Search This Blog

Chodavaramnet Followers

Monday 20 May 2013

KITCHEN TIPS IN TELUGU


1. తేనెసీసాలో రెండుమూడు మిరియాలు వేస్తే ఎక్కువకాలం నిల్వ ఉంటుంది. చీమలుకూడా పట్టవు.
2. తోడుపెట్టిన పాలల్లో చిన్న కొబ్బరి ముక్కవేస్తే పెరుగుకమ్మగా ఉంటుంది.
3. దుంపలను ఉప్పు కలిపిన నీటిలో ఓ పావుగంట నానబెట్టి ఆ తర్వాత ఉడికించండి. త్వరగాఉడుకుతాయి.
4. దోసకాయ ముక్కలు క్రష్‌ చేసి కిచెన్‌ చుట్టు ప్రక్కల ఉంచారంటే, బొద్దింకలు దూరం దూరం.
5. నిమ్మకాయ రసం పిండివేశాక, ఆ నిమ్మడిప్పల్ని పారవేయకుండా వాటితో ప్లాస్టిక్‌ సామానును రబ్‌ చేయండి మురికి పోయి అది మెరిసిపోవటాన్ని మీరు గుర్తించగలుగుతారు.
6. నిమ్మకాయల్ని తడిబట్టలో చుట్టి పాలిథిన్‌ కవర్లో ఉంచితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి.
7. నిమ్మరసం ఎక్కువగా రావాలంటే పది నిముషాల పాటు గోరువెచ్చటి నీటిలో వేసి ఉంచాలి. ఒకవేళ ఫ్రిజ్‌లో ఉంటే రసం తీయటానికి పది నిమిషాల ముందు బయటపెట్టాలి.
8. నూనెలోకాని, నెయ్యిలో కాని కొంచెం బెల్లం ముక్కని వేస్తే దానిని గడ్డ కట్టకుండా ఆవుతుంది.
9. నెయ్యిబాగా మరగించి, దాన్ని నిల్వ ఉంచితే చాలా కాలం నిల్వ ఉంటుంది.
10. నెయ్యి మరిగించే సమయంలో రెండు చిటికెలు ఉప్పుదానిలో వేశారంటే నెయ్యి చాలా కాలం నిల్వ ఉంటుంది.
11. పచ్చిమిరపకాయలు పండకుండా ఉండాలంటే గాలి చొరబడని గట్టి మూతగల సీసాలో ఉంచి, చిటికెడు పసుపు చల్లి ఎండతగిలేలా ఉంచాలి.
12. పప్పుధాన్యాలు చెడిపోకుండా నిల్వ ఉండాలంటే పప్పుల్లో నాలుగు ఇంగువ పలుకులు వేసి ఉంచితే చాలు! పప్పులకు పురుగుపట్టదు. ఎంతకాలమైనా నిల్వ ఉంటాయి.
13. పాత చేతి రుమాళ్ళు రెండింటిని తీసుకొని మూడు పక్కల కలిపి కుట్టి ఒక పక్క వదిలేయాలి. సంచిలా తయారైన దీనిని తడిపి అందులో ఆకు కూరలు పెట్టి ఫ్రిజ్‌లో ఉంచితే వాడిపోకుండా తాజాగా వుంటాయి.
14. పుట్టగొడుగులు ఎక్కువ కాలం నిలువ ఉండాలంటే వాటిని ప్లాస్టిక్‌ కవర్‌లో కాకుండా చక్కగా పేపర్లో చుట్టి ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి.
15. ఫ్రిజ్‌లో అక్కడక్కడ పుదీనా ఆకులు ఉంచితే దుర్వాసనరాదు.