జుట్టు పొడి బారిందా..!
కాలుష్యం వల్లా... షాంపూలూ, కండిషనర్లూ ఎక్కువగా వాడటం వల్లా జుట్టూ, మాడూ పొడి బారతాయి.
• దీన్ని నివారించాలంటే..
• అరకప్పు బేబీ షాంపూలో ఇరవై చుక్కల టీ ట్రీ నూనె వేసి మాడుకు పట్టించి అరగంటయ్యాక తలస్నానం చేస్తే సరిపోతుంది. టీ ట్రీ నూనెలో యాంటీ బ్యాక్టీరియా, యాంటీ ఫంగల్ గుణాలు ఉంటాయి. ఇవి జుట్టుకు మాయిశ్చరైజర్ గుణాలను అందించి పొడిబారడం, దురద నుంచి ఉపశమనాన్ని అందిస్తాయి.
• నిమ్మరసంలోని యాంటీసెప్టిక్ గుణాలు మాడును శుభ్రపరచడంలో సాయపడతాయి. నిమ్మరసాన్ని నేరుగా మాడుకు పట్టించి, పది నిమిషాల తరవాత కడిగేస్తే సరిపోతుంది.
• కొబ్బరినూనె అన్నింటి కన్నా మంచి చిట్కా. చేతులు శుభ్రంగా కడుక్కుని కొబ్బరినూనె మాడుకు తగిలేలా పట్టించండి. గంట తర్వాత షాంపూతో కడిగేస్తే సరి. ఇలా వారంలో రెండు సార్లు చేస్తే మంచిదే. కలబంద గుజ్జును మాడుకు రాసి అరగంటయ్యాక షాంపూతో కడిగేయాలి.
• అవకాడోలో విటమిన్లూ, సహజనూనెలూ, ఖనిజ లవణాలూ ఎక్కువగా ఉంటాయి. ఇవి జుట్టుని మృదువుగా మారుస్తాయి. ఒక అవకాడోని గుజ్జుగా చేసి, చెంచా తేనె, రెండు చెంచాల ఆలివ్ నూనె కలిపి పేస్ట్‌లా చేయాలి. దీన్ని మాడుకు పట్టించి అరగంటయ్యాక షాంపూతో తలస్నానం చేసి గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి. ఇలా తరచూ చేస్తే జుట్టు మెత్తగా తయారవుతుంది.