Search This Blog

Chodavaramnet Followers

Monday 1 April 2013

A TRIBUTE TO MAHA NATI - TELUGU CINEMA LEGED - SAVITHRI




సినీ ప్రపంచంలో ఎందరో నటీమణులు తెరమీద తళుక్కున మెరిసి కనుమరుగవుతున్నా... ఎప్పటికీ అందరి మనసుల్లో చెరగని ముద్రవేసుకున్న నటీమణి సావిత్రి. మహానుభావులకు మరణం లేదంటారు. అందుకే సినీ పరిశ్రమలో నేటికీ ఓ ధవతారగా వెలుగుతూ నూతన నటీమణులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు.  నేడు ఆమె జయంతి సందర్భంగా ఆ మహానటిని మరొకసారి స్మరించుకుందాం.సావిత్రి చిత్రసీమలో అసమాన నటనా ప్రతిభ చూపి, అందానికి, నటనకి మారుపేరుగా నిలిచిన ముద్దుగుమ్మ. నిశ్శంకర రావ్ఞగురవయ్య, సుభద్రమ్మలకు గుంటూరుజిల్లా తెనాలి చిర్రా వూరులో డిసెంబరు 6, 1935లో జన్మించింది. అతి చిన్నతనం నుంచే సంగీతం,సాంప్రదాయ నృత్యాలను శిష్టాపూర్ణయ్య శాస్త్రి వద్ద నేర్చుకుంది. ఆమె బాల్యం నుంచే స్టేజిషోలు ఇచ్చేది. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ ఇలా అనేక భాషల్లో నటించి తన నటనతో ప్రేకకుల్ని సమ్మోహితుల్ని చేసింది. ఆమె మొత్తం 318 సినిమాల్లో నటించింది. చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా విజయవాడలో తన కెరీర్‌ను ప్రారంభించి ఆ తర్వాత సొంతంగా నవభారత నాట్యమాధురి అనే సంస్థను స్థాపించింది. బుచ్చిబాబు రచించిన 'ఆత్మవంచన అనే నాటికలో నటించి ఉత్తమనటిగా పేరు సంపాదించుకుంది.

సినీ ప్రవేశం

ఆమె తొలిచిత్రం సంసారం. తదుపరి రెండవ నాయికగా 1952లో ఎల్‌.వి.ప్రసాద్‌ నిర్మించిన 'పెళ్లి చేసి చూడు చిత్రంలో నటించింది. చంద్రహారం, దేవదాస్‌, అర్థాంగి, మిస్సమ్మ, దొంగరాముడు, అమరదీపం లాంటి ఎన్నో గొప్పసినిమాల్లో నటించి తన అసమాన నటనా చాతుర్యాన్ని ప్రదర్శించి ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది.
తమిళంలో శివాజీగణేశన్‌, ఎమ్‌.జి. రామ చంద్రన్‌లాంటి గొప్పనటులతో నటించింది. 1953లో 'మానం పోల మాంగల్యం అనే తమిళ సినిమాలో శివాజీ గణేశన్‌తో నటించింది. సావిత్రి నూరవ చిత్రం 'కొంజుమ్‌ సాలంగరి (తెలుగులో మురిపించే మువ్వలు). పాసమలార్‌ అనేచిత్రంలో శివాజీ గణేశన్‌ చెల్లెలుగా నటించి ఆ చిత్రాన్ని చిత్రపరిశ్రమలో నెంబర్‌వన్‌గా నిలిపి సినీపరిశ్రమకి మంచిపేరు తెచ్చిపెట్టింది.

హిందీ సినిమా రంగప్రవేశం

ఈ అందాల ముద్దుగుమ్మ సావిత్రి బాలీవ్ఞడ్‌లో కూడా నవరసాల్ని పండించింది. బహుత్‌దాహవే, ఘర్‌, బస్‌కే దేఖో, శ్రీకృష్ణ, బలరామ్‌, గంగాకి లహెరెన్‌లాంటి గొప్ప సినిమాల్లో నటించి నిర్మా తలకు కనక వర్షం కురిపించి బాలీవ్ఞడ్‌ రంగాన్ని ఓ ఊపు ఊపిన బ్యూటీక్వీన్‌ ఈమె.

దర్శకురాలిగా...

సావిత్రి ఓ గొప్ప మహానటిగానే కాక డైరెక్టర్‌గా, నిర్మాతగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించు కుంది. తెలుగులో ఆమె దర్శకత్వం చేసిన సిని మాలు 1968లో చిన్నారి పాపలు, ఇంకా చిరంజీవి, మాతృదేవత, వింతసంసారం. అలాగే తమిళంలో కూడా కుజంతామ్‌ ఉల్లమ్‌, ప్రాప్తమ్‌ వంటి సూపర్‌ హిట్‌ సినిమాలకు తన దర్శకత్వ ప్రతిభను కనబరిచి మంచిపేరు సంపాదించుకుంది.

సేవలో మిన్న

ఆమె సమాజ సేవాకార్యక్రమాల్లో కూడా పాల్గొనేది. అప్పట్లో ప్రధానమంత్రి లాల్‌బహుదూర్‌ శాస్త్రి గారిని కలిసి తన ఆభరణాలన్నింటిని ప్రధానమంత్రి సహాయనిధికి అందించింది. ఇంకా ఆంధ్రప్రదేశ్‌లో ఓ హైస్కూల్‌ని కూడా నిర్మించింది.

క్రికెట్‌ అంటే ప్రాణం

ఆమె అభిమానించే క్రీడలు క్రికెట్‌, చెస్‌. వీటిని అభిమానించడమే కాదు బాగా ఆడేది కూడా. ఆమె అభిమానించే స్పోర్ట్‌ పర్సన్‌ గారే సోబర్స్‌. ఆమె అనేక సెలబ్రిటీ క్రికెట్‌ మ్యాచ్‌లలో కూడా ఆడి అనేక బహుమతులందుకుంది.

వ్యక్తిగత జీవితం

ఆమె 1955లో జెమిని గణేశన్‌ను వివాహం చేసుకుంది. ఆమెకి ఇద్దరు పిల్లలు విజయ చాముండేశ్వరి, సతీష్‌కుమార్‌. తల్లిగా ఆమె సక్సెస్‌ అయినట్లే. 1960లో విడుదలైన 'చివరికి మిగిలేది సినిమాకు రాష్ట్రపతి నుండి ఉత్తమనటి అవార్డును, తమిళనాడు ప్రభుత్వం నుంచి కలైమామణి అవార్డును అందుకుంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి నటశిరోమణి, తమిళసినిమాలో ఉత్తమ ప్రతిభకు నడిగయార్‌ తిలకమ్‌ అనే బిరుదులను అందుకుంది. ఆమె చివర్లో సంసారజీవితంలో ఎన్నో కష్టాల్ని ఒడిదుడుకుల్ని ఎదుర్కొని, ప్రేక్షకుల్ని తన నటనతో సమ్మోహితుల్ని చేసి అతి చిన్న వయస్సులోనే తన 46వ ఏట డిసెంబర్‌ 26వతేదీ 1981న పరమపదించి సినీ పరిశ్రమకు తీరని దుఃఖాన్ని మిగిల్చింది.