ఆందోళన, కోపం, బాధ వీటివలన మనం తీసుకునే ఆహారం విషయంలో మార్పు వస్తుంది. అంతేకాదు మనం తీసుకున్న ఆహారం కూడా వంట పట్టదు. ఆహారం ఎప్పుడూ కూడా నిదానంగా నమిలి తినాలి. కాని ఎప్పుడైతే మన మూడ్ బావుండదో అప్పుడు తొందరగా తినేసి అక్కడి నుంచి వెళ్లిపోవాలని అనుకుంటాం. ఇలా గబాగబా తినడం మంచిది కాదు.
మీరు బాగా వత్తిడికి లోనైనప్పుడు ఆహారం తీసుకుంటే ఆహారం జీర్ణం అవడం కూడా కొంచెం కష్టమే అవుతుంది.ఆహారం తీసుకునేటప్పుడు ఎలాంటి ఒత్తిడికి లోనుకాకండి. ఆ సమయంలో సీరియస్ విషయాలను చర్చించకండి. వీలు కుదిరితే నవ్వుతూ మాట్లాడుకోండి.
మౌనంగా భోజనం ముగించండి. వీలైనంత వరకు మౌనంగా తినడం మంచిది. అసలు మీ సమస్యని భోజన సమయంలో చర్చించడం లేదా దాని గురించి ఆలోచనలో పడడం వంటివి చేయకూడదు.
మీరు ప్రశాంతంగా తీసుకున్న ఆహారమే మీ వంటికి బాగా వంటపడుతుంది. మిగిలిన ఆహారం తినలేకపోయినా ప్రయోజనం ఉండదు. చాలామంది శుభ్రంగా తింటారు. అయిన మేము ఎంత తిన్నా అది వంటపట్టటం లేదని విచారిస్తుంటారు. దీనికి కారణం తినేటప్పుడు ఏదో ఒకటి ఆలోచించడం, లేదా చర్చించడం వంటి ముఖ్య కారణాలు. ఆహారం తీసుకునేటప్పుడు ప్రశాంతంగా ఉండాలి. అప్పుడు మీరు తిన్నదంతా శుభ్రంగా వంటపడుతుంది.