తరచుగా పోషకాహార నిపుణులు తక్కువ కొవ్వు వుండే ఆహారాలు తీసుకుంటే వ్యాయామాలు, లేదా పీచు పదార్థాలు ఇక తినాల్సిన పని లేదని తెలుపు తారు. కాని శరీరానికి కొవ్వు కూడా కావాలి.
కీళ్ళు, ఎముకలు తేలికగా వుండాలంటే కొవ్వు బాగా పనిచేస్తుంది. కనుక కావలసినంత కొవ్వు తీసుకొని అధిక కొవ్వును నివారించుకోడానికి కొన్ని సహజ మూలికలు వాడాలి. అవేమిటో పరిశీలిద్దాం.
1. అల్లం :ఇంటిలోనే చికిత్స చేసుకోగల మంచి మందు అల్లం.కొవ్వును బాగా కరిగిస్తుంది. ప్రతిరోజూ పాలు లేదా టీ లో ఒక్క చెంచా అల్లం రసం వేసుకుంటే శారీరక కొవ్వు కరిగి ఫిట్ గా వుంటారు.
2. గోధుమగడ్డి : దీనిలో కావలసినంత పీచు పదార్థం వుంటుంది. జ్యూస్‌గా చేసి తాగేయాలి. ఐరన్, మెగ్నీషియం, ప్రొటీన్ పుష్కలంగా వుంటాయి. ఇంటిలో దీనిని పెంచుకొనవచ్చు.
3. మిరపకారం- ఇది కూడా జీర్ణక్రియను పెంచి జీవ క్రియను వేగవంతం చేస్తుంది. కొవ్వు బాగా తగ్గిస్తుంది. అయితే మితంగా వాడాలి. వైద్యుల సలహా కూడా అవసరం.
4. చేదు ఆరెంజ్ - నిమ్మజాతి పండు, ఇది శరీరంలోని కొవ్వు నిల్వలను ఏ సైడ్‌ఎఫెక్ట్ లేకుండా తగ్గిస్తుంది. గుండె సమస్యలకు కూడా బాగా పని చేస్తుంది.
5. గ్రీన్ టీ ఆకులు - ఈ మూలిక బరువు తగ్గటానికి మంచి యాంటి ఆక్సిడెంట్లు కలది. దీనిని ప్రతిరోజూ రెండు కప్పుల గ్రీన్ టీ తాగితే అదనపు కేలరీలు ఖర్చయి ఆరోగ్యం ఇస్తుంది.
అదనపు కేలరీలు తొలగించుకోడానికి ఈ అయిదు ప్రధానంగా పనిచేసి మంచి ఫలితాల నిస్తాయి.