ఈ వేసవికాలంలో తలలో చమట ఎక్కువగా పట్టి జుట్టు త్వరగా మాసిపోయే అవకాశాలెక్కువ. దీన్ని నిర్లక్ష్యం చేసి వారానికోసారి స్నానం చేద్దాం అనుకుంటే మీ జుట్టుకు మీ చేతులారా హాని చేస్తున్నట్టే లెక్క. వారానికి రెండుసార్లయినా స్నానం చేస్తే మంచిది. అలాగే చుండ్రుకు కూడా అవకాశాలు ఎక్కువే. ఈ కారణంగా జుట్టు ఎక్కువశాతం రాలిపోతుంటుంది. జుట్టు ఈ వాతావరణానికి పేలవంగా, రఫ్‌గానూ తయారవ్ఞతుంది. అలాంటి జుట్టును అందంగా మలచుకోవడానికి కొన్ని చిట్కాలు మీకోసం...
్య తేలికపాటి షాంపూలు కొద్దిగా మాత్రమే ఉపయోగించాలి. కఠినమైన షాంపూలు శిరోజాల్లోని సహజమైన నూనెల్ని హరించి వేస్తాయి.
్య అలాగే బాగా వేడి నీటిని తలపై పోసుకోకూడదు. షాంపూ చేసుకున్న తర్వాత కండీషనర్ అప్లయి చేయాలి. లేదా కండీషనర్ కలిసి ఉన్న షాంపూను ఎంచుకోవాలి.

్య హెయిర్ డ్రయర్‌ను జుట్టుకు కనీసం పది అంగుళాల దూరంలో ఉంచాలి. అసలు వాడకుండా ఉంటే ఇంకా మంచిది. వారానికి రెండుసార్లు తలకు నూనె పెట్టుకుని, ఆ నూనెను రాత్రంతా అలా ఉంచి పొద్దునే షాంపూ చేసుకుంటే జుట్టు నల్లగా, మృదువ్ఞగా ఉంటుంది.
్య వారానికి రెండు సార్లు పెరుగు లేదా గుడ్డులోని పచ్చసొన పొడి జుట్టుకు అప్లయి చేస్తే కేశాలు మృదువ్ఞగా ఉంటాయి. కొబ్బరినూనె, నువ్ఞ్వలు లేదా ఆలివ్ ఆయిల్ కలిపి వేడిచేసి మాడుకు, శిరోజాలకు పట్టించి వేడినీటిలో ముంచిన టవల్ తలకు చుట్టుకోవాలి. ఐదు నిమిషాలుంచి, మరోమారు టవల్‌ను వేడినీటిలో ముంచి చుట్టుకుని కొద్దినిమిషాలు ఉంచుకోవాలి. ఇలా చేయడం ద్వారా మాడు నూనెను బాగా గ్రహిస్తుంది.

్య పొడిగా, పేలవంగా జుట్టు ఉన్నట్లయితే ఒక కప్పు తేనె, అరకప్పు ఆలివ్ ఆయిల్ లేదా నువ్ఞ్వల నూనె, రెండు టేబుల్ స్పూన్లు నిమ్మరసం కలిపి తీసుకుని తలకు మసాజ్ చేయాలి.
్య వేడిటవల్ చుట్టుకుని కొద్దిసేపు షాంపూ చేసుకోవాలి. జుట్టు పొడిగా దెబ్బతిని ఉన్నట్లయితే ఒక టీ స్పూన్ ఆముదం, రెండు స్పూన్లు స్వచ్ఛమైన ఆలివ్ ఆయిల్ లేదా కొబ్బరి నూనెను కలిపి మసాజ్ చేసుకుని వేడినీటి టవల్ చుట్టి ఆ పై స్నానం చేయాలి.
్య ఆరోగ్యవంతమైన జుట్టు కోసం ప్రతిరోజు ఆహారంలో తాజా కూరగాయలు, పండ్లు ఉండేలా చూసుకోండి. వీటిలో విటమిన్ సి, ఐరన్‌లు ఎక్కువగా ఉంటాయి. ఇవి మీ జుట్టు కుదుళ్లను బలంగా చేసి, జుట్టు చివర్లు చిట్లకుండా ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి.
్య మానసిక ప్రశాంతతను చేకూర్చే ఎక్సర్‌సైజులు, యోగా లాంటివి చేయడం వల్ల ఒత్తిడి నుండి దూరంగా ఉండి జుట్టు రాలడాన్ని అరికట్టవచ్చు.
్య చేపలలాంటి సముద్రము ఆహారం, పాల ఉత్పత్తులు, గుమ్మడి విత్తనాలులాంటివి ఎక్కువ తీసుకోవడం వల్ల శరీరానికి కావలసినంత జింక్ దొరికి తలలో చుండ్రును నివారిస్తుంది. తద్వారా జుట్టు రాలడాన్ని నివారించవచ్చు.
్య హఠాత్తుగా మీ శరీర బరువు తగ్గిపోయేలా మీ ఆహారంలో ఎలాంటి మార్పులు రాకుండా చూసు కోండి. దీనివల్ల శరీరానికి కావలసిన పోషకాలు అందక జుట్టు రాలిపోయే అవకాశం ఎక్కువగా ఉంది.

్య తలకు కొబ్బరిపాలను బాగా పట్టించి గంట ఆగి స్నానం చేయాలి.
్య ఉల్లిపాయ తొక్కల్ని నీళ్లలో మరిగించి చల్లారబెట్టి ఆ నీళ్లతో తల తడుపుతుంటే జుట్టుకు మంచిది.
్య కోడిగుడ్డు తెల్లసొనలో మెంతిపొడి కలిపి బాగా గిలక్కొట్టి తలకి రాసుకొని అరగంట తర్వాత తలంటుకుంటే చుండ్రు, దురద ఉండవు.
్య తలకి క్యాబేజీ ఆకుల రసం బాగా పట్టించి గంటసేపాగి తలస్నానం చేస్తే చలవ. జుట్టు పెరుగుదల కూడా బాగుంటుంది.
్య మందార ఆకుల్ని బాగా రుబ్బి తలకు పట్టించుకొని కొంచెంసేపు ఆగి తలంటుకుంటే జుట్టు నల్లగా, మృదువుగా తయారవుతుంది. ఈ సూచనలు పాటించి మీ కేశాలనూ అందంగా, మృదువ్ఞగా మార్చుకోండి మరి.