Search This Blog

Chodavaramnet Followers

Monday, 20 May 2013

13 BEAUTY TIPS FOR MAINTAINING BEAUTIFUL NECK


అతివలు ముఖానికి, చేతులకు, వేళ్లకు చూపిచినంత శ్రద్ధ మెడ మీద చూపించరు. శంఖం లాంటి మెడ అంటూకవులు ఎంతగా అభివర్ణించినా దీని గురించి పట్టించుకునేవారు తక్కువే. రోజు మొత్తం మీద ముఖం, కాళ్ళు, చేతులు అదే పనిగా శుభ్రం చేసుకునేవారు. ముఖానికి కొద్దిగా కిందగా వున్న మెడని మాత్రం కనీసం నీటితో కూడా కడుక్కోరు. వాస్తవానికి మెడ మీద పడే ముడతలు వృద్థాప్యాన్ని త్వరగా తెలియజేస్తాయని నిపుణులు అంటున్నారు. చందమామ లాంటి మోము ఉన్నా దాని కింద ముడతలు పడి లూజుగా వేలాడుతున్న మెడ చర్మం ఉంటే దాని విలువ అమావాస్య చంద్రుడికున్నంత. కూర్చున్నా, నిల్చున్నా, పడుకున్నా, నడిచినా, తింటున్నా.... ఏ పనినీ మెడ సహాయం లేకుండా చేయలేం! ఆరోగ్యంతో పాటు అందాన్నిచ్చే మెడకి తగినంత విలువనివ్వండి... ప్రేమగా చూసుకోండి.


కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే కవులు వర్ణించినట్లు శంఖం లాంటి మెడను సొంతం చేసుకోవచ్చు. ఆ జాగ్రత్తలేమిటో మీ కోసం...
1. ముఖం కడుకున్న ప్రతీసారి మెడను కూడా శుభ్రం చేసుకోవాలి. అలా వీలుపడకపోతే కనీసం నీటితో అయినా మెడను కడుక్కోవాలి. మెడ దగ్గరే దుమ్ము, ధూళి ఎక్కువగా వచ్చి చేరతాయి.
2. ముఖానికి ఉపయోగించే మాయిశ్చరైజర్‌నే మెడకు ఉపయోగించవచ్చు. దీనికోసం ప్రత్యేకించి కొనవలసిన అవసరం లేదు.
3. మార్కెట్‌లో ఏ సౌందర్య ఉత్పత్తి కొన్నా అల్కాహాల్‌ రహిత సాధనాన్నే కొనుగోలు చేయాలి. వీటిని కొనుగోలు చేసేటప్పుడే వాటి తయారీకి ఏవేవి ఉపయోగించారో పరిశీలించాలి. ఉత్పత్తిమీద ఆ వివరాలు లేకపోతే షాపు వారిని తప్పనిసరిగా అడిగి కనుక్కోవాలి.



4. మెడ ప్రభావం భుజాల మీద పడుతుంది. మెడతో పాటు భుజాలు మెరుస్తూ వుంటేనే ఏ డ్రస్‌ వేసుకున్నా నప్పుతుంది.
5.ఫేషియల్‌ మాయిశ్చరైజర్‌నే భుజాలు,మెడకు కూడా ఉపయోగించవచ్చు.
6.ప్రతిరోజూ కొద్దిసేపన్నామెడకు సంబంధించిన వ్యాయామం చేయాలి. దీనివల్ల మెడ కండరాలు ఆరోగ్యంగా ఉంటాయి.
7.వారంలో ఒకటి రెండుసార్లన్నా మెడ, భుజాల మసాజ్‌ చేసుకోవాలి. ఇంట్లో చేసుకోవడం కుదరని వాళ్ళు పార్లర్లకి వెళితే మంచి ఫలితం వుంటుంది.



8. వారంలో ఒకసారన్నా ఫేస్‌ మాస్క్‌ను మెడకు పట్టించి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
9.సూర్యకిరణాల ప్రభావం వలన మెడ దగ్గర చాలా త్వరగా నల్లమచ్చలు ఏర్పడతాయి. వీటి నివారణకు ఇంటి వైద్యమే మేలు.
టామోటా గుజ్జును మెడ, భుజాల దగ్గర పట్టించి కొద్దిసేపటి తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా కొన్ని వారాలపాటు చేసుకుంటే క్రమంగా నలుపురంగు పోయి చర్మం సహజ నిగారింపును సంతరించు కుంటుంది.
10. మెడకు అలంకరించుకునే ఆభరణాల విషయంలో కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. భుజాలు వెడల్పుగా వున్నవారు భారీ ఆభరణాలు ధరించినా బాగుంటుంది. కానీ భుజాలు సన్నగా, చిన్నగా ఉన్నవారు నెక్లెస్‌ లేదా చైన్‌ వేసుకుంటేనే బాగుంటుంది.
11. మెడచుట్టూ ఉన్న ముడతలు పోవాలంటే ఒక చెంచా కోడిగుడ్డులోని తెల్లసొన, చెంచా పాలమీగడ, కొంచెం రోజ్‌వాటర్‌ కలిపిన పేస్టును మెడకు పట్టించాలి.



12. మెడ నలుపుగా మారిన వారు బొప్పాయి గుజ్జు ప్యాక్‌ వేసుకుంటే తెలుపుదనమే కాకుండా నునుపు దనం కూడా వస్తుందని బ్యూటీషియన్లు చెబుతున్నారు.
13. మెంతి ఆకుల రసాన్ని, శనగపిండి కలిపి మెడకు రాయాలి. 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రపరచుకుంటే మెడ అందంగా మెరిసిపోతుంది.