స్ తో పోల్చితే కర్జూరంలో అధిక ఎనర్జీ కలిగించే పోషకాలు, క్యాలరీలు మెండుగా ఉన్నాయి. 100 గ్రాముల కర్జూరంలో 280క్యాలరీలు అందుతాయి. అతి తేలికగా జీర్ణం అయిపోతుంది. శరీరానికిఅవసరమైన శక్తినివ్వటానికి శరీరంలోని వ్యర్ధాలను తొలగించటానికి బాగా ఉపయోగపడుతుంది. ప్రత్యేకించి పిల్లలకు, సాధారణంగా పెద్దలకు వేసవిలో శక్తినివ్వటానికి వాడవచ్చు. ఈ పండులో వుండే నికోటిన్ పేగు సంబంధిత సమస్యలకు మంచి వైద్యంగా వాడవచ్చు. దీనిని తరచుగా వాడుతూంటే, పేగులలో స్నేహపూరిత బాక్టీరియాను బాగా అభివృధ్ధి చేయవచ్చు. పిల్లలనుండి పెద్దలదాకా ఎంతో ఇష్టంగా తినే పండు ఖర్జూరాలు. ఇందులో ఎక్కువగా ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్, మరియు సాచురేటెడ్ ఫ్యాట్స్ అధికంగా కలిగి ఉన్నాయి. ఇవి ఎక్కువ ఫైబర్(పీచుపదార్థాల) ను కలిగి ఉండి జీర్ణవ్యవస్థకు బాగా సహాయపడుతాయి. నేడు ఖర్జూరాలను స్వీట్ల తయారీలో కూడా వాడుతున్నారు. పంచదారకు బదులుగా ఖర్జూరాలను వాడితే ఆరోగ్యానికి హాని కలుగకుండా తియ్యదనం వస్తుందనడంలో సందేహం లేదు. ఎందుకంటే వీటిలో ఉన్నది సహజసిద్ధమైన తియ్యదనం. పాలలో ఖర్జూరపండు వేసి బాగా మరిగించి ఆ పాలను తాగితే శరీరానికి ఎన్నో పోషకాలు లభిస్తాయి. బరువు తక్కువగా ఉండి సన్నగా ఉండే వారికి ఇవి చాలా బాగా సహాయపడుతాయి. అలాగే కర్జూరాలను రాత్రంతా పాలలో నానబెట్టి ఉదయం మిక్సీలో వేసి జ్యూస్ లా తయారు చేసి తాగడం వల్ల శరీరానికి కావల్సిన న్యూట్రిషియన్స్ అధికంగా అందుతాయి. దాంతో రోజంతా పనిచేయడానికి కావల్సిన శక్తి అందుతుంది. ఆకలిగా ఉన్నప్పుడు..మూడ్ సరిగా లేనప్పుడు చాక్లెట్స్ కు బదులు కర్జూరాలను తినడం వల్ల మంచి మూడ్ తో ఉత్సాహంగా పనిచేయగలరు. కర్జూరంలో అధిక శాతంలో అంటే అరటి పండులో కంటే ఎక్కుంగా పొటాషియం కలిగి ఉంటుంది. ఇది గుండె కొట్టుకోవడానికి చాలా సహాపడుతుంది. బ్లడ్ లెవన్స్ ను కంట్రోల్లో ఉంచుతుంది. కర్జూరాలను రెగ్యులర్ గా తినడం వల్ల గుండె నొప్పిని రాకుండా అడ్డుకోవచ్చు. అంతే కాదు ఇందులో ఉండే ఐరన్ క్రోనిక్ అనీమీయా రాకుండా కాపాడుతుంది. కర్జూరంలో విటమిన్స్ కన్నా అమీనో యాసిడ్స్ అధిక శాతంలో ఉంటాయి. ఇవి కండరాల పెరుగుదలకు బాగా సహాపడుతాయి. కర్జూరంలో ఇంకా పెక్టిన్ అనే రసాయనం ఉండటం వల్ల రక్తంలో కొలెస్ట్రాల్ లెవల్ ను అదుపులో ఉంచుతుంది. కర్జూరాలను తరచూ తినడం వల్ల ఆబ్డామినల్ క్యానర్ రాకుండా కాపాడుతుంది. అంతే కాదు కర్జూరాలు గర్భిణీ స్త్రీలకు చాలా ఆరోగ్యకరం. వారు ఇవి తినడం వల్ల ప్రసవం సులభతరం అవుతుంది. గర్భిణీ స్త్రీకి కావల్సిన కె విటమిన్ పుష్కలంగా లభిస్తుంది. కర్జూరంలో దంతక్షయాన్ని పోగొడుతాయి. ఇందులో ఉండే ప్లోయిరిన్ దంతాలు గంటిగా ఉండేలా సహాపడి, త్వరగా ఊడిపోకుండా కాపాడుతాయి. ఇంకా బ్లడ్ ప్రెజర్ ను తగ్గిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. సెక్స్యూవల్ స్టామినా ను పెంచుతుంది. ఎముకల పెరుగుదలకు బాగా సహాపడుతుంది. ఇన్నిఆరోగ్య ప్రయోజనాలు కలిగించే కర్జూరాలను కేక్స్, కుక్కీస్ లలో విరివిగా ఉపయోగిస్తుంటారు. నేడు ఖర్జూరాలను స్వీట్ల తయారీలో కూడా వాడుతున్నారు. పంచదారకు బదులుగా ఖర్జూరాలను వాడితే ఆరోగ్యానికి హాని కలుగకుండా తియ్యదనం వస్తుందనడంలో సందేహం లేదు. ఎందుకంటే వీటిలో ఉన్నది సహజసిద్ధమైన తియ్యదనం. కాబట్టి కర్జూరాలను మీ రెగ్యులర్ డైయట్ లో చేర్చి ఆరోగ్యంగా అందంగా జీవించండి