Search This Blog

Chodavaramnet Followers

Thursday, 16 May 2013

SPIRITUAL IMPORTANCE OF GOD'S PRAYER


సాయి విష్ణు సహస్రనామ మహత్యాన్ని శ్యామాకు చెప్పాడు. సహస్రనామ తుల్యమయిన రామనామం మహత్తు కూడా అంతటిదే. భక్త కబీరు కుమారుడు కమాల్‌. ఒకసారి రామ ప్రభావము చేత కమాల్‌ ఒక కుష్టువాని రోగమును నయం చేయగలిగాడు. రామనామ మహిమను నేను తెలుసుకున్నట్లే అని కమాల్‌ అనుకున్నాడు. కబీరు పరిస్థితిని గ్రహించాడు. తన కుమారునకు రామనామ మహిమను గూర్చి చెప్పదలచుకున్నాడు. అతడిని తులసీదాసు వద్దకు పంపాడు. తులసీదాసు ఒక తులసి ఆకుపై రామనామమును వ్రాసి, ఆ ఆకును నీటిలో వేసి ఆ ఆకుతీర్థంతో అయిదు వందల మంది కుష్టురోగుల వ్యాధిని నయం చేశాడు. ఒకసారి రామనామం వ్రాసిన తులసీ నీళ్లకే ఇంతటి మహత్తు ఉంటే, రామనామంలో ఎంతటి మహిమ ఉన్నదో అనుకోసాగాడు అతడు. అయినా కబీరుకు ఇంకా తృప్తి కలుగలేదు.
కబీర్‌ కమాల్‌ను సూరదాసు వద్దకు పంపాడు. సూరదాసు గంగలో కొట్టుకుపోతున్న ఒక శవం చెవిలో రామనామ శబ్దంలోని 'రకారాన్ని మాత్రమే జపించాడు సూరదాసు. ఆ శవం బ్రతికింది. లేచింది.


అప్పుడు కమాల్‌ రామనామంలోని 'రకారం వల్లనే శవం బ్రతుకుతుందని గ్రహించాడు.
''ఇది కూడా నిజానికి రామనామం యొక్క అసలైన మహిమ కాదు. ఆ నామ మహిమను గురించి ఎవరు వర్ణన చేయగలరు? అని కబీరు తన కుమారునకు తెలియచెప్పే ప్రయత్నం చేశాడు.
తులసీదాసు అంటారు-''ఈ (రామ)నామ మహిమను ఏమని చెప్పగలము? స్వయంగా శ్రీరాముడే తన నామ మహిమను చెప్పటానికి అసమర్థుడు.
రామనామము సర్వశుభదాయకం.