Search This Blog

Chodavaramnet Followers

Tuesday, 12 March 2013

HOW TO INCREASE MEMORY IN KIDS





పిల్లల్లో జ్ఞాపక శక్తి పెరగా లంటే.. ముందుగా వారి జ్ఞాపక శక్తిపై వారికి నమ్మకం, ఆశావహ దృక్పధం వుండాలి. అలాగే ఇంట్లో పరిస్థితులు కూడా సక్రమంగా ఉండాలి. ఆరోగ్యకర మైన ఆహారం అందించాలి. పిల్లలూ..జ్ఞాపకశక్తిని పెంచు కునేందుకు మీకు అర్థమయ్యే పాఠ్య పుస్తకాలనే ఎన్నుకోవాలి. ఇంగ్లీషు అక్షరా లను అన్వ యించి ఫార్ములాలను, లెక్కల్ని కనుక్కోవటం లాంటివి చేసి చూడాలి.
ఒక లింకు పద్ధతి ద్వారా పాఠాలను గుర్తించుకునే ప్రయత్నం చేయాలి. అలాగే పార్ములాలను కూడా గుర్తు పెట్టుకోవాలి. ఇంగ్లీష్‌ భాషలో పదాలను గుర్తు పెట్టుకోవటం...పదాలు, అంకెలను విడగొట్టడం, బట్టీ పట్టడం, విషయాలను కుదించి రాయటం, ప్లాష్‌ కార్డులను ఉప యోగించటం లాంటివి చేయటం వల్ల కూడా జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది.
అలాగే వివిధ రేఖాపటాల ద్వారా అనేక విషయాలను గుర్తుంచుకోవటం ...పదం లేక వాక్యాల తాలూకు బొమ్మను మనసులో ఉంచుకుని జ్ఞాపకం తెచ్చుకునే ప్రయత్నం చేయటం లాంటివి చేయాలి. ఏ విషయాలను గుర్తుంచుకోవాలని అనుకుంటున్నారో, ఆ పదాలను ఒక అర్థవంతమైన వాక్యంగా తయారు చేసి జ్ఞాపకం వుంచుకోవాలి.
ఆటల ద్వారా కూడా రకరకాల విషయాలను జ్ఞాపకం ఉంచుకునే ప్రయత్నం చేయాలి. కథల రూపంలో పేర్చుకుని గుర్తుపెట్టుకోవడం...పంచేంద్రియాల ద్వారా, హాస్యం ద్వారా జ్ఞాపకశక్తిని పెంచుకునేలా ప్రయత్నించాలి.
అర్థం చేసుకుని చదవడం అనేది ఒక మంచి టెక్నిక్‌. ఇలా అర్థం చేసుకుని చదవడం వల్ల విషయాలు సులభంగా జ్ఞప్తికి వస్తాయి. ఒక విషయం గురించి చిన్న చిన్న కాగితాలపై సంక్షిప్తంగా రాయడం ద్వారా కూడా జ్ఞాపకశక్తి వృద్ధి చెందుతుంది.