Search This Blog

Chodavaramnet Followers

Monday, 20 May 2013

BEAUTIFUL AND COLOURFUL NAILS


గోళ్లు మరీ బలహీనంగా ఉంటే వాటిని నీళ్లతో తడిపి గోరువెచ్చని ఆలివ్‌ ఆయిల్‌లో రోజు విడిచి రోజు 20 నిమిషాల పాటు ఉంచితే బలంగా తయారవుతాయి.
మ్మానిక్యూర్‌ చేయించేప్పుడు ఒక్కోసారి బ్యుటీషియన్స్‌ గోటి క్యూటికిల్‌ కూడా తీసేస్తారు. ఇలా చేయడం సరికాదు. దీనివల్ల ఒక్కోసారి ఇన్ఫెక్షన్లు రావచ్చు.



వారానికి ఒకటి కంటే ఎక్కువ సార్లు నెయిల్‌ పాలిష్‌ తీసేసి మళ్లీ వేసుకోవడం సరికాదు. అంటే...వారానికి ఒకసారి ఒక్క నెయిల్‌ పెయింట్‌ మాత్రమే వేసుకోవడం ఆరోగ్యకరం.
మీ గోళ్లకు స్వాభావికమైన మెరుపు రావాలంటే వాటిపై పెట్రోలియమ్‌ జెల్లీ పూసి, పాలిష్‌ చేసినట్లుగా ఒక పొడి గుడ్డతో బఫ్‌ చేయాలి.



గోళ్లకు సబ్బు తగిలి ఉంటే అవి పెళుసుగా మారిపోతాయి. కాబట్టి స్నానం చేసిన వెంటనే, లేదా చేతులు శుభ్రం చేసుకున్న వెంటనే వాటికి తగిలి ఉన్న సబ్బు పోయేలా కడిగి పొడిగుడ్డతో శుభ్రం చేసుకోవాలి.