Search This Blog

Chodavaramnet Followers

Monday 20 May 2013

ORANGE BEAUTY TIPS


అందం అనేది చూసే కళ్ళల్లో వుంటుంది అన్నారు పెద్దలు. అయితే చూపు తిప్పుకోలేని అందాన్ని పెంపొందించేందుకు ప్రయత్నిస్తున్నారు నేటి మహిళలు. ఎన్నో బ్యూటీ ప్రోడక్ట్స్‌, వ్యాయామాలు, ఫే˜స్‌ప్యాక్‌లతో డబ్బును, సమయాన్ని వెచ్చిస్తున్నారు. ఈ బిజీలైఫ్‌, కాంపిటివ్‌ ప్రపంచంలో ప్రతి మహిళకు ఇంత సమయాన్ని కేటాయించడం సాధ్యం కాదు. అటువంటి వారికి ఓ శుభవార్త. తమ అందాన్ని ఎటువంటి కష్టంలేకుండా, సమయం వృధా చేయకుండా పెంపొందించుకోవచ్చు. మరి ఆ సులువైన పద్ధతి ఏమిటన్నది తెలుసుకుందామా! మనకు తక్కువ ఖర్చుతో మార్కెట్‌లో ఈజీగా దొరికే కమలాపండు (ఆరెంజ్‌).


ఆదేమిటి ఆరెంజ్‌తో మరింత అందంగా ఎలా అవుతారు? అబ్బా! ఆరెంజ్‌ తొక్కలను ఎండబెట్టాలి, పౌడర్‌ చేయాలి, దానిలో ఏవేవో కలపాలి అంటూ ఆలోచిస్తున్నారు కదూ! వద్దు! వద్దు!! మీరు అంత కష్టపడటం మాకు ఇష్టం లేదు. అందుకే మీకో సునాయాస మార్గం. ప్రతి రోజు క్రమం తప్పకుండా ఓ గ్లాసు ఆరెంజ్‌ జ్యూస్‌ సేవించండి చాలు. ఈజీ కదా!!


బ్యూటీ ఎక్స్‌పర్ట్స్‌, న్యూట్రీషనిస్టుల ప్రకారం ఆరెంజ్‌ జ్యూస్‌ను సేవించడం వల్ల మీ చర్మమే కాక జుట్టు, గోళ్ళు కూడా అందంగా వుంటాయి. ఆరెంజ్‌లో వున్న విటమిన్‌ ''సి'', ఫోలిక్‌ యాసిడ్‌, పొటాషియం మీ అందాన్ని రెట్టింపు చేయడంలో తమవంతు తోడ్పాటును అందిస్తాయి. వీటి వల్ల మీ చర్మం రెట్టింపు అందాన్ని సంతరించుకుంటుంది. దీనికి తోడు జుట్టు, గోళ్ళు కూడా అందంగా మారుతాయి. ఆరెంజ్‌లో వున్న ఎల్లోపిగ్మెంట్‌ చర్మ నిగారింపుతో పాటు, దాని ఎలాక్టిసిటీని కూడా కాపాడుతుంది.
మీరు చేయాల్సిందల్లా రోజూ ఒక గ్లాసు అంటే 200మిలీ.ల ఆరెంజ్‌ జ్యూస్‌ తాగడమే. ఆధారాలు ఏమిటి? ఎలానమ్మడం అంటారా??

మరి దానికీి సమాధానముందండి!!
సిఇడబ్ల్యూ (కాస్మెటిక్‌ ఎక్జిక్యూటివ్‌ ఉమెన్‌) వారు దాదాపు 200 మంది బ్యూటీ పరిశ్రమ వర్కర్స్‌పై జరిపిన పరిశోధన ఆధారంగా దీనిని నిర్ధారించినట్లు సిఇడబ్ల్యూ సభ్యులు పేర్కొన్నారు. ఈ నేపధ్యంలో ప్రముఖ బ్యూటీ ఎక్స్‌పర్ట్స్‌ మరియు న్యూట్రీషనిస్టులు కూడా వీరితో ఏకీభవిస్తున్నారు. అంతేకాక తమ క్లయింట్స్‌కు కూడా తమ బ్యూటీ షెడ్యూల్‌లో ఆరెంజ్‌ జ్యూస్‌ను కూడా యాడ్‌ చేసుకోమని సలహాయిస్తున్నారు. మరి ఇంత ప్రయోజనకరమైన ఆరెంజ్‌ జ్యూస్‌ను నిర్లక్ష్యం చేయడం సబబా? మీ అందాన్ని పెంపొందించుకోవాలంటే రోజూ క్రమం తప్పకుండా ఆరెంజ్‌ జ్యూస్‌ తాగుతారని, మరింత అందాన్ని సంతరించుకుంటారని ఆశిస్తూ......