Search This Blog

Chodavaramnet Followers

Monday, 1 April 2013

TIPS FOR EYE CARE - DON'T NEGLECT IF ANY TROUBLE ARISES, OTHERWISE LIFE WILL BECOME BLACK



అన్ని అవయవాల్లో కళ్లు ప్రధానమైనవి. అలాంటి కళ్ల విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం తగదు. ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే చికిత్స తీసుకోవాలి. మీ చూపు పదిలంగా పదికాలాలు ఉండాలంటే కొన్ని సూచనలు పాటించాల్సిందే. అవేమిటంటే...

- ఎప్పుడూ కూడా నెంబరులేని కళ్లజోళ్లను ధరించకండి.
- చలువ అద్దాలు వాడేటప్పుడు అవి అల్ట్రావైలెట్‌ కిరణాల నుంచి కాపాడే విధంగా ఉండాలి.
- వంటగదిలో పనిచేసేటప్పుడు లేదా ఇంటిని శుభ్రం చేసేటప్పుడు చేత్తో నలపడం కానీ, రుద్దడం గానీ చేయకూడదు. చేతికున్న మట్టి, ధూళికణాలు, సూక్ష్మక్రియుల కంటిలోకి చేరి అలర్జీ లేదా ఇన్‌ఫెక్షన్‌ను కలిగించే ప్రమాదముంది.
- వంటచేసేటప్పుడు వేడి అవిరి కళ్లకు తగిలినప్పుడు లేదా కూరగాయలు శుభ్రం చేసే సమయంలో ధుమ్ముపడితే వెంటనే చేతులు శుభ్రం చేసుకుని చేతివేళ్లతో నీటిని కళ్లమీద చిలకరించి మెత్తని గుడ్డతో కళ్లు తుడుచుకోవాలి.
- కళ్లను రోజుకు వీలైనంత వరకు రెండుసార్ల కన్నా ఎక్కువ కడగవద్దు.
- కళ్లలో మంట ఏర్పడి ఎరుపెక్కినపుడు ఏదో తమకు తోచిన మందులు, చిట్కాలు వాడకుండా వెంటనే కంటి డాక్టరును సంప్రదించాలి.
- మీ చూపుసరిగ్గా కనపడకపోయినా దృష్టిలో ఏదైనా లోపం ఉన్నా డాక్టరు సలహా లేకుండా మీకంట్లో రోజ్‌వాటర్‌ను వేయకండి.
- సంవత్సరంలో ఒకసారైనా తప్పనిసరిగా పూర్తి కంటిపరీక్షలు జరిపించుకోండి.
- కంటికి సరిపడా నిద్ర, విశ్రాంతి ఇవ్వడం చాలా అవసరం.
- కంటికి ఆరోగ్యంతో పాటు అందం కూడా అవసరం.

 కళ్లు అందంగా కనపడాలంటే కొన్ని జాగ్రత్తలు మనం పాటించాలి. అవేమిటంటే...

- కంటి అందాన్ని పెంచేందుకు కంటి మేకప్‌ చాలా అవసరం. గుర్తింపు పొందిన కంపెనీ ప్రొడక్టులనే వాడాలి. లేదంటే వేరే వాటి వల్ల కళ్లు దెబ్బతినే అవకాశం ఉంది.

- కాటుక దిద్దిన కళ్లచూపు చాలా శృంగార భరితంగా ఉంటుంది. అయితే కాటుక పెట్టుకునేటప్పుడు చేతివేళ్లు శుభ్రంగా లేకపోతే క్రిములు కంట్లోకి ప్రవేశించి లోపలి భాగాలు దెబ్బతినే ప్రమాదముంది. అందువల్ల చేతులను శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి.
- కనురెప్పల వెంట్రుకలు నలుపు రంగుతో సింగారిస్తే కళ్లు పెద్దవిగా చాలా అందంగా ఉంటుంది. కానీ వీటిని ఉపయోగించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

- కళ్లకు మంచి షేప్‌ రావడం కోసం ఐ లైనర్‌ను వాడతారు. దీన్ని వాడేటప్పుడు కంట్లో చిన్న చుక్క కూడా పడకుండా ఉండేలా జాగ్రత్త పడాలి.

- కంటి మేకప్‌ను అవసరం తీరిన తర్వాత తొలగించేటప్పుడు జాగ్రత్తగా ఉండకపోతే కళ్లకు ప్రమాదం జరగవచ్చు. కొందరు మహిళలు మేకప్‌ తొలగించడం కోసం దూదిని నీటిలో ముంచి శుభ్రం చేస్తుంటారు. ఇది సరైన పద్ధతి కాదు.

- కంటిమేకప్‌ను తొలగించడానికి ప్రత్యేకమైన ఆయిల్‌ను మాత్రమే ఉపయోగించాలి. లేకపోతే బేబీ ఆయిల్‌ వాడవచ్చు.
- అలసిన కళ్లు విశ్రాంతి పొందాలంటే గోరువెచ్చని నీటిలో ముంచిన టీ బ్యాగుల్ని కళ్లపై ఉంచాలి.        

- కళ్లు అలసినప్పుడు ముఖం కాంతివిహీనంగా ఉంటుంది. కళ్లకు ఎంత మేకప్‌ చేసినా సరి అవ్వదు. అలాంటప్పుడు చల్లని దోసకాయ గుజ్జులో ముంచిన దూదిని మూసిన కనురెప్పల మీద ఉంచాలి. దీనివలన కళ్లపై ఒత్తిడి తగ్గి రిలాక్స్‌ అవుతారు.