Search This Blog

Chodavaramnet Followers

Saturday, 27 June 2015

DARK CHOCLATE HEALTH TIPS IN TELUGU


ఆరోగ్యానికి చాక్లెట్...!

చాక్లెట్‌లో చక్కెరా, కొవ్వుశాతం ఎక్కువగా ఉంటాయనేది వాస్తవమే అయినా... అది కొన్నిరకాల ఆరోగ్య సమస్యల్ని తగ్గిస్తుంది. హార్వర్డ్ మెడికల్ స్కూల్‌కి చెందిన శాస్త్రవేత్తలు... వేడి వేడి చాక్లెట్‌ని తీసుకోవడం వల్ల మెదడు ఆరోగ్యంగా ఉంటుందనీ.. జ్ఞాపకశక్తి తగ్గే పరిస్థితి ఉండదనీ తమ అధ్యయనం ద్వారా తెలియజేశారు. చాక్లెట్‌లో ఉండే ఫ్లవనాయిడ్‌లే అందుకు కారణం.

• డార్క్ చాక్లెట్‌ని తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది. కనీసం ఆరు గ్రాములు తిన్నా రక్తపోటు అదుపులోకి వస్తుందని నిపుణులు చెబుతారు. కొందరు విపరీతంగా అలసిపోతుంటారు. అలాంటి వారు చాక్లెట్‌ని, ముఖ్యంగా డార్క్‌చాక్లెట్‌ని తీసుకోవడం వల్ల ఆ అలసట దూరమవుతుందని హల్‌యార్క్ మెడికల్ స్కూల్‌కి చెందిన శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇందులో ఉండే పాలీఫెనాల్స్ ఒత్తిడిని తగ్గించి, ఉత్సాహాన్నిచ్చే సెరటోనిన్ స్థాయుల్ని పెంచుతాయి.

• చాక్లెట్ రక్తపోటునే కాదు, చెడు కొలెస్ట్రాల్‌నీ తగ్గిస్తుందని సుమారు పన్నెండొందల మందితో చేసిన అధ్యయనంలో తేలింది. ఫలితంగా గుండెజబ్బుల ప్రమాదం చాలామటుకు తగ్గుతుంది. పైగా చాక్లెట్‌లో ఉండే ఫ్లవనాయిడ్లు రక్తసరఫరా పెరిగేలా చేస్తాయి. అలాగే 'తరచూ చిన్న డార్క్ చాక్లెట్ ముక్కను తీసుకోవడం వల్ల ఒత్తిడి స్థాయులు అదుపులో ఉంటాయి' అంటారు నిపుణులు.