తానికాయ : ఇది త్రిఫలాలలో ఒకటి. దీనిని మలబద్ధకం, విపరీతమైన కొలెస్ట్రాల్ ఉన్నప్పుడు, లివర్, స్ల్పీన్ సమస్యల్లోనూ, కంటి వ్యాధులు, బాలనెరుపుకు ఉపయోగిస్తారు.
బెల్లం, కఫతత్వం ఉన్నవారు తేనెతో కలిపి తీసుకోవాలి. గౌటీ ఆర్థరైటిస్‌లో ఆముదంతో కలపి తీసుకోవాలి. మలబద్ధకం ఉన్నప్పుడు బెల్లంతో కలిపి, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నప్పుడు అల్లం పొడితో కలిపి తీసుకోవాలి.
మండూకపర్ణి : దీనిని మందుగా కన్నా కూడా ఆహారంగా మన దేశంలో ఎక్కువగా తీసుకుంటారు. దీనిని ఒత్తిడిని తగ్గించే, జ్ఞాపకశక్తిని పెంచే లక్షణాలు ఉన్నాయి. అల్జిమీర్స్ వంటి వ్యాధులలో ఉపయుక్తం.
అతిమధురం : పిల్లలలో వచ్చే జలుబు, దగ్గులకు దీనిని చిట్కా వైద్యంగా వాడుతుంటారు. నోటి అల్సర్లకు ఇదిమంచి మందు. వృద్ధాప్యంలో శ్వాసకోశ సమస్యలకు మంచి మందని చరకుడు అభిప్రాయపడ్డాడు.
గలిజేరు : ఇది గ్రామాలలో దొరికే మూలిక. దీనిని ఆహారంగా తీసుకోవచ్చు. దీనివేర్లలో పొటాషియం నైట్రేట్ అధికంగా
ఉంటుంది. మూత్ర నాళ సంబంధ సమస్య, కొన్ని గుండె సంబంధ వ్యాధుల చికిత్సలో
ఉపయోగపడుతుంది.
పిప్పళ్ళు : ఇది జీర్ణప్రక్రియకు ఉపయోగపడుతుంది. ఆర్థైటిస్, మలబద్ధకం వంటి వాటిలో ఉపశమనాన్ని ఇస్తుంది.
జీడిగింజలు :ఇది అత్యుత్తమ పునరుజ్జీవనిగా
ఉపయోగపడుతుంది. దీనిలో కాన్సర్ నిరోధక శక్తిని ఇటీవలి అధ్యయనాలు వెల్లడించాయి. టిషఉ్యల నిర్మాణంలో, వాటిని ఆరోగ్యంగా ఉంచడంలో ఉపయోగపడటం వల్ల దాని గింజలను వృద్ధాప్య సంబంధిత సమస్య లను నివారించేందుకు సూచిస్తారు.
వృద్ధాప్యంలో వచ్చే కీళ్ళనొప్పులను తగ్గించేందుకు ఇంట్లోనే చేసుకుని వాడదగ్గ కషాయం.
మెంతులు : 100గ్రా, జీలకర్ర : 50గ్రా, మిరియాలు -05గ్రా. మూడింటిని కొద్ది నేతిలో వేయించి పొడి చేసుకొని
ఉంచుకోవాలి. ఒక చెంచా పొడిని తీసుకొని ఒక గ్లాసు పాలలో వేసి దానిని కొద్ది సేపు మరగించి రోజుకు ఒకటి రెండుసార్లు తీసుకోవాలి. ఒక వారం రోజులలోనే తేడా కనుపిస్తుంది. ఉపశమనం కలిగే వరకూ ఎన్ని రోజులైనా దీనిని తీసుకోవచ్చు.