Search This Blog

Chodavaramnet Followers

Monday, 20 May 2013

BIRTH MARKS AND ITS RESULTS




శరీరంపై పుట్టుమచ్చలు ఏ రంగులో ఉన్నాయనడాన్ని బట్టి ఫలితాలను చెప్పేయవచ్చునని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. సాధారణంగా పుట్టుమచ్చలు నల్లగాఉంటాయి. మరికొన్ని ఎరుపుగను, ఆకుపచ్చగను, తేనెరంగును, పసుపుపచ్చగను, గంధపురంగుగా ఉంటాయి. ఇందులో ఆకుపచ్చ, ఎరుపు రంగులతో కూడిన పుట్టుమచ్చలు కలిగిన వారికి శుభములు కలుగుతాయి. అయితే నలుపు రంగు దరిద్రమునకు, మరికొన్ని అశుభాలకు సూచికములని పండితులు అంటున్నారు. అయితే లేత నలుపు, ఆకుపచ్చరంగు, గంధపురంగును పోలిన పుట్టుమచ్చల వలన శుభఫలితాలుంటాయి. అలాగే పుట్టుమచ్చల మీద వెంట్రుకలు ఉండి పలుచగా ఉండి అవి కొంచెము పొడవు కలిగివున్నచో ఆ వ్యక్తి ధనవంతుడు, కీర్తివంతుడవుతాడని పురోహితులు చెబుతున్నారు. అలాగే ఆ వెంట్రుకలే దట్టముగా ఉండి కొంచెము పొట్టిగా ఉంటే అశుభ ఫలితాలు చేకూరుతాయి. ఇకపోతే...పురుషులకు రెండు కనుబొమ్మల మధ్య యున్నతో ఆ వ్యక్తి దీర్ఘాష్మంతుడవుతాడు. బంధుప్రియుడవుతాడు. భోగములందు ఆసక్తి కలిగివుంటాడు. సువాసన ద్రవ్యముల పట్ల ప్రేమకలిగి వుంటాడని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.