Search This Blog

Chodavaramnet Followers

Wednesday, 13 March 2013

PLANTS/TREES HAVING MOST VALUABLE PROTIENS/VITAMINS FOR HUMAN GROWTH


అద్భుతమైన ఆహార విలువలు గల మొక్కలు





పోషకవిలువలు గల ఆహారం తీసు కోవడం ద్వారా శరీరం శక్తివంతమవు తుంది. ఆరోగ్యంగా ఉంటారు. అందుకోసం మనం తినే ఆహారంలో ఏ పదార్థంలో ఏ పోషకవిలువలు ఉన్నాయి. అనేది తెలిసుకోవాలసిన ఆవశ్యకత ఉంది. ఏమైనే అమ్లాలు ఉన్నాయి. విటమినులు, ఖనిజాలు, క్రొవ్వులు ఇతర పోషj పదార్థాలు ఏ ఆహారపదార్థంలో ఉన్నాయి. ఎంత ప్రమాణంలో ఉన్నాయి. తెలుసు కుంటే దాని కనుగుణంగా జీవన శైలిలో మార్పుచేసుకోవచ్చు. అందువల్ల వివిధ పదార్థాలు పోషకవిలువలను పరిశీలిద్దాం.
జీడిమామిడి పప్పులో8 ఎమైన్‌ ఆమ్లాలు 21 శాతం, మాంసకృత్తులు ఉన్నాయి.
నిమ్మ, నారింజ కన్నా జామలో 4 రెట్లు ఎక్కువ విటమిన్‌ 'సి' ఉంది.
పచ్చి చింతకాయ-టార్టారిక్‌, లాక్టిక్‌, ఎసిటక్‌ ఆమ్లాలు, ఇథనాల్‌ ఉన్నాయి.
మామిడి పండు-టార్టారిక్‌, మాలిక్‌, సిట్రిక్‌ ఆమ్లాలు, కెరోటిన్‌
మామిడి పండులో 86 రకాల చక్కెరలు ఉన్నాయి
మామిడి జీడిలో ప్రోటీన్స్‌, క్రొవ్వులు లేవు, తాజాపుచ్చలో పోటాషియం ఎక్కువ
ఖర్జూరంతో ఫాస్పరస్‌ ఎక్కువ.
జామపండు తొక్కలో ఎ,బి,సి విటమిన్లు ఉన్నాయి. తొక్కలో సహా తినాలి. జామలో 7 రకాల ఆమ్లాలు, ఎంజైములు కలవు
జామ గింజలలో భాస్వరం, ఇనుము, కాల్షియం,
పనసపండునందు -13 రకాల ఎస్టర్‌లు, 9 ఆల్కాహాల్స్‌, 5 ఆల్డిహైడ్స్‌, 5 ఆమ్లాలతోపాటు పుర్‌లిన్‌ అనే ప్రత్యేక రసాయనం ఉంది.
చింతపండులో సిట్రిక్‌, మాలిన్‌, టేౖట్రిక్‌ ఆమ్లాలు
ఉసిరికాయ- గ్లూటామిన్‌, ప్రొలైన్‌, ఎలనైన్‌, లైసిన్‌, ఎస్పార్టిక్‌ ఎమైన్‌ ఆమ్లాలు.
అత్యధిక పోషకభాగం గల కొన్ని పదార్థాలు-శాఖాహారం
-రోస్ట్‌ చేసిన వేరు శెనగ కేక్‌ -మాంస కృత్తులు
క్రొవ్వులు - ఆల్‌మండ్‌, ఎండుకొబ్బరి, నువ్వులు, నెయ్యి, కుకింగ్‌ ఆయిల్స్‌
పిండిపదార్థాలు - రాగులు, బియ్యం, రాజ్మా, ఇంగువ, ఎండుఖర్జూరం, బెల్లం, తేనె.
కాల్షియం - రాగులు, కాలీఫ్లవర్‌, కరివేప, నువ్వుల, జీలకఱ్ఱ, వాము, జున్ను, బెల్లం
ఫాస్పరస్‌ - వాము, పసుపు, ఆలమండ్‌, నుపప్పులు, ప్రత్తిగింజలు, రజ్మా, గోధుమ
ఇనుము - ఇంగువ, పిప్పళ్ళు, పసుపు, వేచిన మినుములు, కాలీఫ్లవర్‌, కొబ్బరి, తెలగపిండి
మెగ్నీషియం- సోయాబీన్స్‌, తమలపాకులు ఆల్‌మండ్‌, కాషఉ్య, అల్లం, మామిడి పండు
పొటాషియం- పాలు, ఆవు పెరుగు, కొబ్బరి, తెలగపిండి, జీలకఱ్ఱ, ధనియాలు, ఎండుమిర్చి, కారెట్‌, బంగాళదుంపలు, రాగులు, మినుములు, పెసలు.