Search This Blog

Chodavaramnet Followers

Thursday, 16 May 2013

SUMMER SHINY SKIN CARE ONLINE TIPS IN TELUGU

మీ బాడీ రంగు చామనఛాయా? నన్ను ఎవరు లైక్‌ చేస్తారు?  అని నిరాశపడుతున్నారా? అయితే మీరు పొరపాటు చేస్తున్నారనే చెప్పాలి. అందమైన చాలా మంది హీరోయిన్లు ఛామనచాయ గలవారే. తెల్లచర్మం  ఉన్నవారే అందగత్తెలు కారు. ఛామనఛాయ వన్నె కలిగిన వనితల్లోనూ, ఎంతో ఆకర్షణ ఉంటుందని వీరు నిరూపించారు. కాకపోతే వీరు తమ శరీరం గురించి, చర్మసౌందర్యం గురించి కొంచెం శ్రద్ధ తీసుకున్నారు అంతే. చర్మానికి సహజంగా ఉండే రంగును మార్చడం సాధ్యం కాదనుకోండి. కానీ మంచి ఆహారం, మంచి మేకప్‌, ఇంటి చిట్కా వైద్యంతో మీ చర్మంలో కాంతిని తీసుకురావచ్చని బ్యూటీషియన్లు, డైటీషియన్లు, డెర్మటాలజిస్టులు చెబుతున్నారు. అదెలాగో పరిశీలిద్దాం.


్య   ఛామనఛాయ రంగు ఉన్నవారు మేకప్‌ వేసుకునేటప్పుడు బేస్‌లో స్కిన్‌కలర్‌ను ఉపయోగించాలని, లేదా లైట్‌కలర్‌ను వాడవచ్చని, అప్పుడు లోపలి నుండి చర్మం కాంతివంతంగా కనబడుతుందని ఒక బ్యూటీషియన్‌ చెప్పారు.
్య   లిప్‌స్టిక్‌, ఐ షాడోలో డార్క్‌, డల్‌కలర్‌ ఉపయోగించాలి. కాటుక లేదా ఐ లైనర్‌ను ఉపయోగించాలి. ఎరుపు రంగున్న వారికి ధీటుగా ఇది మెరుస్తుంది. ముఖంలో ఉన్న మచ్చలు, గుంటల్ని కనిపించకుండా చేయడానికి స్కిన్‌ కలర్‌లో కలిసిపోయే కన్సీలర్‌ ఉపయోగించాలి.
్య   లిప్‌స్టిక్‌ ఐ షాడోలో ఎక్కువ బ్రౌన్‌ షేడ్స్‌ ఇవ్వకండి. లైట్‌ బ్రైట్‌ ఉపయోగించకండి. సెట్‌ కాకపోతే మిమ్మల్ని చూసిన వారంతా నవ్ఞ్వకుంటారు. కేవలం మేకప్‌తోనే మీరు మీ ఛామనఛాయ రంగులో మెరుపును తీసుకురావడం వీలుకాదు. దీంతోపాటు కొన్ని ఆహార నియమాలను పాటించాలి. మంచి ఆహారం తీసుకోవాలి. ఇది మీ ఆరోగ్యాన్ని కాపాడడమే కాదు, మీ చర్మ సౌందర్యాన్ని మరింత పెంచుతుంది.
ఆహారం మారినంత మాత్రాన నల్లగా ఉన్నవారు ఎర్రగా మారిపోరు. మంచి ఆహారంతో చర్మాన్ని కోమలంగాను, కాంతివంతంగా తయారుచేసుకోవచ్చు. ఆహారనియమాల్ని పాటించకపోతే ఉన్న రంగు కూడా మరింత డల్‌గా మారుతుంది.


ఫ్రూట్‌జ్యూస్‌, తాజా ఆకుపచ్చని కూరలు, మొల కెత్తిన ధాన్యం తీసుకోవాలి. ఎక్కువనీరు తాగాలి. నారింజ, ద్రాక్ష, ఆల్‌బఖారా తీసుకోవాలి. నిమ్మ రసంలో విటమిన్‌ సి ఎక్కువగా లభిస్తుంది. ఇది ఎన్నో రోగాల నుండి కాపాడుతుంది. చర్మరక్షణకు ఇది ఎంతో అవసరం. సూర్యుని ఆల్ట్రావయొలెట్‌ కిరణాల దుష్ప్రభావాన్నుండి కాపాడుతుంది. చర్మంలో కోలోజెన్‌ శాతాన్ని పెంచుతుంది. ఇది చర్మాన్ని బిగువ్ఞగా ఉంచుతుందని డైటీషియన్లు చెపుతున్నారు.
టీ,కాఫీ సేవనం మంచిది కాదంటారు కాని ప్రతిరోజూ పాలు కలపని టీ, కాఫీ తాగితే చ ర్మానికి మంచి లాభం చేకూరుతుందని, ఇందులో పుష్కలంగా యాంటీ ఆక్సిడెంట్స్‌ ఉంటాయి. ఇవి ఆల్ట్రా వయొలెట్‌ కిరణాల చెడు ప్రభావాల నుండి కాపాడతాయి. ఈ వాతావరణంలో ఉన్న ఫీరేడికల్స్‌ నుండి చర్మానికి రక్షణ లభిస్తుంది. దీంతో చర్మంపై మచ్చలు రావ్ఞ. సరైన సమయంలో భోజనం చేస్తే లాభాలు పెరుగుతాయని వారంటున్నారు.


ఇలా చేస్తే రంగుమారడానికి రెండు నుండి ఆరు నెలలవరకు సమయం పడుతుందని, చామనఛాయ ఉన్నవారు ఎండలో తిరిగేటప్పుడు వారి చర్మం పగిలినట్లు, మంట పుట్టినట్లు ఉండదు. కానీ తెలుపు, ఎరుపు రంగువారు ఈ సమస్యను ఎదుర్కొంటారు. ఈ రంగులో ఉన్నవారికి ముడతలు కూడా ఆలస్యంగా ఏర్పడతాయి. తెలిసిందిగా ఛామనఛాయలో ఉన్న ప్రయోజనాలు. మరి మీ కలర్‌ను చూచి బాధపడకుండా అందంగా కనిపించడానికి కావలసిన చిట్కాలు పాటించి అందరి దృష్టిని మీ వైపు తిప్పుకోండి మరి.